iDreamPost
android-app
ios-app

నడవలేని స్థితిలో కమెడియన్ సుధాకర్.. కుమారుడి పెళ్లి జరిపించిన సెలబ్రిటీలు

  • Published Feb 22, 2024 | 10:02 PM Updated Updated Feb 22, 2024 | 10:02 PM

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నారు.. కానీ కొద్ది మంది మాత్రమే తమదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు.. అలాంటి వారిలో సుధాకర్ ఒకరు.

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నారు.. కానీ కొద్ది మంది మాత్రమే తమదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు.. అలాంటి వారిలో సుధాకర్ ఒకరు.

  • Published Feb 22, 2024 | 10:02 PMUpdated Feb 22, 2024 | 10:02 PM
నడవలేని స్థితిలో కమెడియన్ సుధాకర్.. కుమారుడి పెళ్లి జరిపించిన సెలబ్రిటీలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు సుధాకర్. కెరీర్ బిగినింగ్ లో ఆయన తమిళ నాట పలు చిత్రాల్లో హీరోగా నటించారు. తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కొన్ని సినిమాల్లో హీరోగా నటించి తర్వాత విలన్, కమెడీ, క్యారెక్టర్ పాత్రల్లో నటించాడు. మెగాస్టార్ చిరంజీవికి ఆప్తమిత్రుడిగా పేరు తెచ్చుకున్నారు సుధాకర్. అప్పట్లో వెండితెరపై వీరిద్దరి కామెడీ థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వుకునేవారు. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తన సత్తా చాటారు సుధాకర్. కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ కనిపించారు. తాజాగా సుధాకర్ ఏకైక కుమారుడి వివాహం జరిగింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో దాదాపు మూడు దశాబ్దాల పాటు హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ ప్రేక్షకుల మనసు గెలిచారు నటుడు సుధాకర్. తర్వాత బ్రెయిన్ స్టోక్ రావడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. సుధాకర్ సినిమాలకు దూరమై దాదాపు 17 సంవత్సరాలు అవుతుంది. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన సుధాకర్ చివరి రోజుల్లో పవన్ కళ్యాన్ తో కలిసి నటించారు. మెగా ఫ్యామిలీతో సుధాకర్ కి ఎంతో అనుబంధం ఉంది. ఒకప్పుడు చిరంజీవి, సుధాకర్ రూమ్ మెట్స్ తెలిసిందే. సుధాకర్ తన ఏకైక కుమారుడు బెనిడిక్ మైఖేల్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని గతంలో వెల్లడించారు.. అది కూడా మెగాస్టార్ చేతుల మీదుగా బెన్నీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.

ఇటీవల సుధాకర్ తనయుడి వివాహం జరిపించారు.. ఈ వేడుకకు టాలీవుడ్ సెలబ్రెటీలు జగపతి బాబు, బ్రహ్మానందం, రోజా రమణి, చంద్రబోస్ దంపతులు.. మరికొంతమంది సెలబ్రెటీలు హాజరయ్యారు. బెన్నీ వివాహం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఫిబ్రవరి రెండో వారంలో పెళ్లి జరిగినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా సుధాకర్ ఆరోగ్య పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్లు టాలీవుడ్ టాక్. నడవలేని స్థితిలో ఉన్న సుధాకర్ ని ఇద్దరి సాయంతో స్టేజ్ పైకి తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. ఈ వివాహ, రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో సుధాకర్ చాలా నీరసంగా కనిపిస్తున్నారు. బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని విధంగా కనిపిస్తున్నారు. ఒకప్పటి అందరినీ కడుపుబ్బా నవ్వించిన సుధాకర్ ఇప్పుడు ఇలా మారిపోయారేంటీ? అని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş