iDreamPost
android-app
ios-app

బాలకృష్ణ- బాబీ సినిమా టైటిల్ ఇదే ! పండుగకు క్రేజీ అప్డేట్

  • Published Oct 14, 2024 | 12:14 PM Updated Updated Oct 14, 2024 | 12:14 PM

NBK 109 Movie Update: నందమూరి బాలకృష్ణ ఇండియన్ సినిమా లెజెండ్స్ లో ఒకరు. కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ మూవీ తీస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

NBK 109 Movie Update: నందమూరి బాలకృష్ణ ఇండియన్ సినిమా లెజెండ్స్ లో ఒకరు. కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ మూవీ తీస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 14, 2024 | 12:14 PMUpdated Oct 14, 2024 | 12:14 PM
బాలకృష్ణ- బాబీ సినిమా టైటిల్ ఇదే ! పండుగకు క్రేజీ అప్డేట్

యంగ్ హీరోస్ అంత ఏడాదికి ,రెండేళ్లకు ఓసారి సినిమా తీస్తున్నారు. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రజా సేవ కార్యక్రమాల వలన మధ్యలో సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చింది. అయినా సరే సినిమాల లిస్ట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. పైగా అటు సినిమాలతో పాటు ఇటు టాక్ షో కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు.  తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 కు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోకు విపరీతమైన స్పందన లభిస్తుంది. ఈసారి ఈ షో కు ఎవరు వస్తారా .. ఎలా ఎంటర్టైన్ చేస్తారా అని.. ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు.  ఇక ప్రస్తుతం బాలకృష్ణ.. దర్శకుడు బాబీ తో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. #NBK 109 పేరుతో ఈ సినిమా గురించి బజ్ వినిపిస్తుంది. అలాగే వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా అప్డేట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

బాలకృష్ణ ఈ మధ్య టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన బాలకృష్ణ సినిమాలన్నీ కూడా బాగానే హిట్ అయ్యాయి. ఇక బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సర్కారు సీతారామయ్య అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని.. అందుకనే ఈ సినిమాకు ఇలాంటి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. స్వంతత్ర ఉద్యమ సమయంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయినా ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏమి రాలేదు. దీనితో అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ దీపావళి ఈ మూవీ టీజర్ లేదా టైటిల్ ను రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏమౌతుందో చూడాలి.

ఈ సినిమాను దాదాపు వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీనితో షూటింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు బాబీ కాంబినేషన్ లో వచ్చే సినిమా తర్వాత.. బాలకృష్ణ మరో రెండు ప్రాజెక్ట్స్ కు ఒకే చెప్పారు . ఒకటి తన తనయుడు మోక్షజ్ఞ తో కాగా.. మరొకటి బోయపాటితో. ఈ సినిమా అఖండ సిక్వెల్ అని అంతా అంటున్నారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇక దీపావళికి NBK 109 నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో.. అది సినిమాపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş