iDreamPost
android-app
ios-app

Devara Movie: నెత్తుటి అలల్లో కత్తి కడుగుతూ దేవర అరాచకం! అప్డేట్ అదిరింది!

దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 8వ తేదీన మూవీ గ్లింప్స్‌ విడుదల కానుంది. ఈ గ్లింప్స్‌కు సంబంధించిన ఈ సాయంత్రం ఓ అప్‌డేట్‌ వచ్చింది.

దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 8వ తేదీన మూవీ గ్లింప్స్‌ విడుదల కానుంది. ఈ గ్లింప్స్‌కు సంబంధించిన ఈ సాయంత్రం ఓ అప్‌డేట్‌ వచ్చింది.

Devara Movie: నెత్తుటి అలల్లో కత్తి కడుగుతూ దేవర అరాచకం! అప్డేట్ అదిరింది!

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ – కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ 2024, ఏప్రిల్‌ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. మొత్తం రెండు భాగాలుగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇక, ఈ సినిమాకు సంబంధించి జనవరి 8వ తేదీన ఫస్ట్‌ గ్లింప్స్‌ బయటకు రానుంది. ఈ గ్లింప్స్‌ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు.

ఇక, ఈ గ్లింప్స్‌కు సంబంధించి శనివారం సాయంత్రం ఓ అప్‌డేట్‌ వచ్చింది. గ్లింప్స్‌లోని ఓ షాట్‌ను నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ విడుదల చేసింది. బ్లడ్‌ బాత్‌ పేరిట విడుదల అయిన ఆ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సోషల్‌ మీడియాలో ట్రైండింగ్‌లోకి వెళ్లింది. ఆ గ్లింప్స్‌ అప్‌డేట్‌లో.. జూనియర్‌ ఎన్టీఆర్‌ తన ఆయుధాన్ని పారే నీళ్లలో కడుగుతూ ఉంటారు. ఆ నీళ్లు మొత్తం ఎర్రగా ఉంటాయి. ఈ అప్‌డేట్‌తో దేవర గ్లింప్స్‌పై అంచనాలు అమాంతం పెరిగాయి.

కాగా, దేవర సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా చేస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా దేవర షూటింగ్‌ కంప్లీట్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హీరో, విలన్‌ల మధ్య యాక్షన్‌ సీక్వెన్సులు తీస్తున్నారట. ఇక, ఈ మూవీలో జాన్వీ కపూర్‌ ‘తంగం’ పాత్రలో కనిపించనున్నారు. డీగ్లామరస్‌ రోల్‌లో ఓ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేస్తున్నారు. దేవర జాన్వీకి తొలి సౌత్‌ సినిమా. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగులో మూవీ చేయటం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తానని చెప్పారు. మరి, దేవర నుంచి వచ్చిన ఈ తాజా అప్‌డేట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş