iDreamPost
android-app
ios-app

ఇది సార్ డార్లింగ్ ప్రభాస్ రేంజ్.. ఇండియాలోనే ఒకే ఒక్కడు

  • Published Mar 14, 2024 | 8:12 PM Updated Updated Mar 14, 2024 | 8:12 PM

Prabhas Carze In Indian Film Industry: డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ చూస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. పాన్ ఇండియా లెవల్లోనే ఒకే ఒక్క ఆర్టిస్టుగా ప్రభాస్ రికార్డులు క్రియేట్ చేశాడు.

Prabhas Carze In Indian Film Industry: డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ చూస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. పాన్ ఇండియా లెవల్లోనే ఒకే ఒక్క ఆర్టిస్టుగా ప్రభాస్ రికార్డులు క్రియేట్ చేశాడు.

  • Published Mar 14, 2024 | 8:12 PMUpdated Mar 14, 2024 | 8:12 PM
ఇది సార్ డార్లింగ్ ప్రభాస్ రేంజ్.. ఇండియాలోనే ఒకే ఒక్కడు

పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. యాక్టింగ్, స్వాగ్, ఫ్యాన్ బేస్, క్రేజ్, మంచితనం ఇలా ఏ క్వాలిటీ తీసుకున్నా ప్రభాస్ కు చాలా మంచి మార్కులు పడతాయి. ఈ హీరోకి పాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్, ప్రభాస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద డార్లింగ్ సినిమాలే కలెక్షన్సే మాట్లాడతాయి. అయితే ఇంతకాలం మాటల్లో మాత్రమే చెప్పుకునేవాళ్లు. ఇప్పుడు ప్రభాస్ క్రేజ్ గురించి లెక్కల్లో చెప్పుకునే ఆస్కారం లభించింది. పక్కా లెక్కలతో పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ క్రేజ్ ఏంటో చెప్పేయచ్చు. ఇండియన్ సినిమాలోనే ఒకే ఒక్కడిగా ప్రభాస్ రికార్డు క్రియేట్ చేశాడు.

సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. అందులో మా హీరో తోపు అంటే మా హీరో తోపు అంటూ తెగ కొట్టేసుకుంటారు. చాలా మంది మా హీరో పాన్ ఇండియా లెవల్లో తోపు అంటూ చెప్పుకునే ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ట్విట్టర్ రిపోర్ట్ ప్రకారం చూస్తే మాత్రం ప్రభాస్ ఒక్కడే పాన్ ఇండియా లెవల్లో తోపు హీరో అని తేలిపోయింది. ఇండియాలో అత్యధికంగా వాడిన హ్యాష్ ట్యాగ్ ఏది అనే అంశంపై ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టులో స్థానం దక్కించుకున్న ఏకైక ఆర్టిస్ట్, ఏకైక హీరో ప్రభాసే. సినిమా పేర్లు, షో పేర్లు ఉన్నాయి. కానీ, హీరో పేరు హ్యాష్ ట్యాగ్ అత్యధికంగా వాడింది మాత్రం ప్రభాస్ ఒక్కడిదే. ఈ రిపోర్టు వచ్చిన తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక్కడిగా ప్రభాస్ పేరు రావడం చూసి సంబరాలు చేసుకుంటున్నారు. మరోసారి మా హీరో తోపు అటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంక డార్లింగ్ ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే కల్కీ 2898 ఏడీ మూవీ నుంచి ప్రభాస్ పేరుని రివీల్ చేశారు. భైరవ అంటూ ఆ కాలభైరవుడి పేరును పెట్టారు. మూవీలో ప్రభాస్ మాత్రమే కాకుండా.. చాలామంది బిగ్ స్టార్స్ ఉన్నారు. ఈ మూవీని అనుకున్న సమయానికి రిలీజ్ చేసేందుకు వేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. ఇది కాకుండా మారుతీ డైరెక్షన్ లో రాజా సాబ్ చేస్తున్నాడు. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సందీప్ అయితే నేరుగానే స్పిరిట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను అంటూ చెప్తున్నాడు. కాబట్టి ప్రభాస్ కూడా కల్కి, రాజాసాబ్ తర్వాత స్పిరిట్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే సలార్ 2 సినిమా చేస్తాడు అంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ, అది ఇప్పుడల్లా పట్టాలెక్కదు అంటున్నారు. ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే స్పిరిట్ సినిమానే వేగంగా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్విట్టర్ రిపోర్ట్:

  1. #న్యూ ప్రొఫైల్ పిక్
  2. #క్రిప్టో
  3. #లియో
  4. #ఎన్ఎఫ్టీ
  5. #జవాన్
  6. #పఠాన్
  7. #ప్రభాస్
  8. #ఎల్విష్ యాదవ్
  9. #ఆదిపురుష్
  10. #బిగ్ బాస్

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom