iDreamPost
android-app
ios-app

రిలీజ్ కి ముందే మంచి లాభాలు అందుకున్న డార్లింగ్ మూవీ!

  • Published Jul 18, 2024 | 7:51 PM Updated Updated Jul 18, 2024 | 7:51 PM

Darling Movie Got Profits Before Release Speculation: ప్రియదర్శి- నభా నటేష్ జంటగా వస్తున్న డార్లింగ్ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. లేడీ అపరిచితుడు కోసం ప్రేక్షకులు బానే ఎదురుచూస్తున్నారు.

Darling Movie Got Profits Before Release Speculation: ప్రియదర్శి- నభా నటేష్ జంటగా వస్తున్న డార్లింగ్ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. లేడీ అపరిచితుడు కోసం ప్రేక్షకులు బానే ఎదురుచూస్తున్నారు.

  • Published Jul 18, 2024 | 7:51 PMUpdated Jul 18, 2024 | 7:51 PM
రిలీజ్ కి ముందే మంచి లాభాలు అందుకున్న డార్లింగ్ మూవీ!

డార్లింగ్ మూవీ.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గురించి బాగానే చర్చ జరుగుతోంది. ఎందుకంటే మనం అందరూ అపరిచితుడు సినిమా చూశాం. అందులో విక్రమ్ అద్భుతమైన నటనలో ప్రేక్షకులను మెప్పించాడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ డార్లింగ్ సినిమాలో లేడీ అపరిచితుడిని చూడబోతున్నాం. నభా నటేష్ ఏకంగా ఐదారు పాత్రల్లో కనిపించబోతోంది. అంటే ఈ స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ వల్ల ఆమె ఏకంగా ఐదారుగురిలా నటింబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ కూడా జరిగింది. ఎంతలా అంటే.. రిలీజ్ కి ముందే ఈ మూవీ లాభాల్లోకి కూడా వెళ్లిపోయిందంట.

జులై 19న నభా నటేష్- ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన డార్లింగ్ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీకి మంచి బజ్ ఏర్పడింది. ట్విట్టర్లో హీరో- హీరోయిన్ ఫైట్ దగ్గరి నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా మూవీపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ మూవీకి జరిగిన బిజినెస్ ఆ అంచనాలను మరింత పెంచేస్తోంది. సినిమాకి సంబంధించి ఆడియన్స్ నుంచి వస్తున్న రియాక్షన్ మూవీకి బాగా ప్లస్ అయ్యింది. రిలీజ్ కి ముందే డార్లింగ్ సినిమా లాభాల్లోకి వెళ్లిపోయిందని ట్రేడ్ వర్గాల్లో గట్టిగానే టాక్ వస్తోంది. బొమ్మ ఇంకా వెండితెర మీద పడకముందే.. కాసుల వర్షం కురిపించిందంట.

డార్లింగ్ మూవీకి సంబంధించి బిజినెస్ వివరాలు ఇలా వినిపిస్తున్నాయి. థియేట్రికల్ రైట్స్ ని రూ.7 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ ని రూ.8 కోట్లకు విక్రయించారంట. ఇలా మొత్తంగా మూవీకి సంబంధించి రూ.15 కోట్ల బిజినెస్ జరిగినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలకు మంచి లాభాలు దక్కాయి అని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అలాగే ఈ వార్తలు సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. అంటే ఎంత నమ్మకం లేకపోతే.. అంత పెట్టి కొంటారు అనే టాక్ స్టార్ట్ అయ్యింది. అంతేకాకుండా.. ఈ మూవీలో కామెడీ, రొమ్యా*న్స్, యాక్షన్, ఎంటర్ టైన్మెంట్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా ఈ సినిమా ఎంజాయ్ చేయచ్చు అని చెబుతున్నారు. అలాగే టాలీవుడ్ లో మరో హిట్టు పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నభా నటేష్- ప్రియదర్శికి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం అవుతుందని చెబుతున్నారు. రిలీజ్ కి ముందే డార్లింగ్ మూవీ లాభాల్లోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom