iDreamPost
android-app
ios-app

‘కౌన్ బనేగా కరోడ్ పతి’.. ఆడియెన్స్ వల్ల రూ. 6.40 లక్షలు కోల్పోయిన కంటెస్టెంట్!

  • Published Nov 16, 2023 | 4:30 PM Updated Updated Nov 16, 2023 | 4:30 PM

బాలీవుడ్ లో అత్యంత ఆదరణ పొందిన టెలివిజన్ ప్రోగ్రాం కౌన్ బనేగా కరోడ్ పతి. లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రేక్షకులకు నాలెడ్జ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తోంది. అయితే ఈ షోలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్ ఆడియెన్స్ వల్ల రూ. 6.40 లక్షలు కోల్పోయారు.

బాలీవుడ్ లో అత్యంత ఆదరణ పొందిన టెలివిజన్ ప్రోగ్రాం కౌన్ బనేగా కరోడ్ పతి. లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రేక్షకులకు నాలెడ్జ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తోంది. అయితే ఈ షోలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్ ఆడియెన్స్ వల్ల రూ. 6.40 లక్షలు కోల్పోయారు.

  • Published Nov 16, 2023 | 4:30 PMUpdated Nov 16, 2023 | 4:30 PM
‘కౌన్ బనేగా కరోడ్ పతి’.. ఆడియెన్స్ వల్ల రూ. 6.40 లక్షలు కోల్పోయిన కంటెస్టెంట్!

‘కౌన్ బనేగా కరోడ్ పతి’… ‘బిగ్ బి అమితాబ్ బచ్చన్’ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ ప్రోగ్రాం హిందీ భాషలో టాప్ రేటెడ్ టేలివిజన్ షో గా పేరు పొందింది. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం 15వ సీజన్ కు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుందనే చెప్పి తీరాలి. ఈ షోకి చాల మంది సాధారణ వ్యక్తులతో పాటు ఫేమస్ సెలబ్రిటీస్ కూడా కొన్నిసార్లు గెస్ట్ ల రూపంలో అలరిస్తూ ఉంటారు. అయితే లేటెస్ట్ గా జరిగిన ఎపిసోడ్ లో ‘ఓం సంజు రైకర్’ అనే వ్యక్తి ప్రేక్షకుల మూలాన రూ . 6.50 లక్షల విలువైన ప్రశ్నను కోల్పోయాడు.

కౌన్ బనేగా కరోడ్ పతి 15 సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్ గా జరిగిన ఎపిసోడ్ లో గోవాకు చెందిన ‘ఓం సంజు రైకర్’ అనే వ్యక్తి పాల్గొన్నాడు. అతని తెలివితేటలతో సమాధానాలతో బిగ్ బి హృదయాన్ని గెలుచుకున్నాడు. కానీ.. రూ. 6. 50 లక్షల విలువైన ప్రశ్నను కోల్పోయాడు. బిగ్ బి సంజు రైకర్ ను ఒక కష్టమైన ప్రశ్న అడిగారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటి అంటే ! ‘జంతు రాజ్యంలో ఏ జంతు జాతికి అతి పెద్ద ఐబాల్ ఉంది? ఆప్షన్స్: ఎ) తిమింగలం బి) లెమర్ సి) స్క్విడ్ డి) గుడ్ల గూబ ‘ ఆ ప్రశ్న విన్న తరువాత సంజు రైకర్ సందిగ్ధంలో పడ్డాడు. ఆ సమాధానం కోసం ఆడియన్స్ సహాయం తీసుకోదలచి ఆడియన్స్ పోల్ ఎంచుకున్నాడు. ఆడియన్స్ ఏకగ్రీవంగా ఆప్షన్ ‘డి ‘ ను సూచించారు. సంజు రైకర్ ఆడియన్స్ సూచన మేరకు ఆప్షన్ ‘డి ‘ ను లాక్ చేయమని బిగ్ బి కి చెప్పాడు.

కానీ బిగ్ బి ఆ సమాధానం సరైనది కాదని సరైన సమాధానం ఆప్షన్ ‘సి’ అని ప్రకటించారు. దీనితో సంజు రైకర్ రూ. 6.50 లక్షల ప్రశ్నతో ఆటను ఓడిపోయాడు. ఆడియన్స్ మూలాన తన ఆటను ఓడిపోయినందుకు కాస్త చింతించాడు. అతడు కేవలం రూ.3.20 లక్షల ను మాత్రమే గెలుపొందాడు. ఏదేమైనా ఆటలో గెలుపు ఓటములు అనేవి సహజంగా భావించి అతను తన ఓటమిని అంగీకరించాడు. ఇక బిగ్ బి అతనికి గుడ్ లక్ చెప్పి విష్ చేసారు. ఇకపోతే.. కౌన్ బనేగా కరోడ్ పతి షో విషయానికొస్తే మొదటి సీజన్ నుంచే ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొంది, టాప్ రేటెడ్ షో గా నిలిచింది . దీనికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ నే మొదటి నుండి హోస్ట్ చేయడం విశేషం. మరి ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş