iDreamPost
android-app
ios-app

పుష్ప-2 నుంచి సాలిడ్ అప్డేట్స్ .. పైగా ఆ స్టార్ హీరో సపోర్ట్

  • Published Oct 17, 2024 | 12:36 PM Updated Updated Oct 17, 2024 | 12:36 PM

Pushpa2 Movie Updates: దేవరతో తారక్ నెక్స్ట్ రాబోయే సినిమాలకు టార్గెట్ ఫిక్స్ చేసాడు. అంతే కాకుండా ఇప్పుడు తారక్ ఆ సినిమాల ప్రమోషన్స్ లో కూడా హెల్ప్ చేయనున్నాడు. ఈ క్రమంలో పుష్ప-2 నుంచి సాలిడ్ అప్డేట్స్ రెడీ అవుతున్నాయి. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

Pushpa2 Movie Updates: దేవరతో తారక్ నెక్స్ట్ రాబోయే సినిమాలకు టార్గెట్ ఫిక్స్ చేసాడు. అంతే కాకుండా ఇప్పుడు తారక్ ఆ సినిమాల ప్రమోషన్స్ లో కూడా హెల్ప్ చేయనున్నాడు. ఈ క్రమంలో పుష్ప-2 నుంచి సాలిడ్ అప్డేట్స్ రెడీ అవుతున్నాయి. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published Oct 17, 2024 | 12:36 PMUpdated Oct 17, 2024 | 12:36 PM
పుష్ప-2 నుంచి సాలిడ్ అప్డేట్స్ .. పైగా ఆ స్టార్ హీరో సపోర్ట్

ప్రభాస్, తారక్ వంతు అయిపోయింది . ఇప్పుడు భారమంతా బన్నీ పైనే. కల్కి, దేవర సినిమాలతో ఇద్దరూ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బద్దలకొట్టారు. రాబోయే సినిమాలకు టార్గెట్ ను ఫిక్స్ చేశారు. లాస్ట్ పంచ్ మనదైతే కిక్ ఏ వేరప్పా అంటూ ఇప్పుడు బన్నీ రెడీ అయిపోతున్నాడు. 2024 ను గ్రాండ్ గా ముగించడానికి భారీ ప్లానింగ్ చేస్తున్నాడు. ఈ సంవత్సరంలో చెప్పుకోదగిన  బ్లాక్ బస్టర్ హిట్స్ కొన్నే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో పుష్ప-2 కూడా యాడ్ అవ్వబోతుంది. అయితే ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ తారక్ పుష్ప-2 కోసం ఓపెన్ గా సపోర్ట్ చేయడంతో పాటు.. ప్రమోషన్స్ కూడా చేయనున్నారు. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. సో ఈ లోపు పుష్ప-2 నుంచి సాలిడ్ అప్డేట్స్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ప్రస్తుతం పుష్ప-2 హైప్ లో ఉన్నారు అభిమానులు. దానిని సునామిగా మార్చడానికి ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడు.

నవంబర్ లో పుష్ప-2 ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు . ఈ ట్రైలర్ అప్డేట్ అటు బన్నీ ఫ్యాన్స్ కు సర్ప్రైజింగ్ గా ఉండబోతుంది. అయితే ముందుగా ఈ సినిమా ట్రైలర్ ను కంగువా మూవీ ఆడే థియేటర్స్ లో రిలీజ్ చేస్తారని టాక్ వచ్చింది. కానీ అది జరిగే పని కాదు. ఎందుకంటే ఆ సినిమాకు పెద్దగా హైప్ లేదు. ఇక ఇప్పటికే పుష్ప-2 సినిమాకు భారీ హైప్ నడుస్తుంది. కాబట్టి ప్రమోషన్స్ గురించి మరి అంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అలా అని ప్రమోషన్స్ లేకుండా సినిమా ముందుకు వెళ్లడం కూడా కష్టమే. అందుకోసమే సుకుమార్, బన్నీ ఇద్దరు కలిసి ఎన్టీఆర్ ను రంగంలోకి దించుతున్నారు. పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ను తారక్ చేతుల మీదుగా జరిపించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ ముంబై లో జరగనుందని సమాచారం. దానికి తారక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సో మొత్తానికి బన్నీ కోసం బావ సీన్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ప్రమోషనల్ కంటెంట్ కు వచ్చే హైప్ ఎలా ఉంటుందో చూడాలి.

అలాగే ట్రైలర్ తో పాటు.. అటు ఐటెం సాంగ్ పై కూడా స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు మేకర్స్. త్వరలోనే ఈ సాంగ్ ఫైనల్ షూట్ కూడా కంప్లీట్ చేసి.. అప్పటినుంచి మూవీ ప్రమోషన్స్ పై పూర్తిగా ఫోకస్ పెట్టనున్నారు. ఈ గ్యాప్ లో ఆ సాంగ్ ను కూడా రిలీజ్ చేసే అవకాశం లేకపోలేదు.  చూడబోతుంటే ప్రమోషన్స్ విషయంలో కూడా బన్నీ.. తారక్ నే ఫాలో అవుతన్నాడనే టాక్ వినిపిస్తుంది. ఎలా అయినా సరే నాలుగైదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ కూడా కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేయడం ఖాయం. డిసెంబర్ 6 కోసం బన్నీ ఆర్మీ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. పైగా చెప్పిన టైం కు ఒక రోజు ముందే సినిమాను రిలీజ్ చేస్తారనే టాక్ కూడా నడుస్తుంది. ఏమౌతుందో చూడాలి. మరి ఈ సినిమా అప్డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet