iDreamPost
android-app
ios-app

త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన నటుడు

  • Published Nov 20, 2023 | 12:32 PM Updated Updated Nov 20, 2023 | 12:33 PM

కోలీవుడ్ ప్రముఖ నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రీల్ విలన్ మన్సూర్ అలీఖాన్ .. రియల్ లైఫ్ లోనూ విలన్ అయ్యాడు. ఆమె గురించి అనుచితంగా మాట్లాడటంతో ఆయనపై తమిళనాడు సినీ పరిశ్రమలోని ప్రముఖులు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా

కోలీవుడ్ ప్రముఖ నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రీల్ విలన్ మన్సూర్ అలీఖాన్ .. రియల్ లైఫ్ లోనూ విలన్ అయ్యాడు. ఆమె గురించి అనుచితంగా మాట్లాడటంతో ఆయనపై తమిళనాడు సినీ పరిశ్రమలోని ప్రముఖులు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా

  • Published Nov 20, 2023 | 12:32 PMUpdated Nov 20, 2023 | 12:33 PM
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన నటుడు

హీరోయిన్లపై సినీ పరిశ్రమకు చెందిన వారే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం పరిపాటిగా మారిపోయింది. విలన్ పాత్రలతో అలరించే నటుడు మన్సూర్ అలీఖాన్ సైతం తన సహనటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదం కొని తెచ్చుకున్నాడు. గత సినిమాల్లో ఈ మూవీలో రేప్ సీన్ ఉంటుందని భావించానని, త్రిషను కూడా బెడ్ రూమ్‌కి తీసుకెళ్లే సన్నివేశం ఉంటుందనుకున్నా.. కానీ లేదని, కాశ్మీర్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆమె తనకు కనిపించలేదంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై లియో మూవీ డైరెక్టర్ లోకేశ్ కనకరాజు, కార్తీక్ సుబ్బరాజు, మాళవిక మోహనన్, సింగర్ చిన్మయి తదితరులు  మండిపడ్డారు.

కాగా, తనపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేసింది త్రిష. మన్సూర్ అలీఖాన్ తన గురించి నీచంగా, అసభ్యంగా మాట్లాడిన వీడియోను చూశానని, తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు లైంగికంగా, అగౌరవంగా, ద్వేషపూరితంగా ఉన్నాయని అన్నారు. ఇలాంటి వ్యక్తితో తాను స్క్రీన్ షేర్ చేసుకోకపోవడం అదృష్టంగా భావిస్తున్నాని, తాను నటించే సినిమాల్లో తాను యాక్ట్ చేయనని, ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజంలో అందరికీ చెడ్డ పేరు వస్తుందంటూ ట్వీట్ చేసిన సంగతి విదితమే. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో మన్సూర్ వివరణ ఇచ్చుకున్నాడు. ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.

తనకు త్రిషపై మంచి అభిప్రాయం ఉందని, ఆమెను గౌరవిస్తానని పేర్కొన్నాడు. లియోలో నటి త్రిష పాత్ర కీలకం నేపథ్యంలో తనను పర్వతాన్ని ఎత్తుకున్న ఆంజనేయుడితో పోల్చానని, ఆమెకు కాంప్లిమెంట్స్ ఇచ్చానన్నాడు. కానీ కొన్ని స్టేట్ మెంట్స్ మాత్రమే ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారని, అదే ఆమెకు చూపించారన్నాడు. తాను ఎటువంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని పేర్కొన్నాడు.  తనతో పనిచేసిన హీరోయిన్లు అంతా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నారని, వ్యాపార వేత్తలను పెళ్లి చేసుకున్నారని అన్నాడు. తాను తోటి హీరోయిన్స్‌తో ఎలా ఉంటానో అందరికీ తెలుసునని తెలిపాడు.  రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో తన సినీ, రాజకీయ ప్రయాణాన్ని దెబ్బతీసేందుకు ఇలా చేశారని పేర్కొన్నాడు. మరీ ఆయన ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mansoor Ali Khan (@mansoor_alikhan_offl)

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetsmove girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibom