iDreamPost
android-app
ios-app

Demonte Colony 2 Trailer: భయపెడుతున్న డీమాంటీ కాలనీ-2 ట్రైలర్! ఇవి గమనించారా?

  • Published Jul 25, 2024 | 2:43 PM Updated Updated Jul 25, 2024 | 2:43 PM

Demonte Colony 2.. 2015లో వచ్చిన బ్లాక్ బస్టర్ తమిళ హారర్ మూవీ డీమాంటీ కాలనీ. ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కనుంది. రెండేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఎట్టకేలకు విడుదల కానుంది. దీనికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ విడుదల అయ్యింది.

Demonte Colony 2.. 2015లో వచ్చిన బ్లాక్ బస్టర్ తమిళ హారర్ మూవీ డీమాంటీ కాలనీ. ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కనుంది. రెండేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఎట్టకేలకు విడుదల కానుంది. దీనికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ విడుదల అయ్యింది.

  • Published Jul 25, 2024 | 2:43 PMUpdated Jul 25, 2024 | 2:43 PM
Demonte Colony 2 Trailer: భయపెడుతున్న డీమాంటీ కాలనీ-2 ట్రైలర్! ఇవి గమనించారా?

రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కించిన హారర్ చిత్రాలకు ఎప్పుడు ఆదరణ దక్కుతూనే ఉంటుంది. ఆ కోవలోకే వస్తుంది తమిళ మూవీ డీమాంటీ కాలనీ. చెన్నైలోని ఆళ్వార్ పేటలో ఉంది ఈ డీమాంటీ కాలనీ. ఈ కాలనీలో దెయ్యాలు ఉన్నాయని పుకార్లు షికార్లు చేశాయి. ఆ కాలనీలోకి వెళ్లాలంటే భయపడిపోయేవారు. మోస్ట్ హాంటెడ్ ప్లేసులో ఒకటిగా నిలిచింది. దీన్నే ప్రాతిపదికగా తీసుకుని కాస్తంత ఫిక్షన్ జోడించి 2015లో తెరకెక్కించిన మూవీనే డీమాంటీ కాలనీ. అజయ్ ఆర్ జ్ఞానముత్తు మెగా ఫోన్ పట్టిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అరుళ్ నిధి, మమేష్ తికర్, సనంత్‌, యోగి బాబు పలువురు నటించారు. రూ. 2 కోట్లు పెడితే.. రూ. 17 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు 2022లో సీక్వెల్ ప్రకటించింది చిత్ర యూనిట్.

గతంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ట్రైలర్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ ట్రైలర్ వదిలారు. ఇందులో అరుళ్ నిధి, ప్రియా భవాని శంకర్ నటిస్తుండగా.. అరుణ్ పాండియన్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.  అజయ్ ఆర్ జ్ఞానముత్తు  దర్శకుడు. శ్యామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ తమిళం, తెలుగుతో పాటు పలు  భాషల్లో విడుదల కానుంది. తెలుగు ట్రైలర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఆత్మలు చుట్టూ కథ తిరుగుతోంది. కొన్ని సన్నివేశాలు భయాన్ని కలిగిస్తున్నాయి. డీమాంటీ కాలనీలోకి ఓ ఇంట్లోకి అడుగుపెట్టిన వారికి ఎదురయ్యే వింత సంఘటనలు కనిపిస్తున్నాయి. ఓ చైన్ చుట్టూ కూడా కథ నడుస్తుంది. డీమాంటీ ఇంట్లో నుండి వెళ్లిన చైన్.. తిరిగి అదే ఇంటికి ఎలా వచ్చిందన్నదే కథ.

ట్రయలరే ఓ రేంజ్‌లో భయపెడుతుంది. ఇదే సినిమాపై క్యూరియాసిటీతో పాటు అంచనాలు పెంచేస్తుంది. రాజ్ వర్మ ఎంటర్ టైన్ మెంట్, శ్రీ బాలాజీ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆగస్టు 15న తమిళంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తెలుగులో మాత్రం ఆగస్టు నెలలో రాబోతున్నట్లు పేర్కొంది కానీ.. ఎప్పుడు అనేది డేట్ ఫిక్స్ చేయలేదు. తెలుగులో ఆగస్టు 15న రెండు భారీ మూవీస్ విడుదల కాబోతున్నాయి. వాటిల్లో ఒకటి ఇస్మార్ట్ శంకర్ అంట్ మరోటి బచ్చన్. దీంతో పాటు డబ్బింగ్ మూవీ తంగలాన్ కూడా పంద్రాగస్టున రాబోతుంది. ఈ నేపథ్యంలో థియేటర్లు దొరికే సమస్య ఉన్న నేపథ్యంలో రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదని తెలుస్తుంది. ఆ తర్వాత వారంలో డీమాంటీ కాలనీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Jojobet GirişJojobetAnkara EscortGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetmeritbetcasibomiptv satın alCasibomcasibom