iDreamPost
android-app
ios-app

దేవర రిలీజ్ ట్రైలర్ ఆలస్యం.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

  • Published Sep 22, 2024 | 1:16 PM Updated Updated Sep 22, 2024 | 1:16 PM

Devara Release Trailer Update: దేవర నుంచి ఆల్రెడీ ఇప్పటివరకు రావాల్సిన అప్డేట్స్ అన్ని వచ్చేశాయి. ప్రతిదీ అందరిని మెప్పించింది. ఫ్యాన్స్ ఫుల్ హైప్ లో ఉండగా.. ఆయుధ పూజ , సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తాం అన్నారు. తీరా ఇప్పుడు చూస్తే రెండు లేవు.

Devara Release Trailer Update: దేవర నుంచి ఆల్రెడీ ఇప్పటివరకు రావాల్సిన అప్డేట్స్ అన్ని వచ్చేశాయి. ప్రతిదీ అందరిని మెప్పించింది. ఫ్యాన్స్ ఫుల్ హైప్ లో ఉండగా.. ఆయుధ పూజ , సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తాం అన్నారు. తీరా ఇప్పుడు చూస్తే రెండు లేవు.

  • Published Sep 22, 2024 | 1:16 PMUpdated Sep 22, 2024 | 1:16 PM
దేవర రిలీజ్ ట్రైలర్ ఆలస్యం.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆగమనానికి సరిగ్గా ఐదు రోజులు మాత్రమే ఉంది. అటు ఇండస్ట్రీ వర్గాలు . ఇటు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . దాదాపు ఇప్పటివరకు రావాల్సిన అప్ డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఇక కథ తెలుసుకోవడం , రికార్డ్స్ బ్రేక్ చేయడం మాత్రం బ్యాలన్స్ . అప్ డేట్స్ విషయంలో కొన్ని సార్లు ఆలస్యం అయినా కూడా అభిమానులు అడ్జెస్ట్ అయ్యారు. ఇక మేకర్స్ కూడా రిలీజ్ కు కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు . ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అసలు చిక్కు ఇప్పుడే వచ్చింది . దేవర నుంచి ఆయుధ పూజ , రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఈ విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మేకర్స్ మాట తప్పారు. అదేంటో చూసేద్దాం.

దేవర మూవీ మేకర్స్ ఆయుధ పూజ , రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తాం అని చెప్పడంతో.. అభిమానులంతా ఈ అప్ డేట్స్ పైన విపరీతంగా అంచనాలను పెంచుకున్నారు. ఆల్రెడీ ఏ టైం కి రిలీజ్ చేస్తారు అనే విషయాలు కూడా చెప్పారు. కానీ ఇప్పడు చూస్తే మునుపటిలానే మేకర్స్ మాట తప్పారు . చెప్పిన సమయానికి అప్ డేట్స్ రాకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనితో మేకర్స్ త్వరలోనే రిలీజ్ అప్ డేట్స్ ఇస్తాం అని క్లారిటీ ఇచ్చారు. ముందుగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో. వారికోసమే సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తాం అని చెప్పారు.. కానీ ఇప్పుడు అవేమి లేవు . మూవీ రిలీజ్ కు ఇంకా వారం సమయం కూడా లేదు. మరి ఈలోపు ఈ రెండు అప్డేట్స్ ను ఇస్తారో లేదో చూడాలి.

ట్రైలర్ సంగతి అటు ఉంచితే… ఆయుధ పూజ సాంగ్ మీద ఫుల్ హైప్ నడుస్తుంది.. ఏకంగా తారక్ , కొరటాల శివ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో ఈ సాంగ్ మూవీకే హైలెట్ గా నిలుస్తుందని చెప్పారు. దీనితో థియేటర్స్ తగలబడిపోవడం ఖాయం అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. ఈ అప్ డేట్స్ విషయంలో అసంతృప్తి చెందినా కానీ… మూవీ మీద మాత్రం అదే హైప్ నెలకొంది. సెప్టెంబర్ 27 వస్తే కానీ అసలు రికార్డ్స్ మొదలవ్వవు. ఇక దేవర రికార్డులు వేట కోసం ఇండస్ట్రీ ఎదురుచూస్తున్నారు. మరి ఈ మూవీతో తారక్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో .. జాన్వీ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş