iDreamPost
android-app
ios-app

అమృతం సీరియల్లో నటించిన ఈ స్టార్ కమెడియన్‌ను గుర్తు పట్టారా…?

  • Published Jul 06, 2024 | 12:51 PM Updated Updated Jul 06, 2024 | 12:51 PM

Amrutham Serial.. మానసిక ఒత్తిడి తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నవ్వు దోహదపడుతుంది. నవ్వడం వల్ల ఎన్నో సమస్యలు మటుమాయం అవుతాయని అంటుంటారు వైద్యులు. కానీ అనుకోగానే నవ్వు రాదు కదా. ఆ బాధ్యతను తీసుకున్నాయి కొన్ని సీరియల్స్. వాటిల్లో ఒకటి అమృతం.

Amrutham Serial.. మానసిక ఒత్తిడి తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నవ్వు దోహదపడుతుంది. నవ్వడం వల్ల ఎన్నో సమస్యలు మటుమాయం అవుతాయని అంటుంటారు వైద్యులు. కానీ అనుకోగానే నవ్వు రాదు కదా. ఆ బాధ్యతను తీసుకున్నాయి కొన్ని సీరియల్స్. వాటిల్లో ఒకటి అమృతం.

  • Published Jul 06, 2024 | 12:51 PMUpdated Jul 06, 2024 | 12:51 PM
అమృతం సీరియల్లో నటించిన ఈ స్టార్ కమెడియన్‌ను గుర్తు పట్టారా…?

’నవ్వడం యోగం, నవ్వకపోవడం ఒక రోగం‘ అన్నాడో మహాకవి. అయితే నవ్వించడం కూడా ఓ వరం. ఏ నటనైనా తేలిగ్గా చేయొచ్చు కానీ.. కామెడీ పండించాలంటే చాలా కష్టమని ఎంతో మంది సినిమా ప్రముఖులు చెబుతుంటారు. ఆ అరుదైన వరం తెలుగు ఇండస్ట్రీలో అతి కొద్ది మందికి దొరికింది. ఒకప్పుడు రేలంగి, రాజబాబు, అల్లు రామలింగయ్య వంటి నటులు నవ్వించారు. ఆ తర్వాత బ్రహ్మానందం, బాబు మోహన్, ఆలీ, సునీల్, వేణు మాధవ్, ఏవీఎస్, ధర్మవరపు, సునీల్ వంటి కమెడియన్లు వచ్చారు. వీరికి కొంత మంది లేడీ కమెడియన్లు తోడై నవ్వులు పువ్వులు పూయించారు. అయితే ఈ మధ్య కాలంలో హాస్యంతో కామెడీని పండిస్తున్న మరో నటుడు సత్య.

ఇంజనీరింగ్ చేసిన ఓ కుర్రాడు.. సినిమాలపై పిచ్చితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసి.. నటుడిగా మారాడు. ప్రస్తుతం స్టార్ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు. పిల్ల జమీందార్ చిత్రంలో పులి కేసిగా మొదలైన అతడి సినీ కెరీర్..అప్రతిహతంగా కొనసాగుతోనే ఉంది. స్వామి రారా మూవీతో క్లిక్ అయిన ఈ కమెడియన్.. వరుస పెట్టి అవకాశాలు కొల్లగొడుతున్నాడు. ఈ పదమూడేళ్లలో అప్పుడే దాదాపుగా వంద సినిమాలు చేశాడు సత్య. ఒకప్పుడు సునీల్ ఈ తరహాలో అవకాశాలను కొల్లగొట్టాడు. హీరోగా మారిపోవడంతో.. కామెడీ రోల్స్ పక్కన పెట్టాడు. ఇప్పుడు ఆ ప్లేసును రీ ప్లేస్ చేశాడు . అయితే సత్య అటు సినిమాలు చేస్తూనే.. జబర్థస్త్‌లో కూడా కనిపించిన సంగతి విదితమే.

అయితే ఈ రెండింటికి ముందు అతడో సీరియల్లో కనిపించాడన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు . ఇంతకు ఆ ధారావాహిక ఏంటో తెలుసా.? ‘ఓరేయ్ ఆంజనేయులు, తెగ ఆయాస పడిపోకు చాలు.. మనం ఈదుతున్నాం..ఒక చెంచాడు భవసాగరాలు’ అంటే ఠక్కున చెప్పే సీరియల్ అమృతం. 90స్ లో బుల్లితెరపై కితకితలు పెట్టిన ఈ ధారావాహికలో కనిపిస్తాడు సత్య. అన్ హ్యాపీ ఎపిసోడ్స్ పార్ట్ 1, పార్ట్ 2లో నటించాడు ఈ స్టార్ కమెడియన్. ఆ ఎపిసోడ్‌లో అప్పాజీకి సీనియర్‌ గ్యాంగ్‌లో ఉంటాడు. ఈ ఎపిసోడ్‌లో సరదాగా బుక్ క్రికెట్ ఆడతారు. అందులో కూడా కనిపిస్తాడు ఈ నటుడు. ఇదిగో ఈ వీడియో చూడండి.. అందులో స్పష్టంగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అమృతం సీరియల్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కొన్ని ఎపిసోడ్స్ యూట్యూబ్‌లో కూడా ఉన్నాయి. ఇక సత్య సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రంతో అలరించాడు. హీరోగా కూడా మారి పలు సినిమాలు చేశాడు.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş