iDreamPost
android-app
ios-app

ఒకే వేదికపై సుదీప్‌, దర్శన్‌.. గొడవలు ఆగినట్లేనా?

  • Published Aug 28, 2023 | 3:33 PM Updated Updated Aug 28, 2023 | 3:33 PM
  • Published Aug 28, 2023 | 3:33 PMUpdated Aug 28, 2023 | 3:33 PM
ఒకే వేదికపై సుదీప్‌, దర్శన్‌.. గొడవలు ఆగినట్లేనా?

ప్రముఖ కన్నడ సూపర్‌ స్టార్స్‌ దర్శన్‌, సుదీప్‌ల మధ్య గత కొన్నేళ్లుగా గొడవలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలే కాదు.. వీరి ఫ్యాన్స్‌ మధ్య కూడా గొడవలు నడుస్తున్నాయి. దర్శన్‌, సుదీప్‌లు నేరుగా ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని సార్లు ఒకరిని ఒకరు సపోర్టు చేసుకున్నా.. విమర్శించుకున్న సందర్భాలే ఎక్కువ. ఒకరి ఇంటిపై కాకి.. మరొకరి ఇంటిపై వాలదు అన్న టాక్‌ కూడా ఉంది. అలాంటి వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించి అందర్నీ షాక్‌కు గురి చేశారు.

తాజాగా, ప్రముఖ నటి సుమలత అంబరీష్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సినీ పరిశ్రమనుంచి ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. వారిలో దర్శన్‌, సుదీప్‌లు కూడా ఉన్నారు. దర్శన్.. సుమలత పక్కన నిల్చుని ఉండగా.. సుదీప్‌ స్టేజిపైకి వచ్చాడు. కొద్దిసేపు అక్కడే ఉన్నాడు. అయితే, వీరిద్దరూ ఒకర్ని ఒకరు చూసుకోలేదు. మాట్లాడుకోలేదు. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇండస్ట్రీ కూడా వీరిద్దరూ కలిస్తే బాగుంటుంది అని కోరుకుంటోంది. కాగా, రాజ్‌కుమార్‌, విష్ణువర్థన్‌ల తర్వాత అంబరీష్‌కు కన్నడ సినిమాపై పట్టు ఉండేది. పెద్దన్న తరహాలో ఇండస్ట్రీలో చోటుచేసుకునే గొడవల్ని ఆయన సద్దుమణిగించేవారు. ఈ ముగ్గురూ చనిపోయిన తర్వాత ఇండస్ట్రీలోకి పెద్ద దిక్కులేకుండా పోయింది. అలాంటి ఈ సమయంలో సుమలత తన భర్త స్థానంలో ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇద్దర్నీ బర్త్‌డే వేడుకకు ఆహ్వానించినట్లు సమాచారం. వీరిద్దర్నీ ఆమె కలిపే ప్రయత్నం కూడా చేస్తోందన్న టాక్‌ వినిపిస్తోంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet