iDreamPost
android-app
ios-app

Devara: దేవర ట్రైలర్ ముందున్న రికార్డులు ఇవే! బద్దలు కొడుతుందా?

  • Published Sep 10, 2024 | 3:18 PM Updated Updated Sep 10, 2024 | 3:18 PM

Devara Trailer: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర ట్రైలర్ ని విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది మూవీ టీం. భారీ అంచనాలతో విడుదల అవుతున్న ఈ ట్రైలర్ ముందు కొన్ని రికార్డులు ఉన్నాయి.

Devara Trailer: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర ట్రైలర్ ని విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది మూవీ టీం. భారీ అంచనాలతో విడుదల అవుతున్న ఈ ట్రైలర్ ముందు కొన్ని రికార్డులు ఉన్నాయి.

  • Published Sep 10, 2024 | 3:18 PMUpdated Sep 10, 2024 | 3:18 PM
Devara: దేవర ట్రైలర్ ముందున్న రికార్డులు ఇవే! బద్దలు కొడుతుందా?

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. బాలీవుడ్ లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ ఆ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకొని ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫస్ట్ నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. కొరటాల శివ ఎన్టీఆర్ అభిమానులకు నచ్చే విధంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. పోస్టర్స్, గ్లిమ్ప్స్, సాంగ్స్ .. ఇలా ప్రతి అప్డేట్ ని కూడా ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి దాకా రిలీజయిన మూడు సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ రాబడుతున్నాయి.

ఇక మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని డిసైడ్ అయ్యింది మూవీ టీం. అందుకే అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్ ని విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది. మూవీకి ఇప్పుడు సూపర్ బజ్ వచ్చింది. అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి. ఈ టైంలో ట్రైలర్ రిలీజ్ అయితే సినిమాపై అంచనాలు కాస్తా డబుల్ నుంచి త్రిబుల్ అవుతాయి. ఈరోజు అనగా సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల కానుంది. ఈ ట్రైలర్ కచ్చితంగా యూ ట్యూబ్ లో రికార్డులు నమోదు చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక భారీ అంచనాలతో విడుదల అవుతున్న ఈ ట్రైలర్ ముందు కొన్ని రికార్డులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఇండియాలో చాలా ఫాస్ట్ గా 1 మిలియన్ వ్యూస్ రాబట్టిన ట్రైలర్ విషయానికి వస్తే.. విజయ్ ‘లియో’ మూవీ ట్రైలర్ టాప్ లో ఉంది. ఈ ట్రైలర్ కేవలం 5 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇక 24 గంటల్లో చాలా ఫాస్ట్ గా 1 మిలియన్ లైక్స్ సాధించిన ట్రైలర్ గా కూడా లియో ట్రైలర్ నిలిచింది. కేవలం 21 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్ రాబట్టింది. ఇక మొదటి 24 గంటల్లో ఎక్కువ లైక్స్ సాధించిన ట్రైలర్ గా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ‘దిల్ బేచారా’ ట్రైలర్ నిలిచింది. ఈ ట్రైలర్ మొదటి 24 గంటల్లో ఏకంగా 6.01 మిలియన్ లైక్స్ రాబట్టింది. వ్యూస్ పరంగా మొదటి 24 గంటల్లో ప్రభాస్ ‘సలార్’ ట్రైలర్ నిలిచింది. ఈ ట్రైలర్ 24 గంటల్లో ఏకంగా 116.2 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఈ రికార్డులు దేవర ట్రైలర్ ముందు ఉన్నాయి. మరి దేవర ట్రైలర్ ఈ రికార్డులు బద్దలు కొట్టి టాప్లో నిలుస్తుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetJojobetjojobetJojobetjojobetJojobetgalabetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet