iDreamPost
android-app
ios-app

పెళ్లి పీటలెక్కబోతున్న దండుపాళ్యం హీరోయిన్!

  • Published Nov 28, 2023 | 12:05 PM Updated Updated Nov 28, 2023 | 12:05 PM

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు మూడుముళ్ళ బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటి తాను ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతుంది.

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు మూడుముళ్ళ బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటి తాను ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతుంది.

  • Published Nov 28, 2023 | 12:05 PMUpdated Nov 28, 2023 | 12:05 PM
పెళ్లి పీటలెక్కబోతున్న దండుపాళ్యం హీరోయిన్!

ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, దర్శక, నిర్మాతలు, టెక్నీషియన్లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. కొంతమంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే..మరికొంతమంది పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సీని ఇండస్ట్రీలో ఒకప్పుడు క్రైమ్ థ్రిల్లర్ గా అలరించిన దండుపాళ్యం మూవీ గురించి తెలియని వారు ఉండరు. ‘దండుపాళ్యం’ అనే పేరు మోసిన ముఠా నిజ జీవితంలో చేసిన కృరమైన దోపిడీల ఆధారంగా ఈ కథాంశాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో దండుపాళ్యం గ్యాంగ్ వీధుల్లో తిరుగుతూ ఒంటరిగా ఉన్న ఆడవాళ్లను టార్గెట్ చేసుకొని వారిని చంపి అంతా దోచుకువెళ్తుంటారు. ఈ మూవీలో నటీనటులు క్యారెక్టర్స్ తగ్గటు చాలా నేచురల్ గా కనిపించారు. తాజాగా దండుపాళ్యం లో నటించిన హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతుంది. వివరాల్లోకి వెళితే..

కన్నడ ఇండస్ట్రీలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ ‘దండుపాళ్యం’. 2012 శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో పూజా గాంధీ, రఘు ముఖర్జీ నటించిన చిత్రం ‘దండుపాళ్యం’. విమర్శకుల నుంచి ప్రశంసలు పొందిన ఈ చిత్రం అప్పట్లో భారీగానే వసూళ్లు చేసింది. ఈ మూవీ సీక్వెల్ దండుపాళ్యం 2,3 కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో సాధారణ మహిళ క్రిమినల్ గా ఎలా మారారు అన్నది చూపిస్తార. ఈ పాత్రలో పూజా గాంధీ అద్భుతంగా నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు కన్నడ చిత్రాల్లో నటించిన పూజా గాంధీ తాజాగా పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ను ఆమె వివాహం చేసుకోబుతుంది. దీనికోసం బెంగుళూరులో యలవంక లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.  ఓ లాజిస్టిక్స్ కంపెనీ యజమాని విజయ్‌ తో కొంతకాలంగా పూజా గాంధీ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాను ప్రేమించిన వ్యక్తితో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే పెళ్లికి సంబంధించిన ఎలాంటి ప్రకటన మాత్రం అఫిషియల్ గా బయటికి రాలేదు.

బెంగాలీకి చెందిన పూజా గాంధీ ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో ఆమెకు విజయ్ పరిచయం అయ్యారని.. ఆమెకు కన్నడ నేర్పించింది ఆయనే అని అంటున్నారు. విజయ్ సహకారంతో కన్నడ నేర్చుకొని పలు సినిమాల్లో నటించినట్లు ఇండస్ట్రీ టాక్. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చిందని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ముంగారు వర్మ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పూజా గాంధీ. 2012లో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద గౌడతో నిశ్చితార్థం అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. కన్నడ, తమిళ, తెలుగు, హిందీ, బెంగాలీ భాషల్లో నటించింది పూజా గాంధీ. 2006లో మాన్ సూన్ రైన్ మూవీ ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. తెలుగులో దండుపాళ్యం సీరీస్ తో అలరించింది. బాలీవుడ్ లో ఖత్రోన్ కి ఖిలాడీ, దుష్మణి, తమెకే సలామ్, కొక్కి లాంటి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించింది. ప్రస్తుతం పూజా గాంధీ పెళ్లి మ్యాటర్ కన్నడ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetandyou girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom