iDreamPost
android-app
ios-app

దేవర సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్! పోస్టర్ అదిరింది!

  • Published Aug 02, 2024 | 5:23 PM Updated Updated Aug 02, 2024 | 5:23 PM

Devara Movie Second Single Update: జూనియర్ ఎన్టీఆర్ దేవర నుంచి అదిరిపోయే అప్ డేట్ రానే వచ్చింది. దేవర సెకండ్ సింగిల్ కి సంబంధించి మూవీ టీమ్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. అలాగే సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనే విషయాన్ని వెల్లడించారు.

Devara Movie Second Single Update: జూనియర్ ఎన్టీఆర్ దేవర నుంచి అదిరిపోయే అప్ డేట్ రానే వచ్చింది. దేవర సెకండ్ సింగిల్ కి సంబంధించి మూవీ టీమ్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. అలాగే సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనే విషయాన్ని వెల్లడించారు.

  • Published Aug 02, 2024 | 5:23 PMUpdated Aug 02, 2024 | 5:23 PM
దేవర సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్! పోస్టర్ అదిరింది!

తెలుగు సినీ చరిత్రలో జూనియర్ ఎన్టీఆర్ స్థానం, స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నటనలో ఆకాశమంత ఎత్తు ఎదిగిన తారక్.. ఆర్ఆర్ఆర్ మూవీతో స్టార్ గా పాన్ ఇండియా స్థాయిని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ దేవర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం యావత్ దేశం ఎదురుచూస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే.. దేవర అప్డేట్స్ మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వచ్చిన ఫియర్ సాంగ్ యూట్యూబ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ “దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక” అంటూ తారక్ ఫ్యాన్స్ టాప్ లేపేస్తున్నారు. అయితే.. దేవర నుండి సెకండ్ సింగిల్ ఎప్పుడు అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.

దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రానుంది. రిలీజ్ పరంగా ఎలాంటి అవాంతరాలు లేవు. ప్రమోషన్ విషయంలోనే కాస్త స్లోగా ఉన్నారు. టీమ్ స్లోగా ఉన్నా, టైగర్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటి నుండో సోషల్ మీడియాలో దుమ్మురేపేస్తున్నారు. ఇందులో భాగంగానే సెకండ్ సింగిల్ పై అప్డేట్ కావాలంటూ వారం రోజులుగా ట్విట్టర్ లో హీట్ పుట్టిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ దేవర టీమ్ దిగి వచ్చింది. మూవీ నుండి సెకండ్ సాంగ్ పై ఓ రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసి కూల్ అప్డేట్ ఇచ్చింది. రిలీజైన పోస్టర్ లో జాన్వీ దేవకన్యలా మెరిసిపోతుండగా.., జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కూల్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఆగస్టు 5న ఈ సెకండ్ సింగిల్ రిలీజ్ కాబోతున్నట్టు పోస్టర్ లో తెలియచేశారు.

Sizzling Duo ka Love Dhamaka devara

ఇక దేవర మూవీపై పాన్ ఇండియా లెవల్లో బజ్ క్రియేట్ కావడంతో కొరటాల చాలా విషయాల్లో జాగ్రత్త తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యాక.. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి.., మరో మాస్ థీమ్ సాంగ్ విడుదలకి టీమ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక ఇందులో తారక్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. మంచి రిలీజ్ డేట్ దొరకడం, అందుకు తగ్గట్టే ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోవడంతో దేవర ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అన్న లెక్కలు అప్పుడే మొదలైపోయాయి. మరి.. ఈ కొత్త పోస్టర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి!

 

View this post on Instagram

 

A post shared by Devara Movie (@devaramovie)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibomcasibom