iDreamPost
android-app
ios-app

6 రోజుల్లో 4565 కోట్ల కలెక్షన్స్.. ఇది కదా బాక్సాఫీస్ ఊచకోత అంటే..

  • Published Aug 01, 2024 | 9:11 PM Updated Updated Aug 01, 2024 | 9:11 PM

Deadpool And Wolverine Movie 6 Days Collection details: డెడ్ పూల్ అండ్ ఓల్వరిన్ మూవీకి ప్రపంచం వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ఏకంగా రూ.4500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.

Deadpool And Wolverine Movie 6 Days Collection details: డెడ్ పూల్ అండ్ ఓల్వరిన్ మూవీకి ప్రపంచం వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ఏకంగా రూ.4500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.

  • Published Aug 01, 2024 | 9:11 PMUpdated Aug 01, 2024 | 9:11 PM
6 రోజుల్లో 4565 కోట్ల కలెక్షన్స్.. ఇది కదా బాక్సాఫీస్ ఊచకోత అంటే..

ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో వైరల్ గా మారిన చిత్రం డెడ్ పూల్ అండ్ ఓల్వరిన్. వైరల్ కావడమే కాకుండా.. ఏకంగా బాక్సాఫీస్ ని ఊచకోత కోస్తోంది. ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే చర్చలు, ఈ సినిమా టేకింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ సూపర్ హీరో సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు అంతా ఫిదా అయిపోయారు. అది కూడా అలా ఇలా కాదు.. కేవలం 6 రోజుల్లోనే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.4,565 కోట్లు కలెక్ట్ చేసింది అంటేనే అర్థం చేసుకోవాలి.. దీని క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అని. మార్వెల్ యూనివర్స్ నుంచి చాలా గ్యాప్ తర్వాత రావడం.. అందులో ఓల్వరిన్ కూడా ఉండటంతో ఈ మూవీ చూసేందుకు ఎగబడుతున్నారు.

కలెక్షన్స్:

డెడ్ పూల్ ఓల్వరిన్ మూవీ ఫస్ట్ వీక్ ని చాలా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. కేవలం 6 రోజులకే ఈ మూవీ రూ.4,565 కోట్లు కలెక్ట్ చేయడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇంక ఇండియాలో కూడా అద్భుతమైన కలెక్షన్స్ ని రాబట్టింది. తొలి వారం రోజుల్లో ఇండియాలో ఏకంగా రూ.88 కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు అంచనాలు వేస్తున్నారు. ఈ లెక్కన ఇండియాలో ఫస్ట్ వీక్ టాప్ పర్ఫార్మెన్స్ చేసిన హాలీవుడ్ చిత్రాల లిస్ట్ లో 6వ స్థానంలో ఉంది. ఈ కలెక్షన్స్ త్వరలోనే రూ.100 కోట్ల నెట్ రాబట్టే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ బాలీవుడ్ లోని కొన్ని బ్లాక్ బస్టర్స్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని దాటేసింది. ఇప్పుడు ఈ మూవీకి పోటీ కూడా కనిపించడం లేదు. ఆగస్టు 15 వరకు దీనిని ఆపడం కూడా కష్టంగా కనిపిస్తోంది. ఇదే దూకుడు కొనసాగిస్తే వరల్డ్ వైడ్ గా కూడా ఈ డెడ్ పూల్ ఓల్వరిన్ మూవీ త్వరలోనే రూ.5 వేల కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయే అవకాశం ఉంది.

ఎందుకంత స్పెషల్?:

డెడ్ పూల్ ఓల్వరిన్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అదే కేవలం విదేశాల్లోనే అనుకుంటే పొరపాటే.. మన హైదరాబాద్ లో కూడా పెద్దఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. థియేటర్ దగ్గర తెలుగు హీరోలకు కట్టినట్లు పెద్ద పెద్ద కటౌట్లు కూడా కట్టిన విషయం తెలిసిందే. అలాగే ఎక్స్ మెన్ లోని మెయిన్ లీడ్ ఓల్వరిన్ కు కూడా చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు వీళ్లిద్దరు కలవడమే ఈ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెడ్ పూల్, ఓల్వరిన్ అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇంక ఈ మూవీలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ కి మీరు ఫిదా అయిపోవాల్సిందే. అంతేకాకుండా ఈ మూవీలో వింటేజ్ సూపర్ హీరోలు కూడా కనిపిస్తారు. ముఖ్యంగా బ్లేడ్ ని ఈ మూవీలో చూపించడం హైలెట్ గా నిలిచింది. ఇంక తెలుగు ప్రేక్షకులకు అయితే ఇందులో ఉండే డబ్బింగ్ కి పొట్ట చక్కలు అవుతుంది. అన్నీ ట్రెండింగ్ మూవీస్, మీమ్స్ అన్నీ డెడ్ పూల్ డైలాగ్స్ లో ఉంటాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet