iDreamPost
android-app
ios-app

Shine Tom Chacko: పెళ్లిపీటలెక్కబోతున్న ‘దసరా’ విలన్! ఎంగేజ్ మెంట్ పిక్స్ వైరల్

  • Published Jan 02, 2024 | 9:42 PM Updated Updated Jan 02, 2024 | 9:42 PM

కొత్త సంవత్సరం వేళ కొత్త లైఫ్ ను ప్రారంభించబోతున్నాడు 'దసరా' విలన్ షైన్ టామ్ చాకో. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి సిద్దమైయ్యాడు. వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

కొత్త సంవత్సరం వేళ కొత్త లైఫ్ ను ప్రారంభించబోతున్నాడు 'దసరా' విలన్ షైన్ టామ్ చాకో. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి సిద్దమైయ్యాడు. వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

  • Published Jan 02, 2024 | 9:42 PMUpdated Jan 02, 2024 | 9:42 PM
Shine Tom Chacko: పెళ్లిపీటలెక్కబోతున్న ‘దసరా’ విలన్! ఎంగేజ్ మెంట్ పిక్స్ వైరల్

గతేడాది ఎంతో మంది సెలబ్రిటీలు తమ సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డ్ ఇచ్చి.. మింగిల్ అయ్యారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాక ఎన్నో జంటలు పెళ్లితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తాజాగా కొత్త సంవత్సరం వేళ కొత్త లైఫ్ ను ప్రారంభించబోతున్నాడు ‘దసరా’ విలన్ షైన్ టామ్ చాకో. చాలా కాలం నుంచి ఓ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు చాకో. వీరిద్దరు జంటగా కనిపించిన ఫొటోలు గతంలో వైరల్ కూడా అయ్యాయి. ఇక తాజాగా పుకార్లకు తెరదించుతూ.. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి సిద్దమైయ్యాడు టామ్ చాకో. వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

షైన్ టామ్ చాకో.. ఈ పేరేదో విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? కాదులేండి ఈ యాక్టర్ మనకు సుపరిచితుడే. ప్రముఖ మలయాళ నటుడు అయిన టామ్ చాకో 2011లో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత సంవత్సరం నాచురల్ స్టార్ నానీ నటించిన ‘దసరా’మూవీలో విలన్ రోల్ లో అదరగొట్టాడు. ఆ తర్వాత వరసగా తెలుగులో ఛాన్స్ కొట్టేశాడు. నాగశౌర్య ‘రంగబలి’లోనూ నటించాడు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. చాకో తర్వలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. గత కొన్నాళ్లుగా తనూజ అనే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు ఈ స్టార్ యాక్టర్. తాజాగా ఈ జంట ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ జంటకు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొన్ని రోజుల్లోనే పెళ్లి వేడుక కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ జంట ఎంగేజ్ మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Shine Tom Chacko (@shinetomchacko_official)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş