iDreamPost
android-app
ios-app

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘కల్కి’ బ్యూటీ దీపికా పదుకొణె!

  • Published Sep 08, 2024 | 2:06 PM Updated Updated Sep 08, 2024 | 2:06 PM

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్- దీపికా పదుకొణె తల్లీదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఆదివారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కల్కి బ్యూటీ.

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్- దీపికా పదుకొణె తల్లీదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఆదివారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కల్కి బ్యూటీ.

  • Published Sep 08, 2024 | 2:06 PMUpdated Sep 08, 2024 | 2:06 PM
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘కల్కి’ బ్యూటీ దీపికా పదుకొణె!

బాలీవుడ్ క్యూట్ కపుల్స్ రణవీర్ సింగ్- దీపికా పదుకొణె తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. డెలివరీ నిమిత్తం ఆసుపత్రిలో చేరిన దీపికా.. సెప్టెంబర్ 8న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీపికా- రణవీర్‌ దంపతులకు పాప పుట్టింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని సమాచారం. ఈ సెలబ్రిటీ దంపతులకు ఇది తొలి సంతానం. పాప పుట్టిందని తెలియగానే.. ఫ్యాన్స్ అభినందనలతో ముంచెత్తుతున్నారు. పండుగ నాడు ఆసుపత్రిలో చేరిన దీపికా.. ఆదివారం బిడ్డకు జన్మనిచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్ లీలా’ చిత్రంలో తొలిసారి దీపికా – రణవీర్ కలిసి నటించారు.

ఈ షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో పెళ్లి చేసుకున్నారు.  2013లో మొదలైన వీరి ప్రేమ కథ ఐదేళ్లకు పెళ్లిగా మారింది. నవంబర్ 14న ఇటలీలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక పెళ్లయిన ఆరేళ్ల తర్వాత దీపికా పదుకొణె తల్లి అయ్యింది. తమ ఇంట్లో బుజ్జి పాపాయి రాబోతున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించింది ఈ జంట. సెప్టెంబర్‌లో డెలివరీ డేట్ ఉన్నట్లు వెల్లడించింది. ఈ రోజు అభిమానులకు తీపి కబురు అందించింది. ఈ ఏడాది కల్కి 2898 ఏడీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకొణె. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి విదితమే. ఇందులో సుమతి పాత్రలో నటించింది ఈ పొడుగు కాళ్ల సుందరి. ఈ మూవీలో కూడా ప్రెగ్నెంట్ గర్ల్‌గా కనిపించింది ఈ బాలీవుడ్ బ్యూటీ. అనుకోకుండా ఈ మూవీ తర్వాత గర్భం దాల్చింది.

ఇక వీరి సినిమాల విషయానికి వస్తే.. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’తో గతేడాది ప్రేక్షకులను అలరించారు రణవీర్. ప్రస్తుతం ఆయన ‘సింగమ్ అగైన్’ కోసం వర్క్ చేస్తున్నారు. ఇందులో దీపికా కూడా నటిస్తోంది.  దీపికా ప్రెగ్నెంట్ అని తెలిసి నాటి నుండి షూటింగ్స్ కు రెస్ట్ ఇచ్చి.. భార్య వెంటే ఉంటున్నాడు రణవీర్. కాగా, పాపకు జన్మనిచ్చిన విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. డెలివరీకి ముందు వరుసగా దేవాలయాల్లో సందడి చేశారు ఈ జంట. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.  నిండు గర్భిణీగా కనిపించింది దీపికా. ఆమె వెంటనే ఉన్నాడు భర్త రణవీర్.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş