రవితేజతో పోటీ తప్పడం లేదు : సందీప్ కిషన్

యంగ్ అండ్ టాలెంట్ హీరోల్లో ఒకరు సందీప్ కిషన్. ప్రముఖ సినిమాటో గ్రాఫర్ చోటా కె నాయుడు మేనల్లుడు అయినా.. తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఊరి పేరు భైరవకోనతో రాబోతున్నాడు. ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఈ సందర్భంగా మీడియా ఇంటరాక్షన్ కాగా,

యంగ్ అండ్ టాలెంట్ హీరోల్లో ఒకరు సందీప్ కిషన్. ప్రముఖ సినిమాటో గ్రాఫర్ చోటా కె నాయుడు మేనల్లుడు అయినా.. తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఊరి పేరు భైరవకోనతో రాబోతున్నాడు. ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఈ సందర్భంగా మీడియా ఇంటరాక్షన్ కాగా,

ఫస్ట్ సినిమాతోనే యాక్టింగ్ ఇరగదీసి..తనలో మంచి నటుడున్నాడని నిరూపించుకున్నాడు సందీప్ కిషన్. 2010 మొదలైన సినీ ప్రస్థానం.. ఇప్పుడు మరో మైలు రాయి దగ్గరకు చేరుకుంది. 50వ చిత్రాన్ని చేయబోతున్నాడు. త్వరలో తెలుగు ఆడియన్స్‌ను పలకరించేందుకు ఊరి పేరు భైరవకోనతో రాబోతున్నాడు. తాజాగా ఈ ట్రైలర్ విడుదల చేయగా.. సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలోని ‘నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా’ సాంగ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. లిరిక్స్ సాంగ్ యూట్యూబ్ లో 68 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 9నే విడుదల కానుందని ప్రకటించింది చిత్ర యూనిట్.

ఇక్కడే అసలు సమస్య మొదలైంది. రవితేజ ఈగల్ మూవీ సంక్రాంతి బరిలో దిగినప్పుడే ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ డేట్ ఇస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది ఫిలిం ఛాంబర్. నిర్మాతల మండలి. అదే సమయంలో ఊరు పేరు భైరవ కోన కూడా ఫిబ్రవరి 9నే వస్తుండటంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా రిలీజ్ తేదీపై ప్రశ్నలు ఎదురు కాగా, సందీప్ కిషన్ స్పందించారు. వాస్తవానికి తాము సంక్రాంతికే రావాలని అనుకున్నామని, అయితే చాలా సినిమాలు ఉండటంతోనే.. తమ మూవీని ఫిబ్రవరికి రిలీజ్ చేద్దామని అనుకున్నామన్నారు. అప్పటికే అదే రోజు టిల్లు స్క్వేర్ ను ప్రకటించారని, వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడుకుని ఈ రిలీజ్ డేట్‌కు రావొచ్చా లేదా అని కన్ఫమ్ చేసుకుని.. డేట్ ఫిక్స్ చేసుకున్నామన్నారు.

ఈ పరిస్థితిల్లో డేట్ మార్చుకునే అవకాశం కూడా లేదని, ఎందుకంటే ఇప్పటికే ఎంతో సమయం తీసుకున్నామన్నారు సందీప్. ఇక రవితేజకు నేను పెద్ద ఫ్యాన్ అని, మా డైరెక్టర్ విఐ ఆనంద్ లాస్ట్ సినిమా రవితేజతోనే చేశారని అన్నారు. ఈగల్ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కూడా మాకు మంచి అనుబంధం ఉంది, తనతో సినిమా చేశారు కానీ.. తాము వెనక్కు వెళ్లలేమని అన్నారు. ఈగల్ రిలీజ్ డేట్ విషయంలో మాకు ఎలాంటి కాల్స్ రాలేదని, వస్తే స్పందించేవాళ్లమని అన్నారు. కానీ ఫిబ్రవరి 9 చాలా ఇంపార్టెంట్ డేట్ అని, చాలా రెస్పాన్సిబులిటీ ఉన్నాయి అన్నారు. అలాగే తనకు చిన్నప్పటి నుండి దెయ్యం కథలు ఇష్టమని, ఈ జానర్ సినిమాలంటే ఇష్టమని, ఈ సినిమా పిల్లలకు కూడా నచ్చుతుందని అన్నారు. ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Show comments