iDreamPost
android-app
ios-app

ప్రెగ్నెంట్ అయ్యాక కూడా డైట్ అంటూ వార్తలు.. దీపికా ఏమందంటే?

  • Published Jul 18, 2024 | 6:31 PM Updated Updated Jul 18, 2024 | 6:31 PM

Deepika about her pregnancy diet: ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ అంతా కూడా.. స్లిమ్ లుక్ లో అందంగా కనిపించడం కోసం డైట్ లు, జిమ్ లాంటివి చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు దీపక ప‌దుకొణే విషయంలోనూ ఇదే టాక్ నడుస్తుంది. అయితే ఆమె మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండిస్తోంది.

Deepika about her pregnancy diet: ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ అంతా కూడా.. స్లిమ్ లుక్ లో అందంగా కనిపించడం కోసం డైట్ లు, జిమ్ లాంటివి చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు దీపక ప‌దుకొణే విషయంలోనూ ఇదే టాక్ నడుస్తుంది. అయితే ఆమె మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండిస్తోంది.

  • Published Jul 18, 2024 | 6:31 PMUpdated Jul 18, 2024 | 6:31 PM
ప్రెగ్నెంట్ అయ్యాక కూడా డైట్ అంటూ వార్తలు.. దీపికా ఏమందంటే?

సెలెబ్రిటీలంతా కూడా నిత్యం తమ గ్లామర్ పై దృష్టి పెడతారన్న సంగతి తెలియనిది కాదు. వారు సినిమాలలో అందంగా కనిపించాలంటే.. జిమ్ , డైట్ , యోగ ఇవన్నీ చేయాల్సిందే. చాలా మంది ఇవన్నీ చేస్తూనే ఉంటారు. కొంతమంది తమ ఆరోగ్యం కోసం చేస్తూ ఉంటె.. మరికొంతమంది ప్రత్యేకించి సినిమాలలోని తమ పాత్రకు న్యాయం చేయడం కోసం.. ఇవన్నీ చేస్తూ ఉంటారు. వారు తప్పకుండ చేయాలి కూడా.. ఇక ఇప్పుడు బాలీవుడ్ నటి దీపికా ప‌దుకొణే విషయంలోను ఇదే బజ్ నడుస్తుండగా.. ఆమె మాత్రం ఈ మాటలను ఖండించింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

రీసెంట్ గా రిలీజ్ అయినా కల్కి సినిమాలో .. దీపికా ప‌దుకొణే ఎలాంటి పాత్ర పోషించి.. ప్రేక్షకులను మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ అప్పటినుంచి.. దీపికా ప‌దుకొణే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ బాలీవుడ్ భామ ఇప్పుడు ప్రెగ్నెంట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోస్ కూడా బేబీ బంప్ తో క్యూట్ లుక్స్ తో ఉన్న దీపికా ఫొటోలే. అయితే సాధారణంగా ప్రెగ్నెంట్ లేడీస్ కాస్తైనా బరువు పెరిగి.. వాళ్ళ లుక్స్ లో చేంజ్ కనిపిస్తుంది. కానీ దీపికా మాత్రం చక్కగా స్లిమ్ లుక్స్ తో అందరిని ఆశ్చర్య పరుస్తుంది. దీనితో ఆమె దానికోసం ఓ స్పెషల్ డైట్ ఫాలోయ అవుతుందని.. ప్రెగ్నెంట్ అయిన దగ్గరనుంచి తక్కువ ఫుడ్ తీసుకుంటుందని.. అన్నిటికి దూరంగా ఉందని.. టాక్ నడుస్తుంది. ఇక తాజాగా దీపికా దీనిపై స్పందించారు.

Deepika Padukone

దీపికా ఆ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ” డైట్ లేదు ఏమి లేదు.. అన్ని కలిపి తినేస్తున్నాను. నేను బాగా తింటాను. కంటికి ఏది కనిపించినా సరే తినాలని అనిపిస్తుంది. ప్రస్తుతం సినిమాలు లేవు కాబట్టి ఇబ్బంది లేకుండా అన్ని తినేస్తున్న. అదే సినిమాలు చేస్తే.. ఇలా తినడానికి వీలు పడదు. డైట్ అంటే నా ఉద్దేశంలో.. సమయానికి తినడం , శరీరాన్ని అర్ధం చేసుకోడం. త్వరగా బరువు తగ్గే ఆహార ప్రణాళికను అసలు ఫాలో అవ్వను. క‌డుపునిండా తిన‌డానికే చూస్తాను. పైగా గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ప్పుడు పుష్టిగా తినాలని పెద్ద‌వాళ్లు అంటారు. ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాను. కడుపులో బిడ్డకు ఇది ఎంతో ముఖ్యం.” అంటూ చెప్పుకొచ్చారు దీపికా. ఏదేమైనా ఎవరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారు తీసుకుంటూనే ఉంటారు. అలానే దీపికా కూడా తన ఆరోగ్యానికి తగినట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş