iDreamPost
android-app
ios-app

రిలీజ్ కు ముందే రికార్డుల వేట.. దేవర దెబ్బకు పుష్ప-2 ఔట్

  • Published Sep 18, 2024 | 12:40 PM Updated Updated Sep 18, 2024 | 12:40 PM

Devara Movie : దేవర సినిమా రిలీజ్ కు కేవలం కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. దీనితో అభిమానులంతా మూవీ చూడడానికి మరింత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ క్రమంలో దేవర రికార్డుల దెబ్బ పుష్ప-2 పై పడనుంది. ఆ వివరాలేంటో చూసేద్దాం.

Devara Movie : దేవర సినిమా రిలీజ్ కు కేవలం కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. దీనితో అభిమానులంతా మూవీ చూడడానికి మరింత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ క్రమంలో దేవర రికార్డుల దెబ్బ పుష్ప-2 పై పడనుంది. ఆ వివరాలేంటో చూసేద్దాం.

  • Published Sep 18, 2024 | 12:40 PMUpdated Sep 18, 2024 | 12:40 PM
రిలీజ్ కు ముందే రికార్డుల వేట.. దేవర దెబ్బకు పుష్ప-2 ఔట్

దేవర సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిలీజ్ కు ముందే ఈ మూవీ చాలా రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేసింది. కొరటాల శివ- తారక్ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్ డేట్ విషయంలోనూ.. మేకర్స్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ వస్తున్నారు. అలాగే అభిమానులు కూడా వచ్చిన ప్రతి అప్ డేట్ ను వైరల్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీనితో ఈ మూవీ రిలీజ్ కు ముందే రికార్డ్స్ వేట మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు ఈ మూవీ రికార్డ్స్ దెబ్బ.. పుష్ప-2 పై పడింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమాలు మొత్తం మూడు ఉన్నాయి. గేమ్ ఛేంజర్, పుష్ప-2 , దేవర. వీటిలో ఎక్కువమంది ఆసక్తి చూపించే సినిమాలు దేవర , పుష్ప-2.. ఈ రెండు సినిమాలకు రిలీజ్ కు ముందే ప్రేక్షకులలో భారీ హైప్ నెలకొంది. ఇక ప్రస్తుతం దేవర మూవీ రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేసిందో చూస్తూనే ఉన్నాము. మూవీ నుంచి రిలీజ్ అయినా పాటలు , ట్రైలర్ అన్ని కూడా రిలీజ్ అయినా కొద్దీ గంటల్లో ట్రెండింగ్ లో నిలిచాయి. ఇక అమెరికాలో ఈ మూవీ కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్స్ ప్రీ సేల్ లో.. మిలియన్ డాలర్స్ ను సంపాదించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా దేవర కొత్త రికార్డ్ సృష్టించింది. ఇదిలా ఉంటే బుక్ మై షో లో దేవర పుష్ప-2 లో క్రాస్ చేసినట్లు బుక్ మై షో వెల్లడించింది. పుష్ప-2 మూవీని చూసేందుకు 3లక్షల 34 వేల మంది ఆసక్తి చూపించగా.. దేవర చూసేందుకు 3 లక్షల 36 వేల మంది ఆసక్తి చూపిస్తున్నారట. ఇలా ఈ మూవీ రిలీజ్ కు ముందే రికార్డ్స్ వేట మొదలెట్టింది.

ఇక ప్రస్తుతం రిలీజ్ కు ఎంతో సమయం లేకపోవడంతో.. మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. అంతే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ , ప్లేస్ కూడా ఫిక్స్ చేసేసారు. ఇక ఈ మూవీ నుంచి రావాల్సిన ఆయుధ పూజ సాంగ్ కూడా రెండు రోజుల్లో వచ్చేస్తుంది. సో ఇక ప్రేక్షకులు సినిమా చూసి థ్రిల్ అవ్వడం మాత్రమే బ్యాలన్స్ . ఆల్రెడీ ఇప్పటివరకు వచ్చిన టాక్ తో ఈ మూవీ సగం హిట్ అయినట్లే.. కేవలం కలెక్షన్స్ లెక్క తేల్చడమే మిగిలి ఉంది. ఇప్పుడే ఇలా ఉంటె ఇక రిలీజ్ తర్వాత దేవర బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş