అదిరిపోయిన NTR దేవర ట్రైలర్‌! ఈ షాట్స్‌ మాత్రం హైలెట్‌..!

Devara Movie Trailer: తారక్ అభిమానులంతా ఈరోజు కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఆరోజు రానే వచ్చింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర మూవీ ట్రైలర్ వచ్చేసింది. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దాం.

ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమాపై.. మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా.. రిలీజ్ కు ముందే రికార్డ్స్ బ్రేక్ చేసింది. వీటి అన్నిటికి మించి దేవర కథ తెలుసుకోవాలని తారక్ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర మూవీ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ ను గమనిస్తే కనుక.. పూర్తి యాక్షన్స్ సీన్స్ తో నిండిపోయిందని చెప్పి తీరాలి. రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ అంటూ వచ్చిన ఆ డైలాగ్స్.. సినిమా మీద అమాంతం అంచనాలను పెంచేశాయి. ఇక ఆ తర్వాత తారక్ చెప్పిన ‘మనిషికి బ్రతికేంత దైర్యం చాలు.. చంపేంత దైర్యం కాదు ‘ అనే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయని చెప్పి తీరాలి. మొత్తానికి కంప్లీట్ యాక్షన్, లవ్ , డ్రామా సీన్స్ తో వస్తున్న ఈ మూవీ.. తారక్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెడుతుందని చెప్పి తీరాలి.

Show comments