iDreamPost
android-app
ios-app

సీడెడ్ లో దేవర కోట్ల వర్షం .. ఆ లెక్కలు ఇవే

  • Published Oct 04, 2024 | 6:13 PM Updated Updated Oct 04, 2024 | 6:13 PM

Devara Movie Ceded Collections: దేవర సినిమా థియేటర్స్ లో దున్నేస్తుంది. మరి ఆరేళ్ళ ఎదురుచూపులు కదా.. అలానే ఉంటుంది. ఇక సీమ గడ్డలో అయితే దేవరకు తిరుగులేదు. అక్కడ దేవర కోట్ల వర్షం కురిపిస్తుంది.

Devara Movie Ceded Collections: దేవర సినిమా థియేటర్స్ లో దున్నేస్తుంది. మరి ఆరేళ్ళ ఎదురుచూపులు కదా.. అలానే ఉంటుంది. ఇక సీమ గడ్డలో అయితే దేవరకు తిరుగులేదు. అక్కడ దేవర కోట్ల వర్షం కురిపిస్తుంది.

  • Published Oct 04, 2024 | 6:13 PMUpdated Oct 04, 2024 | 6:13 PM
సీడెడ్ లో దేవర కోట్ల వర్షం .. ఆ లెక్కలు ఇవే

అమలాపురం నుంచి అమెరికా వరకు , గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే మ్యూజిక్. దేవరోడి దెబ్బకు థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి. ఒక్కో రికార్డ్ ను నరుక్కుంటూ బాక్స్ ఆఫీస్ ను మడతపెట్టేస్తుంది దేవర. డివైడ్ టాక్ వచ్చినా సరే వసూళ్లు మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి. తెలుగు, హిందీ , కన్నడ , మలయాళం , తమిళం ఇలా భాషతో సంబంధం లేకుండా.. దేవర ఊర మాస్ జాతర జరుగుతుంది. దేవరకు పోటీగా మరో మూవీ లేకపోవడం, కథలో కంటెంట్ అదిరిపోవడం ఇలా అన్ని కలిసొచ్చాయి. మరి ఆరేళ్ళ ఎదురుచూపులు కదా ఇలానే ఉంటుంది. నైజాంలో ఎన్టీఆర్ జాతరకు అడ్డు అదుపులేదు. అటు రాయలసీమలో కూడా దేవర వేట అసలు ఆగడం లేదు. సీమ గడ్డ దేవర అడ్డాలా మారిపోయింది.

మొదటి నుంచి రాయలసీమలో ఎన్టీఆర్ కు బాగా క్రేజ్ ఉంది. ఆది సినిమా తర్వాత ఆ హైప్ ఇంకాస్త పెరిగింది. అప్పుడు మొదలైన ఆ కల్ట్ మాస్ ఫ్యాన్ బేస్ అరవింద సమేతతో ఇంకాస్త పెరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో అక్కడ వచ్చిన రికార్డ్స్ తో అది పక్కాగా ప్రూవ్ అయింది. ఇక ఇప్పుడు తారక్ దానిని దేవరతో మరో రేంజ్ కు తీసుకుని వెళ్ళాడు. సీడెడ్ లెక్కలు ఇలా ఉన్నాయి. అనంతపురంలో ఆరు రోజుల్లో రూ.2 కోట్లకు పైగా కొల్లగొట్టింది , కర్నూల్ లో రూ. 2 కోట్ల 26 లక్షలు , కడప 1 కోటి 60 లక్షలు.. అన్నింటికీ కంటే అధికంగా తిరుపతిలో 2 కోట్ల 57 లక్షలు సాధించింది. ఇలా వారం రోజుల్లోనే అక్కడ క్రియేట్ అయిన పాస్ట్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. దేవరతో ఎన్టీఆర్ దమ్మెంటో ప్రూవ్ అయింది. మరి థియేట్రికల్ రన్ ఎండ్ లోపు ఇంకా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అవుతాయో చూడాలి.

ఇక ప్రస్తుతం దేవర సినిమా దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసింది. మరి 1000 కోట్లు కొడతాడా లేదా అనేది మాత్రం చూడాలి. ఒకవేళ అది జరిగినా జరగకపోయినా ఈ మూవీ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా అటు రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ కు బ్రేక్ , ఇటు ప్లాప్ దర్శకులకు హిట్స్ ఇవ్వడం ఈ రెండు ఎప్పటికీ అందరికి గుర్తుండిపోతాయి. సోషల్ మీడియాలో కూడా ఇవి బాగా వైరల్ అవుతున్నాయి. ప్లాప్ దర్శకులు తారక్ గుమ్మం ముందు కూర్చోవచ్చు అంటూ చెప్పుకుంటున్నారు. మళ్ళీ తారక్ నుంచి మూవీ వచ్చే వరకు ఆకలి లేకుండా చేసాడు. మూవీలో ఫ్యాన్స్ కు కావాల్సినవన్నీ చూపించి ఫుల్ మీల్స్ వడ్డించాడు దేవర. మరి ఓవరాల్ గా దేవరోడు ఎంత కొడతాడు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.