Krishna Kowshik
యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోశాధికారి శివ బాలాజీ. మా ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ఆ యూట్యూబర్..
యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోశాధికారి శివ బాలాజీ. మా ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ఆ యూట్యూబర్..
Krishna Kowshik
సినీ సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా వీడియోలు చేస్తూ ఫేమ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు యూట్యబూర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ముఖ్యంగా మహిళా నటీమణుల్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంపై గతంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సీరియస్ అయ్యాడు. అలాంటి వీడియోలు తొలగించాలని, లేకుంటే యూట్యూబ్ సంస్థతో చర్చించి.. ఛానల్స్ క్లోజ్ అయ్యేలా చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. 48 గంటల్లో వాటిని తొలగించాలని పేర్కొన్నాడు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించాడు. అనంతరం అటువంటి యూట్యూబ్ ఛానల్స్ తొలగించింది మా. ఇది ప్రారంభం మాత్రమే. మరిన్ని ఛానెల్స్ డిలీట్ చేస్తామని పేర్కొంది. తాజాగా మరో యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు మా కోశాధికారి శివ బాలాజీ.
దీంతో విష్ణును టార్గెట్ చేశాడు ఓ యూట్యూబర్. విష్ణుతో పాాటు కొందరు నటీనటులపై నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్ దేవరకొండపై నటుడు, ‘మా’ కోశాధికారి శివ బాలాజీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నటీనటులతో పాటు మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆయన నిర్మాణ సంస్థ గురించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మా’ గౌరవాన్ని దెబ్బతీసేలా అతడు తరచూ వీడియోలు చేస్తున్నాడని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో లింక్స్‌ను పోలీసులకు అందజేశాడు. శివబాలాజీ ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్‌పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. సదరు యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
నిందితుడు తన యూట్యూబ్ ఛానెల్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విష్ణు మంచుపై ద్వేషపూరిత, అసభ్యకరమైన ట్రోల్స్ చేస్తున్నాడని, ఉద్దేశపూర్వకంగా మంచు విష్ణు పేరును, అతడి కీర్తిని, అలాగే MAA ను కించపరిచేలా తప్పుడు, కల్పితాలను సృష్టిస్తున్నాడని పోలీసులు తెలిపారు. తన ఛానెల్ కు వ్యూస్ పెంచుకోవాలని చూస్తున్నాడని పేర్కొన్నారు. చిత్రపరిశ్రమలోని నటీ నటులతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్‌ను టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తున్నవారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. గతంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురు యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. అలాగే కొద్దిరోజుల క్రితం సుమారు 18కి పైగా యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీ నటీనటులపై అసభ్యకర వీడియోలు చేస్తే ఉపేక్షించేది లేదని, వీరిలో మార్పు రాకుండే కఠినమైన చర్యలు తీసుకుంటామని విష్ణు హెచ్చరించారు.