iDreamPost
android-app
ios-app

దర్శన్ అంటే కన్నడ స్టార్ హీరోలకు ఎందుకంత కోపం! ఒక్కరి సపోర్ట్ కూడా లేదు!

కన్నడ నాట సూపర్ స్టార్ అంటే అక్కడ ప్రేక్షకులు ఠక్కున చెప్పే పేరు దర్శన్. ఛాలెంజింగ్ స్టార్, డీ బాస్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. తన సినిమాలతో బాక్సాఫీసులను షేక్ చేసిన నటుడు. ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. అండగా నిలవాల్సిన ఇతర స్టార్స్..

కన్నడ నాట సూపర్ స్టార్ అంటే అక్కడ ప్రేక్షకులు ఠక్కున చెప్పే పేరు దర్శన్. ఛాలెంజింగ్ స్టార్, డీ బాస్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. తన సినిమాలతో బాక్సాఫీసులను షేక్ చేసిన నటుడు. ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. అండగా నిలవాల్సిన ఇతర స్టార్స్..

దర్శన్ అంటే కన్నడ స్టార్ హీరోలకు ఎందుకంత కోపం! ఒక్కరి సపోర్ట్ కూడా లేదు!

దక్షిణాది ఇండస్ట్రీల్లో ఒకటి శాండిల్ వుడ్. ఇక్కడ స్టార్ హీరోలు ఎవరు అనగానే చాలా మందికి ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివ రాజ్ కుమార్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, దివంగత పునీత్ రాజ్ కుమార్, యష్ గుర్తుకు వస్తుంటారు. కానీ వీరిని మించిన నటుడు దర్శన్. ఈ హీరో మినహా మిగిలిన వారంతా ఇప్పుడు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీల్లో ఇతర భాషల్లో నటించడంతో పాటు తమ సినిమాలను డబ్బింగ్ చేసుకోవడం, పాన్ ఇండియా లెవల్లో మూవీస్ విడుదల చేయడంతో ఫేమస్ అయ్యారు. దర్శన్ అలా కాదు. కన్నడ చిత్రాలు మాత్రమే చేసి స్టార్ అయ్యాడు. ప్రొజక్టర్ ఆపరేటర్‌గా వచ్చి టాప్ హీరో అవ్వడం అంటే మామూలు మాటలు కాదు. డౌన్ టు ఎర్త్ తెలిసిన నటుడు. అలాంటి స్టార్ నటుడు సినిమాలతోనే కాదు వివాదాల్లో టాప్ ప్లేసులో నిలిచాడు.

దర్శన్.. కన్నడ బాక్సాఫీసును శాసించాడు. అతడు సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్‌కు పండుగ. విపరీతమైన అభిమానులున్నారు అతడికి. స్టార్ హీరోలు సైతం ఛాలెంజింగ్ స్టార్ మూవీ వస్తుందంటే.. ఎంత కలెక్షన్లు రాబుడుతుందో అని ఎదురు చూశారు. అంతటి క్రేజ్ ఉన్న నటుడు.. కేవలం ప్రియురాలి కోసం పర్సనల్, కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్నాడు. పదేళ్ల క్రితం పరిచయమైన పవిత్రగౌడకు రేణుకా స్వామి అనే వ్యక్తి అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడన్న కారణంతో కొట్టి చంపిన సంగతి విదితమే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్శన్, పవిత్రగౌడతో పాటు మరో 17 మందిని అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన చందన సీమలో తీవ్ర కలకలం రేపడంతో పాటు చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉంటే.. దర్శన్ చేసిన పనికి తోటి నటులు భిన్నంగా స్పందిస్తున్నారు. సాధారణంగా తమ ఇండస్ట్రీలో ఎవరైనా అరెస్టు అయితే.. ఆ అంశంపై చర్చించకుండా ఉండటమో.. లేక తీర్పు కోసం ఎదురు చూడటమే చేస్తుంటారు. కానీ టాప్ హీరోలు దర్శన్ కు కాస్త వ్యతిరేకంగానే మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. సుదీప్ మాట్లాడుతూ.. మీడియా ఏం చూపిస్తుందో అదే మాకు తెలుసునని, మృతుడి భార్య, ఈ భూమ్మీదకు రాని బిడ్డకు న్యాయం జరగాలి అంటూ బాధితుడు తరుఫున మాట్లాడారు. దోషికి శిక్ష పడితే సినీ పరిశ్రమ సంతోషిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఉపేంద్ర సైతం కాస్త విభిన్నంగా స్పందిచారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలని అన్నారు.  అతడిది తప్పైనా సరే.. తోటి స్టార్ నటుడు అని తెలిసి.. మోరల్ సపోర్టు ఇవ్వలేదు. లేదా కామ్ అయిపోతారు. కానీ నటులు స్పందిస్తున్న తీరును బట్టి చూస్తే దర్శన్ అంటే కన్నడ హీరోల్లో కోపం ఉందా అనిపించకమానదు. అతడంటే పెద్ద హీరోలకు పడదా అన్నప్రశ్న తలెత్తుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి