iDreamPost
android-app
ios-app

జైల్లో దర్శన్..పార్టీలో చిల్ అవుతూ భార్య విజయలక్ష్మీ..నెట్టింట ట్రోల్స్

  • Published Sep 10, 2024 | 4:07 PM Updated Updated Sep 10, 2024 | 4:07 PM

Actor Darshan: హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో  అరెస్టు అయ్యి  జైలుకి వెళ్లిన దగ్గర నుంచి అతడి భార్య విజయలక్ష్మి బెయిల్ కోసం శతవిధాల ప్రయాత్నిస్తున్నా విషయం తెలిసిందే. అయితే ఇలాంటి కష్ట సమయంలో.. పుట్టెడు దు: ఖంలో ఉన్న విజయలక్ష్మి పై నెట్టింట కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే..

Actor Darshan: హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో  అరెస్టు అయ్యి  జైలుకి వెళ్లిన దగ్గర నుంచి అతడి భార్య విజయలక్ష్మి బెయిల్ కోసం శతవిధాల ప్రయాత్నిస్తున్నా విషయం తెలిసిందే. అయితే ఇలాంటి కష్ట సమయంలో.. పుట్టెడు దు: ఖంలో ఉన్న విజయలక్ష్మి పై నెట్టింట కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే..

  • Published Sep 10, 2024 | 4:07 PMUpdated Sep 10, 2024 | 4:07 PM
జైల్లో దర్శన్..పార్టీలో చిల్ అవుతూ భార్య విజయలక్ష్మీ..నెట్టింట ట్రోల్స్

ప్రముఖ కన్నడ స్టార్ హీరో దర్శన్.. అభిమాని రేణుక స్వామి హత్య  కేసులో ఇప్పటికీ జైలు జీవితం గడుపుతున్నాడు. అయితే ఈ హత్య జరిగి దాదాపు మూడు నెలలు కావొస్తున్నా.. ఇంత వరకు దర్శన్ కు కనీసం బెయిల్ కూడా మంజూరు కాలేదు. అందుకు కారణం.. ఈ కేసులో బలమైన సాక్ష్యధారలు దొరకడంతో దర్శనే ఈ హత్య చేయించడంటూ పోలీసులు ఆరోపించారు. దీంతో రేణుకస్వామి హత్య కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా.. రోజుకొక నమ్మలేని నిజాలు, సాక్ష్యలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కేసులో దర్శన్ తో ఎ2 ముద్దయిగా బళ్లారి జైల్లో ఉండగా..  అతని ప్రియురాలు పవిత్ర గౌడ్ ఎ1 నిందితురాలిగా పరప్పనలో జైల్లో విచారణ ఖైదిగా ఉంది. ఈమెతో పాటు  మరో 15 మంది నిందితులు ప్రస్తుతం పరప్పన జైల్లో నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే..  హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో  అరెస్టు అయ్యి  జైలుకి వెళ్లిన దగ్గర నుంచి అతడి భార్య విజయలక్ష్మి బెయిల్ కోసం శతవిధాల ప్రయాత్నిస్తున్నా విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే చాలాసార్లు దర్శన్ బెయిల్ కోసం ప్రయాత్నించి విఫలైమన విజయలక్ష్మికి.. తీవ్ర నిరాశే మిగిలింది. కానీ, ఏదో ఒక విధంగా తన భర్తకు బెయిల్ మీద బయటకు తీసుకురావలనే ప్రయత్నంలో ఆమె చాలా కసరత్తు చేస్తుందనే చెప్పవచ్చు. అయితే ఇలాంటి కష్ట సమయంలో.. పుట్టెడు దు: ఖంలో ఉన్న విజయలక్ష్మి పై నెట్టింట కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే..

హీరో దర్శన్ భార్య విజయలక్ష్మీ పై ప్రస్తుతం నెట్టింట చాలా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఇటీవలే ఆమె కర్ణాటక సీఎం  సిద్ధరామయ్య మేనకోడలతో కలిసి ఈమె ఓ స్నేహితురాలి బర్త్ డే పార్టీలో ఎంజాయ్ చేస్తున్నా ఫోటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక ఆ ఫోటోస్ పై  చూసిన నెటిజన్స్ భర్త జైల్లో ఉన్నారని చీకు చింత లేకుండా.. ఇలా పార్టీలు చేసుకుంటూ ఆనందంగా ఉన్నారంటూ నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. కానీ, మరి కొంతమంది దర్శన్ అభిమానులు మాత్రం విజయలక్ష్మికి మద్ధతుగా నిలుస్తున్నారు. జైల్లో ఉంటే.. ఇంటి నుంచి బయటకు రాకూడదు, ఏ పార్టీలో పాల్గొనకూడదని రూల్స్ ఎక్కడ లేవు. వీలైనంత మేరకు బాధ నుంచి బయటకు వచ్చేలా ప్రయత్నించాలే కానీ, ఆ బాధలో ఇంట్లో తలుపులు మూసుకొని కూర్చొవాల్సిన అవసరం లేదు అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే సిద్ధరామయ్య మేనకోడలు, విజయలక్ష్మి దర్శన్ చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నారని, తరచూ బయట కలుస్తుంటారని విషయం తెలిసిందే. అయితే విజయలక్ష్మి తన బిజీ షెడ్యూల్‌లో కూడా తన స్నేహితురాలి కోసం సమయం కేటాయించడంపై.. ఆమె స్నేహితురాలు సోషల్ మీడియాలో తనతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆమె కోసం ట్వీట్ చేసింది.  ప్రస్తుతం ఈ ట్వీట్, ఫోటోస్ వైరల్ అవ్వడంతో విజయలక్ష్మి దర్శన్ పై చాలామంది నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.