iDreamPost
android-app
ios-app

అదిరిపోయిన NTR దేవర ట్రైలర్‌! ఈ షాట్స్‌ మాత్రం హైలెట్‌..!

  • Published Sep 10, 2024 | 5:21 PM Updated Updated Sep 10, 2024 | 6:12 PM

Devara Movie Trailer: తారక్ అభిమానులంతా ఈరోజు కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఆరోజు రానే వచ్చింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర మూవీ ట్రైలర్ వచ్చేసింది. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దాం.

Devara Movie Trailer: తారక్ అభిమానులంతా ఈరోజు కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఆరోజు రానే వచ్చింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర మూవీ ట్రైలర్ వచ్చేసింది. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దాం.

  • Published Sep 10, 2024 | 5:21 PMUpdated Sep 10, 2024 | 6:12 PM
అదిరిపోయిన NTR దేవర ట్రైలర్‌! ఈ షాట్స్‌ మాత్రం హైలెట్‌..!

ప్రస్తుతం ప్రేక్షకులంతా తారక్ నటించిన దేవర సినిమా కోసం ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగానే తారక్ సినిమాలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటిది తారక్ ఆరేళ్ళ తర్వాత సోలో గా స్క్రీన్ మీద దున్నేస్తున్నాడంటే.. ఇక అభిమానుల ఆనందానికి అడ్డే ఉండదు. అందుకేనేమో మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా.. సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. అంతే కాకుండా వచ్చిన ప్రతి అప్ డేట్ ను అభిమానులు భారీ రేంజ్ లో హిట్ చేసేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న దేవర మూవీ ట్రైలర్ వచ్చేసింది.

ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమాపై.. మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా.. రిలీజ్ కు ముందే రికార్డ్స్ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. వీటి అన్నిటికి మించి దేవర కథ తెలుసుకోవాలని తారక్ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర మూవీ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ ను గమనిస్తే కనుక.. పూర్తి యాక్షన్స్ సీన్స్ తో నిండిపోయిందని చెప్పి తీరాలి. రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ అంటూ వచ్చిన ఆ డైలాగ్స్.. సినిమా మీద అమాంతం అంచనాలను పెంచేశాయి. ఇక ఆ తర్వాత తారక్ చెప్పిన ‘మనిషికి బ్రతికేంత దైర్యం చాలు.. చంపేంత దైర్యం కాదు ‘ అనే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయని చెప్పి తీరాలి. మొత్తానికి కంప్లీట్ యాక్షన్, లవ్ , డ్రామా సీన్స్ తో వస్తున్న ఈ మూవీ.. తారక్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెడుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

దేవర రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. దీనితో ఇటు అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో.. అటు మేకర్స్ కూడా అదే రేంజ్ లో.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి సెప్టెంబర్ 27న థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ ఆడియన్స్ తో.. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అన్ని కాసుల వర్షం తో నిండిపోడానికి రెడీగా ఉన్నాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇది నిజంగానే రక్తంతో ఎరుపెక్కిన కథల ఉండబోతుందని చెప్పి తీరాల్సిందే. మరి ఈ ట్రైలర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. మరి ఈ ట్రైలర్ పై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş