iDreamPost

దర్శన్‌ని ముందే హెచ్చరించిన భార్య! మాట వినకుండా ప్రియురాలి మత్తులో ఘోరం!

Darshan- Vijayalakshmi-Pavithra Gowda.. ప్రియురాలి మత్తులో పడి జీవితాన్ని చిత్తు చేసుకున్నాడు కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీప. భార్య విజయలక్ష్మీ హెచ్చరించిన బేఖాతరు చేశాడు. ఫలితం..

Darshan- Vijayalakshmi-Pavithra Gowda.. ప్రియురాలి మత్తులో పడి జీవితాన్ని చిత్తు చేసుకున్నాడు కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీప. భార్య విజయలక్ష్మీ హెచ్చరించిన బేఖాతరు చేశాడు. ఫలితం..

దర్శన్‌ని ముందే హెచ్చరించిన భార్య! మాట వినకుండా ప్రియురాలి మత్తులో ఘోరం!

ప్రియురాలికి అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడన్న కోపంతో చిత్ర దుర్గ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడ్ని కొట్టి చంపిన కేసులో అరెస్టు అయ్యాడు శాండిల్ వుడ్ స్టార్ నటుడు దర్శన్. నటి, ప్రేయసి పవిత్ర గౌడతో కొన్ని రోజులగా రిలేషన్ షిప్‌లో ఉన్న సంగతి విదితమే. అయితే భార్యను కాదని, ప్రియురాలితో తమ హీరో ఉండటాన్నిసహించలేని రేణుక స్వామి.. పవిత్ర గౌడను కొన్ని రోజుల నుండి సోషల్ మీడియా ద్వారా వేధించడం మొదలు పెట్టాడు. ఈ విషయం దర్శన్‌కు తెలిసి.. అతడ్ని వార్నింగ్ ఇవ్వాలంటూ సుపారీ ఇవ్వగా.. అతడ్ని పట్టుకొచ్చి ఓ షెడ్డులో వేసి చితక్కొట్టడంతో చనిపోయాడు. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి.. కాల్వలోనే పడేశారు. కాగా, కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకోగా.. దర్శన్ దాడి చేయడం వల్లే అతడు చనిపోయాడంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. దర్శన్‌తో పాటు ప్రియురాలిని అరెస్టు చేశారు బెంగళూరు పోలీసులు.

కాగా, భర్తను ముందు నుండే హెచ్చరించింది దర్శన్ భార్య విజయలక్ష్మీ. గతంలో పవిత్ర- విజయలక్ష్మీ మధ్య సోషల్ మీడియా వార్ జరిగింది. అందుకు కారణమైంది  పవిత్ర గౌడ చేసిన ఓ పోస్టు. 2013 నుండే ఇండస్ట్రీలో ఉన్న పవిత్ర.. అడపదడపా సినిమాలు చేసింది. పదేళ్ల క్రితం దర్శన్‌తో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. 2017లోనే వీరిద్దరూ దిగిన ఫోటోలను సోషల్ మీడియా ఫ్రొఫైల్ పిక్స్‌గా పెట్టుకుంటే.. అభిమానులు ఆగ్రహించడంతో వాటిని తొలగించింది. 2024 జనవరిలో తమ రిలేషన్ స్టార్టయ్యి పదేళ్లు గడిచింది అని పోస్టు చేసింది. అలాగే తమ మ్యాటర్ దర్శన్ భార్య విజయలక్ష్మికి తెలుసు అంటూ కబుర్లు చెప్పింది. దీంతో విజయలక్ష్మి, పవిత్ర మధ్య సైలెంట్‌గా కొనసాగుతున్న వివాదం.. వైలెంట్ అయ్యింది. ఆమె చర్యను ఖండిస్తూ తన సోషల్ మీడియా ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేసింది దర్శన్ భార్య.

విజయలక్ష్మీ వెంటనే పవిత్ర భర్త సంజయ్, బిడ్డతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ..చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నటిని హెచ్చరించింది కూడా, ‘ఈ స్త్రీ వేరొకరి భర్త ఫోటోలను పోస్ట్ చేసే ముందు స్పృహలో ఉండాలని ఆశిస్తున్నా. ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం ద్వారా తెలుస్తుంది ఆమె క్యారెక్టర్, మోరల్ స్టాండింగ్ ఏంటే. దర్శన్‌కు వివాహం అయ్యిందని తెలిసి కూడా ఆమె తన వ్యక్తిగత అవసరాలు, ఎజెండా కోసం అతడితో ఉంటుంది. పవిత్ర, సంజయ్ సింగ్‌ల కుమార్తె ఖుషీ గౌడ. నేను సాధారణంగా వ్యక్తిగత సమస్యలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి సోషల్ మీడియాను వినియోగించను.. కానీ నా కుటుంబ ప్రయోజనాల కోసం నా స్వరం పెంచాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. సమాజంలో భిన్నమైన ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న వారిపై లీగల్ చర్యలు తీసుకుంటాను’ అని సంజయ్ సింగ్, ఖుషీగౌడ, పవిత్రగౌడ పేర్లను మెన్షన్ చేసింది విజ్జి. కానీ భార్య మాటను బేఖాతరు చేసిన దర్శన్.. ప్రియురాలి మత్తులో పడి.. పచ్చని సంసారంలో నిప్పులేసుకున్నాడు. ఇప్పుడు ఊచలు లెక్కేట్టేందుకు సిద్దమయ్యాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి