iDreamPost
android-app
ios-app

దేవర నుంచి ఫ్యాన్స్ కు మరో మాస్ ట్రీట్ .. రిలీజ్ ట్రైలర్ వచ్చేస్తుంది.

  • Published Sep 21, 2024 | 12:36 PM Updated Updated Sep 21, 2024 | 12:36 PM

Devara Movie Release Trailer: ఇప్పటివరకు దేవర నుంచి వచ్చిన గ్లిమ్ప్స్ , సాంగ్స్ అవన్నీ ఒకెత్తయితే.. ఇక రాబోయే అప్ డేట్స్ ఒకెత్తు. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది కదా.. ఇంకా ఏం అప్ డేట్స్ అనుకుంటే పొరపాటే. ఈ మూవీ నుంచి మరొక అప్ డేట్ ఉందట. అదేంటో చూసేద్దాం.

Devara Movie Release Trailer: ఇప్పటివరకు దేవర నుంచి వచ్చిన గ్లిమ్ప్స్ , సాంగ్స్ అవన్నీ ఒకెత్తయితే.. ఇక రాబోయే అప్ డేట్స్ ఒకెత్తు. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది కదా.. ఇంకా ఏం అప్ డేట్స్ అనుకుంటే పొరపాటే. ఈ మూవీ నుంచి మరొక అప్ డేట్ ఉందట. అదేంటో చూసేద్దాం.

  • Published Sep 21, 2024 | 12:36 PMUpdated Sep 21, 2024 | 12:36 PM
దేవర నుంచి ఫ్యాన్స్ కు మరో మాస్ ట్రీట్ .. రిలీజ్ ట్రైలర్ వచ్చేస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ దేవర. సెప్టెంబర్ 27న థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే. మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా అదే హైప్ కొనసాగుతూ ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రతి అప్ డేట్ కు హైప్ ఇంకాస్త పెరుగుతూ వెళ్తుంది. ఎప్పుడు ఎలాంటి అప్ డేట్ వస్తుందా అని అభిమానులంతా దేవరపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇక దేవర నుంచి లాస్ట్ గా వచ్చింది ట్రైలర్ మాత్రమే. మొదట్లో ఈ ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కానీ.. తర్వాత బాగానే మెప్పించింది. ఇక ఆ తర్వాత మేకర్స్ సినిమాలో మొదటి నుంచి బాగా హైప్ ఉన్న ఆయుధ పూజ సాంగ్ ను ఈ వారంలోనే రిలీజ్ చేస్తాం అంటూ చెప్పారు. కాని అది పోస్ట్ పోన్ అయింది. దీనితో ఎలాగూ రిలీజ్ కు ఇంకా ఎంతో సమయం లేదు కదా అని ప్రేక్షకులు కూడా ఈ విషయాన్నీ లైట్ తీసుకున్నారు. కానీ రిలీజ్ లోపే మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ను రివీల్ చేయనున్నారట మేకర్స్. ఆ వివరాలేంటో చూసేద్దాం.

దేవర మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ముహూర్తం దగ్గర పడుతుంది. దీనితో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ ఈవెంట్ ను సెప్టెంబర్ 22న హైదరాబాద్ లోని నోవొటెల్ లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏముంటుందిలే అని లైట్ తీసుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ ఈవెంట్ లో దేవర మూవీ మేకర్స్ ఫ్యాన్స్ కు ఊహించని సర్ప్రైజ్ ఇస్తున్నారు . అదేంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా.. దేవర రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ముందుగా విడుదల చేసిన ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో.. అభిమానులు కోసం ఈ ట్రైలర్ ను రివీల్ చేస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి. కాబట్టి మూవీ రిలీజ్ కు ముందే.. ఫ్యాన్స్ కు మరోసారి మాస్ ట్రీట్ ఖాయం.

ఇక రీసెంట్ గా యంగ్ హీరోస్ సిద్దు జొన్నలగడ్డ , విశ్వక్ సేన్ తో జరిగిన ఇంటర్వ్యూలో.. తారక్ , కొరటాల శివ మూవీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. దీనితో సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగిపోయాయి. ఇక మూవీ రిలీజ్ తర్వాత కూడా ఇదే హైప్ కొసాగితే కనుక.. వారం లోపే బ్రేక్ ఈవెన్ అందుకునే అవకాశాలు లేకపోలేదు. అందులోను ఆ వీక్ లో కానీ ఆ తర్వాత కానీ ఎలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కు రెడీగా లేవు. కాబట్టి సక్సెసఫుల్ గా థియేటర్స్ లో లాంగ్ రన్ ను మైంటైన్ చేస్తుంది దేవర. ఇదంతా చూస్తుంటే.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ రావడం కాస్త లేట్ అయినా కూడా.. సరైన టైమ్ కి ఎంట్రీ ఇచ్చి లెక్కలు తేల్చడానికి రెడీ అవుతున్నాడేమో అనిపిస్తుంది. ఏమౌతుందో తెలియాలంటే సెప్టెంబర్ 27వరకు వెయిట్ చేయాల్సిందే. మరి దేవర రిలీజ్ ట్రైలర్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetjojobetgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişbetcio