iDreamPost
android-app
ios-app

అప్పట్లో అలీకి శోభన్ బాబు వార్నింగ్! ఇదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ!

  • Published Mar 20, 2024 | 6:02 PM Updated Updated Mar 20, 2024 | 6:02 PM

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ అలీ .. అందరికి సుపరిచితుడే. సుమారు 45 ఏళ్ళ నుంచి అలీ తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు, టీవీ షోలతో రాణిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ షో లో సీనియర్ యాక్టర్ శోభన్ బాబు అలీ కి ఇచ్చిన సలహాల గురించి చెప్పుకొచ్చారు.

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ అలీ .. అందరికి సుపరిచితుడే. సుమారు 45 ఏళ్ళ నుంచి అలీ తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు, టీవీ షోలతో రాణిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ షో లో సీనియర్ యాక్టర్ శోభన్ బాబు అలీ కి ఇచ్చిన సలహాల గురించి చెప్పుకొచ్చారు.

  • Published Mar 20, 2024 | 6:02 PMUpdated Mar 20, 2024 | 6:02 PM
అప్పట్లో అలీకి శోభన్ బాబు వార్నింగ్! ఇదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ!

కమెడియన్ అలీ గురించి తెలియని వారు ఉండరు. 1980లో సీతాకోక చిలుక సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అలీ.. కొన్ని వందల సినిమాలలో.. తన అద్భుతమైన నటనను కనబరిచి.. ఎందరో హృదయాలలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటికి కూడా ఏ మాత్రం అలసిపోకుండా.. అంతే ఉత్సాహంతో సినిమాలు, పలు టీవీ షో లు చేస్తూ ఉంటారు అలీ. తెలుగు ఇండస్ట్రీలో సుమారు 45 ఏళ్ళ సుధీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించిన అలీ కి.. ఇండస్ట్రీలో ఎంతో మంది లెజెండరీ నటులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణం రాజు ఇలా ఎంతో మంది స్టార్ సెలెబ్రిటలతో .. అలీ కి సాన్నిహిత్యం ఉంది. అయితే, తాజాగా అలీ ఓ షో లో మాట్లాడుతూ.. సీనియర్ యాక్టర్ శోభన్ బాబు తనకు ఇచ్చిన సూచనలను గుర్తుచేసుకున్నారు. అలీ చెప్పిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.

అలీ “అలీతో సరదాగా” అనే టీవీ ప్రోగ్రాంను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు ప్రతి వారం ప్రముఖ సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇటీవల ఈ ప్రోగ్రాంకు హీరో శివాజి గెస్ట్ గా వచ్చారు. అలీ కి, శివాజీకి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది . వీరిద్దరూ కలిసి సుమారు 20 చిత్రాలకుపైగానే నటించారు. అయితే, షో లో భాగంగా అలీ, శివాజీని కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వేశారు. అంతే ఇంట్రెస్టింగ్ గా శివాజీ కూడా ఆన్సర్ చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో శివాజీ మాట్లాడుతూ .. అలీ ఇచ్చిన సలహాలని తానూ జీవితంలో పాటిస్తున్నానని చెప్పారు. “మనం ఆర్టిస్టులం , మన జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేము. కాబట్టి మన సొంత ఊరిలో ఆస్తులు, ఇల్లు తప్పకుండ ఉంచుకోవాలి” అంటూ గతంలో అలీ చెప్పారట. “అన్నా నువ్వు చెప్పినట్లుగానే మా ఊరిలో కోటి 25 లక్షలతో ఇల్లు కట్టాను. అలాగే 30 ఎకరాల పొలం కూడా ఉంది”. అంటూ శివాజీ చెప్పుకొచ్చారు.

Ali Shoban Babu

దానికి వెంటనే అలీ స్పందిస్తూ.. “నేను నీకు చెప్పిన ఈ విషయాన్ని నాకు శోభన్ బాబు గారు చెప్పారు. నాకు కాస్త ఫేమ్ వచ్చాక బాగా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని. దీనితో శోభన్ బాబుగారు తనకి సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. శోభన్ బాబు చెబుతూ.. అలీ.. ఆర్టిస్ట్ అనేవాడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఒక వేళ నువ్వు డబ్బు లేకుండా ఆకలితో అలమటిస్తుంటే కనీసం నీ కులపోడు కూడా నీ దగ్గరకి రాడు. ఎవ్వడూ నీకు బిర్యాని ప్యాకెట్ ఇవ్వడు. ఫ్రెండ్స్, బంధువులు ఎవ్వరూ నిన్ను పట్టించుకోరు. నువ్వు బావుంటేనే నీ దగ్గరకి అందరూ వస్తారు. నీ దగ్గర డబ్బులేకుంటే రారు. నీకు అప్పు అడిగే ఉద్దేశం లేకున్నా నీ దగ్గరకి రారు. ఇది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మసులుకో. కాస్ట్లీ కార్లు లాంటివి కొనొద్దు. నల్ల బంగారం మీద డబ్బు పెట్టు అని అన్నారు. నాకు అర్థ కాక.. నల్ల బంగారం ఏంటండీ అని అడిగా.. అదేరా భూమి రా అని శోభన్ బాబు చెప్పారు” అంటూ ఈ సందర్బంగా అలీ శోభన్ బాబును గుర్తు చేసుకున్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss