iDreamPost
android-app
ios-app

Devara Movie: ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు దేవర రెడీ! సక్సెస్ మీట్ ఎప్పుడు- ఎక్కడ?

  • Published Sep 28, 2024 | 6:19 PM Updated Updated Sep 28, 2024 | 6:19 PM

Is Devara Movie Makers Planning Success Meet: దేవర దెబ్బకు బాక్సాఫీస్ ఎరుపెక్కింది. కలెక్షన్స్ ఊచకోతకు హద్దులు లేకుండా పోయాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ అందబోతోంది అంటున్నారు. అదే సక్సెస్ మీట్ ఉండబోతోంది అని టాక్ స్టార్ట్ అయ్యింది.

Is Devara Movie Makers Planning Success Meet: దేవర దెబ్బకు బాక్సాఫీస్ ఎరుపెక్కింది. కలెక్షన్స్ ఊచకోతకు హద్దులు లేకుండా పోయాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ అందబోతోంది అంటున్నారు. అదే సక్సెస్ మీట్ ఉండబోతోంది అని టాక్ స్టార్ట్ అయ్యింది.

  • Published Sep 28, 2024 | 6:19 PMUpdated Sep 28, 2024 | 6:19 PM
Devara Movie: ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు దేవర రెడీ! సక్సెస్ మీట్ ఎప్పుడు- ఎక్కడ?

దూకే ధైర్యమా జాగ్రత్త.. All Hail.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మ్యూజిక్కు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా అనిరుధ్ కి అయితే గుడి కట్టేసేలా ఉన్నారు. ఇంక మూవీ లవర్స్ అంతా దేవర థియేటర్లకు క్యూ కడుతున్నారు. మొదటి రోజు ఎక్కడో కాస్త డివైడ్ టాక్ అనిపించింది. కానీ, రెండో రోజుకు లెక్క మారింది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా దేవర దెబ్బకు ఫిదా అయిపోయారు. ఎందుకో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హై ఎక్స్ పెక్టేషన్స్ తో వెళ్లి నెగిటివ్ చేసినట్లు కనిపించింది. కానీ, ఇప్పుడు జనరల్ ఆడియన్స్ థియేటర్ కు వస్తున్నందున అసలు టాక్ బయటకు వస్తోంది. ఈ టాక్ చూశాక ఫ్యాన్స్ దేవర ముంగిట నువ్వెంత.. ALL Hail అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ కి ఇంకో శుభవార్త చెప్పేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు అని తెలుస్తోంది. అయితే సక్సెస్ మీట్ ఎక్కడ? ఎప్పుడ? అనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

దేవర కత్తి పదునుకు బాక్సాఫీస్ గడ గడ వణికిపోతోంది. తొలిరోజు దేవర దెబ్బకు కాసుల వర్షం కురిసింది. బాక్సాఫీస్ అనే సంద్రం దేవర కలెక్షన్స్ కోతకు ఎరుపెక్కింది. వరల్డ్ వైడ్ గా దేవర ఏకంగా 172 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని అధికారిక ఒక పోస్టర్ రూపంలో మేకర్స్ ప్రకటించారు. ఇంకేముంది.. ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్లకి అంతకు మించి కిక్కిచ్చే వార్త ఒకటి అందుతోంది. దేవర మూవీ సక్సెస్ మీట్ కోసం సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో తారక్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్న విషయం తెలిసిందే. అందుకే వాళ్ల ఆకలిని సక్సెస్ మీట్ తో తీర్చాలి అని మేకర్స్ ఫిక్స్ అయినట్లు సమాచారం.

అందుకోసం ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు అంటున్నారు. అయితే సక్సెస్ మీట్ విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలని ఫిక్స్ అయినట్లున్నారు. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ మిగిల్చిన గాయాలు ఇంకా అలాగే ఉన్నాయి. తారక్ కూడా ఈవెంట్ రద్దు కావడంపై నిరాశ వ్యక్తం చేశాడు. తన అభిమానులు పడిన ఇబ్బందులకు చలించిపోయాడు. తారక్ తన అభిమానులే తన కుటుంబం అంటూ ఉంటాడు. అందుకే ఈసారి ఫ్యాన్స్ కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తోంది. సక్సెస్ మీట్ కోసం పకడ్బందీగా ప్లానింగ్ అయితే నడుస్తోందని ఇన్ సైడ్ టాక్. ఈసారి మాత్రం కచ్చితంగా ఓపెన్ గ్రౌండ్ లోనే ఈవెంట్ ఉంటుంది అంటున్నారు. అయితే ప్లేస్ విషయంలోనే కాస్త తర్జన భర్జనలు జరుగుతున్నాయి.

సక్సెస్ మీట్ కి ఫస్ట్ ఆప్షన్ మాత్రం హైదరాబాద్ అంటున్నారు. భాగ్యనగరంలో ఓపెన్ గ్రౌండ్ లో పెట్టాలి అనేది వాళ్ల కాన్సెప్ట్ అని తెలుస్తోంది. అనుమతుల విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ హైదరాబాద్ కాదు అనుకుంటే.. ఏపీకి షిఫ్ట్ అయితే బెటర్ అనుకుంటున్నారంట. ప్లేస్ ఫిక్స్ కాకపోయినా.. సక్సెస్ మీట్ మాత్రం ఫిక్స్ అయిపోయింది అంటున్నారు. వస్తున్న వార్తలు గనుక నిజమైతే.. తారక్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. సక్సెస్ మీట్ మైదానం కాస్తా అభిమాన సంద్రంలా మారిపోతుందేమో? క్లోజ్డ్ డోర్ ఈవెంట్ కే 30 వేల మంది వచ్చారు. అదే ఓపెన్ గ్రౌండ్ లో సక్సెస్ మీట్ అంటే.. లక్ష మందికి తగ్గకుండా వస్తారు అనేది అంచనా. అయితే ఇది ఇంకా అధికారికం కాదులెండి. అఫీషియల్ న్యూస్ వచ్చేవరకు ఫ్యాన్స్ కాస్త ఓపిక పట్టాలి. మరి.. దేవర సక్సెస్ మీట్ పెట్టాలి అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio