iDreamPost
android-app
ios-app

దేవర డబ్బింగ్ కంప్లీట్.. చెక్ తీసుకుని ఎమోషనలైన నటుడు

  • Published Jul 17, 2024 | 3:42 PM Updated Updated Jul 17, 2024 | 3:42 PM

జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ దేవర. రూ. 300 కోట్లతో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ దేవర. రూ. 300 కోట్లతో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటున్నాయి.

  • Published Jul 17, 2024 | 3:42 PMUpdated Jul 17, 2024 | 3:42 PM
దేవర డబ్బింగ్ కంప్లీట్.. చెక్ తీసుకుని ఎమోషనలైన నటుడు

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి రాబోతున్న చిత్రం దేవర. కొరటా శివ దర్శకుడు. అత్యంత భారీ బడ్జెట్‌తో రెండు పార్టులుగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్. దసరాకు విడుదల కావాల్సి ఉండగా.. ప్రీ పోన్ చేసుకున్నారు. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యువ సుధ ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ తెరకెక్కిస్తున్నారు. 2021 ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్ 30 మూవీని ఎనౌన్స్ చేయగా.. ఇప్పటికి షూటింగ్ కంప్లీట్ చేసుకుంది దేవర 1. ఇందులో సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర, శృతి మారాఠేతో పాటు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ, అజయ్ తదితరులు నటిస్తున్నారు.

ఇప్పటికే ఓ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేయగా.. ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే పోస్టర్లు, లీక్డ్ వీడియోలు కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా డబ్బింగ్ వర్క్ పూర్తవుతోంది. ఈ క్రమంలో ఓ పవర్ ఫుల్ డైలాగ్ లీక్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. ‘సాదా సీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా’అంటూ సాగిపోయే డైలాగ్ విన్న అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇందులో నటిస్తున్న ఓ యాక్టర్ దేవర డబ్బింగ్ పూర్తి చేశాడు. దానికి సంబంధించిన రెమ్యునరేషన్ కూడా అందుకున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడో నటుడు. దేవర డబ్బింగ్ పూర్తి చేశానని, డబ్బులు కూడా ముట్టాయని చెప్పాడు.

‘తమ్ముళ్లు.. దేవర డబ్బింగ్ పూర్తి చేశా. పెండింగ్ అమౌంట్ కూడా వచ్చేసింది. యువ సుధ ఆర్ట్స్ క్లియర్ చేసేసింది’ అంటూ చెక్ చూపిస్తూ ఫుల్ ఖుషీ అయిపోయాడు. అదే సమయంలో అతడు పడ్డ స్ట్రగుల్ గురించి చెప్పుకొచ్చాడు. తాను పీజీ హాస్టల్లోనే ఉంటూ.. షూటింగ్స్‌కు హాజరవుతున్నానని తెలిపాడు. వాల్తేరు వీరయ్య, మంగళవారం, దేవరతో పాటు మరో రెండు సినిమాలకు హీరోగా చేస్తున్నాను. అదీ కూడా ఈ హాస్టల్ నుండే. తన హాస్టల్ కష్టాల గురించి చెప్పుకొని భావోద్వేగానికి లోనయ్యాడు. అలాగే భవిష్యత్తులో డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఇటువంటి పీజీలను స్థాపించి.. తనలా కష్టపడే వ్యక్తులకు తన వంతు సాయం చేస్తానని అనుకుంటున్నా అంటూ చెక్ తీసుకున్న ఆనందంలో మనసులోని మాటలను వెల్లడించాడు. ఇక మాసెస్ ఆఫ్ ది మ్యాన్ తారక్.. ఈ మూవీతో పాటు వార్ 2లో కూడా పాల్గొన్నాడు. ఇది వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibomcasibom