iDreamPost
android-app
ios-app

దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. థియేటర్స్ ఎరుపెక్కడం ఖాయం

  • Published Sep 22, 2024 | 2:37 PM Updated Updated Sep 22, 2024 | 3:27 PM

Devara Second Trailer Released: దేవర మూవీ మేకర్స్ మూవీ రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తాం అని అనౌన్స్ చేసి... చెప్పిన సమయానికి రిలీజ్ చేయకపోవడంతో.. ఫ్యాన్స్ నిరాశ చెందిన మాట వాస్తవమే. కానీ ఇంతలోనే సడెన్ గా ట్రైలర్ ను రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు.

Devara Second Trailer Released: దేవర మూవీ మేకర్స్ మూవీ రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తాం అని అనౌన్స్ చేసి... చెప్పిన సమయానికి రిలీజ్ చేయకపోవడంతో.. ఫ్యాన్స్ నిరాశ చెందిన మాట వాస్తవమే. కానీ ఇంతలోనే సడెన్ గా ట్రైలర్ ను రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు.

  • Published Sep 22, 2024 | 2:37 PMUpdated Sep 22, 2024 | 3:27 PM
దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. థియేటర్స్ ఎరుపెక్కడం ఖాయం

నిజమే దేవర సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే తారక్ ఉండే క్రేజ్ అలాంటిది. అయితే ఈసారి తారక్ కు ఉండే క్రేజ్ తో పాటు., దేవర కథ కూడా ఈసారి ఈ రేంజ్ లో హైప్ కొనసాగడానికి ఓ కారణం. ఇప్పటివరకు దేవర గురించి మీడియా సోషల్ మీడియా లో మాత్రమే బజ్ వినిపించింది.. సెప్టెంబర్ 27న ఏ క్రేజ్ థియేటర్స్ లో కనిపించబోతుంది. అయితే రీసెంట్ గా వచ్చిన ఓ రెండు అప్డేట్స్ విషయంలో మాత్రం దేవర ఫ్యాన్స్ నిరాశ చెందారు . దానిలో ఒక అప్ డేట్ ను సడెన్ గా రిలీజ్ చేసి.. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు మేకర్స్.

దేవర సినిమా మీద ప్రస్తుతం ప్రేక్షకులంతా విపరీతమైన హైప్ లో ఉన్నారు. రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉండడంతో కేవలం కథ కోసం మాత్రమే ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మొదటి ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో.. రెండో ట్రైలర్ ను రిలీజ్ చేస్తాం అని చెప్పారు. కానీ అనుకున్న టైం కు ట్రైలర్ రాకపోవడంతో.. కాస్త నిరాశ చెందారు. ఇక ఇప్పట్లో అయితే ఈ ట్రైలర్ వస్తుందని అనుకోలేదు ప్రేక్షకులు.. కానీ ఇంతలోనే అదిరిపోయే ట్రైలర్ ను రిలీజ్ చేసి.. గూస్ బంప్స్ తెప్పించారు. ట్రైలర్ ను గమనిస్తే .. తారక్ వాయిస్ తో స్టార్ అయింది ఈ ట్రైలర్. భయం పోవాలంటే దేవుడి కథ వినాలి. భయం గురించి తెలియాలంటే దేవర కథ వినాలి అంటూ వచ్చిన డైలాగ్స్ కు థియేటర్స్ తగలబడిపోవడం ఖాయం. మొదటి ట్రైలర్ కంటే కూడా ఈ ట్రైలర్ దేవర సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసింది. సముద్రం ఎక్కి సముద్రాన్ని ఎలాడంతో పాటు… థియేటర్స్ లో కాసుల వర్షం కూడా కురిపించి.. ఇండస్ట్రీని ఏలడం ఖాయం. ఇక సినిమా రికార్డ్స్ గురించి కూడా ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. కచ్చితంగా లెక్కలు తిరగరాస్తుంది.

ఇక ఇదిలా ఉంటే… సెకండ్ ట్రైలర్ ను సడెన్ గా రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేసినట్లే… మూవీ రిలీజ్ లోపు ఆయుధ పూజ సాంగ్ కూడా రిలీజ్ చేసేలా ఉన్నారు మేకర్స్. ఏమౌతుందో చూడాలి. ఈరోజే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయనున్నారు. సో మొత్తానికి ఎప్పుడెప్పుడా అనే రోజు దగ్గర పడుతుంది. మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుకున్న కొద్దీ అభిమానులలో మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. అప్పుడే పలు ప్రాంతాల్లో ఈ హడావిడి మొదలైపోయింది కూడా. ఇప్పటివరకు చూసిన హైప్ కంటెంట్ ఒకటైతే ఇకపై చూసేది.. మరో లెవెల్. మరి ఈ సెకండ్ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis