iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ MLA!

  • Author Soma Sekhar Updated - 12:00 PM, Fri - 3 November 23
  • Author Soma Sekhar Updated - 12:00 PM, Fri - 3 November 23
బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ MLA!

బిగ్ బాస్.. బుల్లితెర రియాలిటీ షోల్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక సౌత్ లో బిగ్ బాస్ సీజన్లు వరసగా ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ప్రారంభం అవ్వగా.. అక్టోబర్ 1న తమిళ్ బిగ్ బాస్ 7 కూడా ప్రారంభం అయ్యింది. తాజాగా అక్టోబర్ 8న కన్నడ బిగ్ బాస్ సీజన్ 10 కూడా స్టార్ట్ అయ్యింది. కన్నడ సీజన్ ప్రారంభం కాకముందే.. భారీ అంచనాలు ఈ సీజన్ పై ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్లుగానే కన్నడ బిగ్ బాస్ సీజన్ ప్రారంభం అయ్యింది. ఎవ్వరూ ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంట్రీ ఇచ్చాడు. అతడు హౌస్ లోకి అడుగుపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కన్నడ బిగ్ బాస్ సీజన్ 10లోకి షాకింగ్ కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లోకి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. డప్పుచప్పుళ్ల మధ్య అతడు ఘనంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అతడి ఎంట్రీకి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది. దీంతో ఎమ్మెల్యే బిగ్ బాస్ ఎంట్రీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు సేవ చేయాల్సిపోయి.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఏంటని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

ప్రజా సమస్యలను తీర్చడం మానేసి.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం ఏంటని, అతడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నారు. హౌస్ లోకి ఎంటర్ అయితే బాహ్య ప్రపంచంతోటి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఇలాంటి గేమ్ షోకు ఎమ్మెల్యే వెళ్లడం ఏంటి? ప్రజల సమస్యలను ఎవరు పట్టించుకుంటారు? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరి నెటిజన్ల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఎమ్మెల్యే షో నుంచి వెనక్కి వచ్చేస్తాడా? లేదా హౌస్ లోనే ఉంటాడా? అనేది వేచిచూడాలి. మరి బిగ్ బాస్ లోకి ఎమ్మెల్యే ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet