iDreamPost
android-app
ios-app

బోసి నవ్వుల ఈ చిన్నారి.. ఇప్పుడొక స్టార్‌ హీరోయిన్‌! ఎవరో గుర్తుపట్టారా?

  • Published Mar 18, 2024 | 3:58 PM Updated Updated Mar 18, 2024 | 3:58 PM

బోసి నవ్వులు నవ్వుతున్న ఈ చిన్నారి.. ఇప్పుడొక స్టార్‌ హీరోయిన్‌. విదేశాల్లో పుట్టి.. ఇండియాలో పెరిగి.. దక్షిణాది సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇంతకు ఆ పాప ఎవరో గుర్తు పట్టగలరా..?

బోసి నవ్వులు నవ్వుతున్న ఈ చిన్నారి.. ఇప్పుడొక స్టార్‌ హీరోయిన్‌. విదేశాల్లో పుట్టి.. ఇండియాలో పెరిగి.. దక్షిణాది సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇంతకు ఆ పాప ఎవరో గుర్తు పట్టగలరా..?

  • Published Mar 18, 2024 | 3:58 PMUpdated Mar 18, 2024 | 3:58 PM
బోసి నవ్వుల ఈ  చిన్నారి.. ఇప్పుడొక స్టార్‌ హీరోయిన్‌! ఎవరో గుర్తుపట్టారా?

చిన్ని కళ్లు, బోసి నవ్వులు రువ్వుతూ.. ముద్దొస్తున్న ఈ చిన్నారి క్రేజీయెస్ట్ స్టార్ హీరోయిన్.పుట్టింది విదేశాల్లో అయినా పెరిగిందంతా ఇండియాలోనే. సాధారణంగా డాక్టర్ పిల్లలు… డాక్టర్, ఇంజనీర్ పిల్లలు ఇంజనీర్స్ అవుతారని అంటుంటారు. కానీ ఈమె విషయంలో రివర్స్ అయ్యింది. తండ్రి ఉన్న రంగంలో కాకుండా తనకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ.. తొలి సినిమా సౌత్ ఇండస్ట్రీలో చేయడం విశేషం. ఆ తర్వాతే బాలీవుడ్ బాట పట్టి.. సక్సెస్ పొందింది. తొలి ఛాన్సే బడా హీరో పక్కన నటించే అవకాశం దక్కింది. అంతేనా ప్రొడ్యూసర్‌గా మారి మంచి చిత్రాలను అందించింది.

దక్షిణాది రాష్ట్రంలో పెరిగి.. బాలీవుడ్‌లో పాగా వేసి.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీపై కూడా కన్నైసింది. ఇంతకు ముద్దులొలికించే ఈ చిన్నారి, పొన్నారి ఎవరంటే.. బ్యూటీ ఫుల్ స్మైల్, సొట్ట బుగ్గల సుందరి దీపికా పదుకొణె. డెన్మార్స్ లో 1986లో పుట్టిన దీపికా.. చిన్న యవస్సులోనే ఇండియాకు వచ్చేసింది. ఆమె కూడా  కన్నడ కస్తూరినే. కర్ణాకటలోనే ఆమె విద్యాభ్యాసం సాగింది.  ఆమె తండ్రి ప్రకాశ్ పదుకోణె ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్. దీపికా కూడా బ్యాడ్మింటన్ ప్లేయరే. నేషనల్ లెవల్లో ఆడింది. అంతేకాకుండా చిన్నప్పుడే మోడల్‌గా అవతారం ఎత్తి.. పలు యాడ్స్ చేసింది. పదో తరగతిలో ఆమె నిర్ణయం మార్చుకుంది యాక్ట్రెస్ కావాలని. 2006లో వచ్చిన కన్నడ చిత్రం ఐశ్వర్య (మన్మధుడు రీమేక్)తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి హిట్ కొట్టింది. అనంతరం ఆమెకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది.

షారూఖ్ మూవీ ‘ఓం శాంతి ఓం’ హిట్ కొట్టడంతో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక వరుస పెట్టి అవకాశాలు క్యూ కట్టాయి. బచనా ఏ హసీనో సినిమా సమయంలో రణబీర్ కపూర్ ప్రేమలో పడింది. కానీ వీరి పెళ్లి పీటలు ఎక్కలేదు. ఆ తర్వాత ఆమె సినిమాలతో బిజీగా మారిపోయింది. హౌస్ ఫుల్, కాక్ టైల్, రేస్ 2, చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలు ఆమెకు స్టార్ హీరోయిన్ హోదాను కట్టబెట్టాయి. తమిళంలో కొచ్చాడియన్ చిత్రం చేసింది. కానీ ఆమెకు సౌత్ ఇండస్ట్రీలో పేరు తీసుకు రాలేదు. మళ్లీ హిందీ చిత్రాలతో బిజీ అయ్యింది. హ్యాపీ న్యూ ఇయర్, పీకు , తమాషా, పద్మావత్ చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్ కొట్టాయి. అలాగే ట్రిపుల్ ఎక్స్ చిత్రంతో హాలీవుడ్ చిత్రంలో కూడా మెరిసింది.

ఇక ప్రొడ్యూసర్‌గా ఛపాక్, 83ను తెరకెక్కించింది. ఇక మరో స్టార్ నటుడు రణవీర్ కపూర్‌తో 2012 నుండి డేటింగ్ చేసింది ఈ బ్యూటీ. 6 ఏళ్ల తర్వాత వీరి ప్రేమ.. పెళ్లి పీటలు ఎక్కింది. ఇక తన భర్త గురించి ఎప్పుడు పొగుడుతూనే ఉంటుంది దీపిక. పఠాన్, ఫైటర్ చిత్రాలతో ఆమెలో యాక్షన్ ఎలిమెంట్స్ బయటకు తీసుకు వచ్చాయి. ఇప్పుడు ఆమె తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ప్రభాస్ సరసన కల్కి చిత్రంలో నటిస్తోంది. ఆమెకు సంబంధించిన షూటింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది. సింగమ్ ఎగైన్ అనే చిత్రంలో యాక్ట్ చేస్తోంది. అంతలోనే ఓ అభిమానులకు తీపి కబురు చెప్పింది రణవీర్-దీపికల జంట. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామంటూ వెల్లడించింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom