iDreamPost
android-app
ios-app

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కంగువ రేర్ ఫీట్! ఏకంగా 10 వేల మందితో ఫైట్

  • Published May 18, 2024 | 7:23 PM Updated Updated May 18, 2024 | 7:23 PM

Fight Secene In Surya Kanguva With 10 Thousand People: సూర్యా హీరోగా చేస్తున్న కంగువ అనే పాన్ ఇండియా సినిమాపై క్రేజీ వార్తలు వస్తున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే మొదటిసారి ఏకంగా 10 వేల మందితో ఫైట్ అంటున్నారు.

Fight Secene In Surya Kanguva With 10 Thousand People: సూర్యా హీరోగా చేస్తున్న కంగువ అనే పాన్ ఇండియా సినిమాపై క్రేజీ వార్తలు వస్తున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే మొదటిసారి ఏకంగా 10 వేల మందితో ఫైట్ అంటున్నారు.

  • Published May 18, 2024 | 7:23 PMUpdated May 18, 2024 | 7:23 PM
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కంగువ రేర్ ఫీట్! ఏకంగా 10 వేల మందితో ఫైట్

పాన్ ఇండియా లెవల్లో ఉన్న విలక్షణమైన నటుల్లో కోలీవుడ్ టాప్ హీరో సూర్య కూడా ఒకడు. ఎప్పటికప్పుడు ఎంతో భిన్నమైన కథలతో ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటాడు. తాజాగా కంగువ అనే వెర్సిటైల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నిర్మాత ఒక సందర్భంలో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకున్నాం అన్నారు. ఈ మూవీ బడ్జెట్ కూడా అదే రేంజ్ లో ఉంటోంది. అయితే ఇవన్నీ ఒకెత్తు.. ఇప్పుడు కంగువ గురించి వస్తున్న వార్తలు మరో ఎత్తుగా ఉన్నాయి. ఎందుకంటే ఏకంగా 10 వేల మందితో ఫైట్ సీక్వెన్స్ అంటున్నారు.

స్టార్ హీరో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కంగువ. ఈ మూవీని కంగ అనే ఒక యోధుడి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ఇప్పటికే పార్ట్ 2, పార్ట్ 3 కూడా రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. అయితే మొదటి భాగం సాధించిన ఫలితం ఆధారంగా వాటిని తెరకెక్కించడంపై నిర్ణయం ఉంటుంది. ఈ మూవీ అటు సూర్యా కెరీర్లో కూడా బిగ్గెస్ట్ మూవీ కాబోతోంది. ఎందుకంటే ఈ చిత్రంలో సూర్యా ఏకంగా 6 విభిన్నమైన వేషాల్లో కనిప్సతాడని తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ కంగువ మూవీపై అంచనాలు ఆకాశానికి తీసుకెళ్లే వార్త ఒకటి వినిపిస్తోంది. అది ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

అసలు విషయం ఏంటంటే.. సూర్య కంగువ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఈ మూవీ క్లయిమ్యాక్స్ ని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేశారంట. ఏకంగా పది వేల మందితో ఈ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని చెప్తున్నారు. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే మొదటిసారి అని చెప్పాలి. ఈ ఫైట్ సీన్ ఆర్ఆర్ఆర్, బాహుబలి, పొన్నియన్ సెల్వన్ వంట బడా బడా మూవీస్ ని మించి ఉంటుందని ఈ ఒక్క గాసిప్ తోనే తెలిసిపోతోంది. మొత్తానికి ఇండియన్ సినిమా హిస్టరీలో సౌత్ నుంచి మరో మాస్టర్ పీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీపై ఉన్న అంచనాలను ఈ వార్త రెట్టింపు చేసేసింది.

ఇప్పుడు అంతా ఈ కంగువ సినిమా కోసం తెగ ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా పార్ట్ 1 కచ్చితంగా హిట్ అవుతుంది. పార్ట్ 2, పార్ట్ 3 ప్లాన్ చేసుకోండి అంటూ నెట్టింట మేకర్స్ కు భరోసా కల్పిస్తున్నారు. ఈ వాతావరణం చూస్తుంటే.. కంగువ కచ్చితంగా సూపర్ హిట్టు అవుతుందని అర్థమైపోతోంది. ఇప్పుడు అంతా రిజల్ట్ గురించి కాకుండా.. కలెక్షన్స్ గురించే ఆలోచిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్ మూవీ ఎలా ఉండబోతోంది అనే విషయంపై ఒక క్లారిటీ ఇచ్చేశాయి. మరి.. కంగువలో 10 వేల మందితో ఫైట్ సీక్వెన్స్ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbankobet girişgrandpashabet