iDreamPost
android-app
ios-app

రజినీకాంత్ ను భయపెడుతున్న దేవర.. అలా జరిగితే తలైవాకు కష్టమే

  • Published Oct 09, 2024 | 4:15 PM Updated Updated Oct 09, 2024 | 4:15 PM

Vettaiyan Movie: దేవర సినిమా థియేటర్ లో ఒక ఊపు ఊపేస్తోంది. ఇప్పుడు దేవర ముందు చిన్న సినిమాలు రిలీజ్ చేసినా దేవర ముందు ఆనేలా కనిపించడం లేదు. ఇక ఇప్పుడు తలైవా ను వణికిస్తుంది దేవర. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

Vettaiyan Movie: దేవర సినిమా థియేటర్ లో ఒక ఊపు ఊపేస్తోంది. ఇప్పుడు దేవర ముందు చిన్న సినిమాలు రిలీజ్ చేసినా దేవర ముందు ఆనేలా కనిపించడం లేదు. ఇక ఇప్పుడు తలైవా ను వణికిస్తుంది దేవర. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

  • Published Oct 09, 2024 | 4:15 PMUpdated Oct 09, 2024 | 4:15 PM
రజినీకాంత్ ను భయపెడుతున్న దేవర.. అలా జరిగితే తలైవాకు కష్టమే

దసరా వరకు దేవరకు ఇబ్బందికర వాతావరణం అయితే లేదు. ఇప్పుడు ఏ సినిమాలు రిలీజ్ చేసినా దేవర ముంగిట నువ్వెంత అంటూ.. దేవర వాటిని పక్కకి నెట్టేస్తుంది. వాటి లెక్కలను సముద్రంలో కలిపేస్తుంది. మిక్స్డ్ టాక్ తో మొదలైన దేవర హిట్ కొట్టింది.. డెవరోడి వేట దసరా వరకు ఆగదు.. దేవరోడు దూసుకుపోతున్నాడు. ఇలా ఇప్పటి వరకు చాలానే వింటూ వస్తున్నాం. సో దేవర మ్యానియా ఇంకొన్ని రోజులు బాగానే కొనసాగుతుంది. అందులో డౌట్ లేదు. దేవర చిన్న సినిమాలను భయపెడుతుందంటే ఒక అర్ధం ఉంది. కానీ ఏకంగా సూపర్ స్టార్ చిత్రానికే ఎసరు పెట్టేలా ఉంది. రజిని కాంత్ నటించిన వెట్టయ్యన్‌ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. అయినా కూడా వెట్టయ్యన్‌ మూవీ హడావిడి ఎక్కడా కనిపించడం లేదు . దీనితో రజిని సినిమాను దేవర భయపెడుతుంది అంటూ టాక్ వినిపిస్తుంది.

అందులో వాస్తవం లేకపోలేదు . ఎందుకంటే సాధారణంగా ఎంత చిన్న సినిమాకైనా రిలీజ్ కు ముందు బాగానే ప్రమోషన్స్ జరుగుతాయి. కానీ వెట్టయ్యన్‌ కు మాత్రం ఇంత వరకు ఎలాంటి హైప్ లేదు. అటు కోలీవుడ్ లో కూడా అంతగా బజ్ వినిపించడం లేదు. దీనితో సినిమాలో స్టఫ్ లేదు కాబట్టి ప్రమోషన్స్ జరగడం లేదని.. రజినీకాంత్ కు ఆరోగ్యం బాలేదు కాబట్టి ప్రమోషన్స్ లేవని.. రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్స్ సంగతి పక్కన పెడితే.. కనీసం ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్ , ట్రైలర్ కైనా ఎంతో కొంత హైప్ క్రియేట్ అయ్యి ఉండాలి. కానీ అక్కడ అలాంటి టాక్ ఏమి వినిపించడం లేదు. ఒకవేళ డైరెక్ట్ గా థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత.. మూవీ ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా దేవరోడు సైడ్ అవ్వాల్సిందే. లేదా యావరేజ్ , ప్లాప్ టాక్ వస్తే మాత్రం.. వెట్టయ్యన్‌ రికార్డ్స్ సముద్రంలో కలిసిపోవాల్సిందే. మరి దేవర ఎఫెక్ట్ రజిని సినిమా మీద పడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

దేవర ప్రస్తుతం 500 కోట్ల మార్క్ కు దగ్గరగా ఉంది. ఎలాగూ ఇప్పుడు వెట్టయ్యన్‌ తప్ప ఇంకే సినిమాలు దేవరకు పోటీగా లేవు. వెట్టయ్యన్‌ కూడా హిట్ ఆ ఫట్టా అనే విషయం మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది. ఒకవేళ వెట్టయ్యన్‌ ఫెయిల్ అయితే కనుక.. థియేట్రికల్ రన్ అయ్యే వరకు దేవరకు డోకా లేదు. 600 కోట్ల మార్క్ ను రీచ్ అవుతుందనే అంచనా వేస్తున్నారు. సో ఇప్పుడు రెండు ఒకదానిమీద ఒకటి డిపెండ్ అయ్యి ఉన్నాయి. వెట్టయ్యన్‌ రీలిజ్ మొదటి షో కంప్లీట్ అయ్యేవరకు రిజల్ట్ ఏంటి అనేది చెప్పలేము. మరి దేవర ఫీవర్ తలైవా ను వదులుతుందో లేదో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş