Committee kurrollu Movie Strong Hold In 2nd Week: ‘కమిటీ కుర్రాళ్ళు’ మూవీకి సెకండ్ వీక్‌లోనూ తగ్గని హవా!.. ఇంకొన్ని రోజులు నిలబడడం పక్కా!

‘కమిటీ కుర్రాళ్ళు’ మూవీకి సెకండ్ వీక్‌లోనూ తగ్గని హవా!.. ఇంకొన్ని రోజులు నిలబడడం పక్కా!

Committee kurrollu Movie Strong Hold In 2nd Week: 11 మంది హీరోలతో.. పల్లెటూరి బ్యాక్డ్రాప్ తో సరదాగా సాగిపోయే.. నోస్టాలాజిక్ బ్లాక్ బస్టర్ మూవీ 'కమిటీ కుర్రోళ్ళు'. ఆగస్టు 9న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా రెండో వారంలో కూడా .. తెలుగు కథలలో ఉండే సత్తా ఏంటో చూపిస్తూ.. బుకింగ్స్ లో దూసుకుపోతుంది.

Committee kurrollu Movie Strong Hold In 2nd Week: 11 మంది హీరోలతో.. పల్లెటూరి బ్యాక్డ్రాప్ తో సరదాగా సాగిపోయే.. నోస్టాలాజిక్ బ్లాక్ బస్టర్ మూవీ 'కమిటీ కుర్రోళ్ళు'. ఆగస్టు 9న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా రెండో వారంలో కూడా .. తెలుగు కథలలో ఉండే సత్తా ఏంటో చూపిస్తూ.. బుకింగ్స్ లో దూసుకుపోతుంది.

ఒక సినిమాకు ఎంత బడ్జెట్ కేటాయించినా కూడా అందులో కథ లేకపోతే మాత్రం కచ్చితంగా అది డిజాస్టర్ గానే నిలుస్తుంది. అలాగే ఓ సినిమాకు తక్కువ బడ్జెట్ కేటాయించినా స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా.. కథ బావుంటే మాత్రం యునానిమస్ గా ప్రేక్షకులు దానిని హిట్ చేసేస్తారు. ఇప్పటికే ఈ ఫార్ములా చాలా సినిమాల విషయంలో ప్రూవ్ అయింది. చిన్న సినిమాగా రేస్ లోకి వచ్చి హిట్ కొట్టేసిన సినిమాల లిస్ట్ లో.. ఇప్పుడు ఆగష్టు 9న రిలీజ్ అయినా ‘కమిటీ కుర్రోళ్ళు’ కూడా యాడ్ అయిపొయింది. ఇండిపెండెన్స్ డే కు నాలుగు సినిమాలు రిలీజ్ కావడం, లాంగ్ వీకెండ్ రావడంతో.. కమిటీ కుర్రోళ్ళు మూవీపై ఆ ఎఫెక్ట్ పడుతుందనుకున్నారు కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సెకండ్ వీక్ లో కూడా కమిటీ కుర్రోళ్ళుకు భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు.. సైలెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. విడుదలైన మొదటి షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ వారం స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినా కూడా.. కమిటీ కుర్రాళ్ళ హావ మాత్రం ఎక్కడా తగ్గలేదు. సెకండ్ వీక్ లో కూడా అదే హోల్డ్ ను కనబరుస్తుంది. గడిచిన 24 గంటల్లో ఈ సినిమాకు 17 వేలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. స్ట్రాంగ్ పోటీ ఉన్నా కూడా.. ఇలాంటి బుకింగ్స్ ఉన్నాయంటే మెచ్చుకోవాల్సిన విషయమనే చెప్పి తీరాలి.

కమిటీ కుర్రోళ్ళు సినిమాకు యధు వంశీ దర్శకత్వం వహించగా .. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రచిరాజు, ప్రసాద్ బెహరా లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. 11 మంది హీరోలతో తెరకెక్కిన ఈ మూవీ… నోస్టాలాజిక్ బ్లాక్ బస్టర్ గా సూపర్ సక్సెస్ సాధించింది. ప్రేక్షకులు ఇంట్రెస్ట్ కు తగినట్లు.. దర్శకుడు కథను చూపించిన తీరు ప్రతి ఒక్కరిని మెప్పించింది. లాంగ్ రన్ లో కచ్చితంగా ఈ సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం లేకపోలేదు. ఇక ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments