iDreamPost
android-app
ios-app

డార్లింగ్ ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్.. స్పిరిట్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్?

  • Published Aug 23, 2024 | 8:32 PM Updated Updated Aug 23, 2024 | 8:32 PM

Prabhas Is Doing Dual Role In Spirit Movie Speculation: సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబోలో రాబోతున్న స్పిరిట్ కి సంబంధించి ఇప్పటి నుంచే ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా ప్రభాస్ డ్యూయల్ రోల్ అని చెబుతున్నారు.

Prabhas Is Doing Dual Role In Spirit Movie Speculation: సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబోలో రాబోతున్న స్పిరిట్ కి సంబంధించి ఇప్పటి నుంచే ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా ప్రభాస్ డ్యూయల్ రోల్ అని చెబుతున్నారు.

  • Published Aug 23, 2024 | 8:32 PMUpdated Aug 23, 2024 | 8:32 PM
డార్లింగ్ ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్.. స్పిరిట్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్?

డార్లింగ్ ప్రభాస్ స్టామినా గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాన్ ఇండియా కాదు.. ఆయన రేంజ్ ఎప్పుడే పాన్ వరల్డ్ కు వెళ్లిపోయింది. మరి.. అలాంటి హీరో నుంచి సినిమా వస్తోంది అంటే అలాంటి ఇలాంటి క్రేజ్ ఉండదు. అలాగే తాజాగా కల్కి 2898 ఏడీతో రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించాడు. అంతేకాకుండా.. తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయాడు. ఒకవైపు ‘ది రాజా సాబ్’ షూట్ జరుగుతూనే ఉంది. మరోవైపు హను రాఘవపూడితో సినిమాకి కొబ్బరికాయ కొట్టేశాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ ని కూడా త్వరలోనే పట్టాలెక్కిస్తాడు అంటున్నారు. అయితే స్పిరిట్ కి సంబంధించి ఇప్పుడు ఒక క్రేజీ వార్త డార్లింగ్ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబోలో రాబోతున్న స్పిరిట్ సినిమాపై చాలానే అంచనాలు ఉన్నాయి. పైగా స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ని ఫిరోషియస్ యంగ్ పోలీస్ గా చూపించబోతున్నాను అంటూ ఇప్పటికే సందీప్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు స్పిరిట్ కి సంబంధించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ కి ఆసక్తిగా కనిపిస్తున్న అంశం డ్యూయల్ రోల్. అవును ప్రభాస్ స్పిరిట్ లో పోలీస్ గా చేయడమే కాకుండా.. డ్యూయల్ రోల్ లో అలరిస్తాడు అంటున్నారు. అంటే హీరోగా మాత్రమే కాకుండా.. విలన్ గా కూడా ప్రభాసే ఉంటాడు అంటున్నారు. అంటే నెగిటివ్ రోల్ లో కూడా ప్రభాస్ ని చూపించేందుకు సందీప్ డిసైడ్ అయ్యాడు అని ప్రచారం చేస్తున్నారు.

స్పిరిట్ సినిమాకి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ మూవీలో త్రిష నటించబోతోంది అంటున్నారు. అదే జరిగితే.. దాదాపుగా 16 ఏళ్ల తర్వాత త్రిష- ప్రభాస్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. త్రిష కూడా నెగిటివ్ రోల్ లోనే కనిపిస్తుంది అనే గట్టిగానే ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా ఇచ్చే ఎలివేషన్స్ మీద ఉన్న ఎక్స్ పెక్టేషన్స్, ప్రభాస్ ఫ్యాన్ బేస్ కలిపితే పాన్ ఇండియా లెవల్లో ఇంకో ఎపిక్ బ్లాక్ బస్టర్ లోడ్ అవుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి పుకార్లు మాత్రమే. స్పిరిట్ పట్టాలెక్కితేనే అసలు విషయం తెలుస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి స్పిరిట్ సెట్స్ మీదకు వచ్చే ఛాన్స్ ఉండచ్చు. అయితే మధ్యలో సలార్ 2 కూడా తెరమీదకు వస్తుంది. కాబట్టి ఫ్యాన్స్ కూడా స్పిరిట్ ఈ ఏడాది మొదలవుతుంది అనే ఆశలు పెద్దగా పెట్టుకోలేదు. మరి.. స్పిరిట్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbankobet girişgrandpashabet