iDreamPost
android-app
ios-app

జూనియర్ ఎన్టీఆర్ తో మల్టీ స్టారర్.. మనసులో మాట చెప్పిన ధనుష్!

  • Published Jul 22, 2024 | 8:59 AM Updated Updated Jul 22, 2024 | 8:59 AM

Dhanush Comments On Multi Starrer With Jr NTR: ధనుష్ 50 చిత్రం రాయన్ జులై 26న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో ధనుష్ కొన్ని ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు.

Dhanush Comments On Multi Starrer With Jr NTR: ధనుష్ 50 చిత్రం రాయన్ జులై 26న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో ధనుష్ కొన్ని ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు.

  • Published Jul 22, 2024 | 8:59 AMUpdated Jul 22, 2024 | 8:59 AM
జూనియర్ ఎన్టీఆర్ తో మల్టీ స్టారర్.. మనసులో మాట చెప్పిన ధనుష్!

పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ టాలెంటెండ్ యంగ్ హీరోల లిస్ట్ లో కచ్చితంగా ధనుష్ పేరు ఉంటుంది. ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ధనుష్.. తన కెరీర్ లో 50వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. తన 50వ చిత్రం రాయన్ ని తానే రాసుకుని.. డైరెక్ట్ కూడా చేశాడు. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో తీసుకొస్తున్నారు. రాయన్ మూవీ జులై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీకి సంబంధించి తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ధనుష్ మనసులో ఉన్న మాటలు కొన్ని బయట పెట్టాడు.

రాయన్ సినిమాకి సంబంధించి ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీ అందరినీ మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ధనుష్ మాట్లాడుతూ.. “ఈ మూవీ తమిళ ప్రేక్షకులతో పాటుగా.. తెలుగు వారికి కూడా బాగా నచ్చుతుంది. నేను నా కెరీర్ లో ఎంతో మంది గొప్ప డైరెక్టర్స్, నటులతో కలిసి పని చేసే అదృష్టం పొందాను. నేను నా కెరీర్ లో తప్పుల నుంచే ఎక్కువ నేర్చుకున్నాను. నాకు నటన అంటే ఎంత ఇష్టం ఉందో.. డైరెక్షన్ అంటే కూడా అంతే ఇష్టం ఉంది. అలాంటి నా ఇష్టం నుంచి వచ్చిందే ఈ రాయన్ చిత్రం. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను” అంటూ ధనుష్ వ్యాఖ్యానించాడు.

ఇంక ఈవెంట్ ఆఖరిలో యాంకర్ అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు ధనుష్ సమాధానం చెప్పాడు. అందులో భాగంగా టాలీవుడ్ లో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు అని అడిగినప్పుడు.. ధనుష్ తనకు సినిమా అంటే ఇష్టమని.. పవన్ కల్యాణ్ సార్ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మల్టీ స్టారర్ చేసే ఛాన్స్ ఉంటే ఎవరితో చేస్తారు? మహేశ్ బాబు- జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అని అడగ్గా.. తాను మల్టీ స్టారర్ చేస్తే తారక్ తో చేస్తాను అంటూ ధనుష్ తన మనసులో మాటను బయట పెట్టాడు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఒకవేళ ధనుష్ మల్టీ స్టారర్ చేసినా.. తమిళ్ తాను చేసే మల్టీ స్టారర్ లో అయినా తారక్ ని చేయాల్సిందిగా కోరే అవకాశం లేకపోలేదు. ఈ సమాధానంతో తారక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అది నిజంగా జరిగితే చాలా బాగుటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంక ఇదే స్టేజ్ మీద నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ అప్ డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. క్రిస్మస్ కి కలుద్దాం అంటూ చెప్పుకొచ్చారు. మరి.. తారక్- ధనుష్ మల్టీ స్టారర్ వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetlunabetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetbetosferjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibom