వీడియో: హీరోయిన్, ఎంపీ కంగనాపై చేయి చేసుకున్న లేడీ జవాన్! నటి షాకింగ్ రిప్లై

Lady Jawan Slapped Kangana: జవాన్లు, పోలీసులు అంత త్వరగా పబ్లిక్ మీద చేయి చేసుకోకూడదు. అందులోనూ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి మీద అస్సలు చేయి చేసుకోకూడదు. అది కూడా వ్యక్తిగత కారణాల వల్ల డ్యూటీలో ఉండగా చేయి చేసుకోకూడదు. కానీ ఒక లేడీ జవాన్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ మీద చేయి చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Lady Jawan Slapped Kangana: జవాన్లు, పోలీసులు అంత త్వరగా పబ్లిక్ మీద చేయి చేసుకోకూడదు. అందులోనూ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి మీద అస్సలు చేయి చేసుకోకూడదు. అది కూడా వ్యక్తిగత కారణాల వల్ల డ్యూటీలో ఉండగా చేయి చేసుకోకూడదు. కానీ ఒక లేడీ జవాన్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ మీద చేయి చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇటీవల ఎన్నికల ఫలితాల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి నియోజకవర్గ ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్ పై సీఐఎస్ఎఫ్ జవాన్ చేయి చేసుకుంది. హీరోయిన్, బీజేపీ నాయకురాలు, మండి ఎంపీ కంగనా రనౌత్ ని ఛండీగఢ్ విమానాశ్రయంలో లేడీ జవాన్ చెంప దెబ్బ కొట్టింది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కంగనా ఢిల్లీ ఫ్లైట్ కోసం విమానాశ్రయంలో ఉండగా.. సీఐఎస్ఎఫ్ జవాన్ కుల్విందర్ కౌర్ చేయి చేసుకుంది. సెక్యూరిటీ చెక్-ఇన్ తర్వాత బోర్డింగ్ కి వెళుతుండగా లేడీ జవాన్ తనను చెంప దెబ్బ కొట్టినట్లు కంగనా ఆరోపించారు. రైతుల ఉద్యమాన్ని అవమానించారన్న కారణంగా తనను దూషిస్తూ తనపై దాడి చేశారని కంగనా ఆరోపించారు. అయితే కంగనాతో కలిసి ప్రయాణిస్తున్న మయాంక్ మధుర్.. లేడీ జవాన్ ని కొట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

కాగా కంగనా రనౌత్ ఆ లేడీ జవాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ ఎయిర్ పోర్టుకి చేరుకున్నానని.. బోర్డింగ్ కోసం వెళ్తుండగా తనపై కుల్విందర్ కౌర్ అనే లేడీ జవాన్ చేయి చేసుకున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా విడుదల చేశారు. తనను ఆ లేడీ జవాన్ దూషించారని.. కొట్టారని అన్నారు. అయితే తాను సురక్షితంగానే ఉన్నానని.. కానీ పంజాబ్ లో పెరుగుతున్న ఉ*గ్ర*వాదాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఢిల్లీ చేరుకున్నాకా సీనియర్ అధికారుల సమక్షంలో ఈ సంఘటన గురించి వెల్లడించారు. సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ కి ఫిర్యాదు చేశారు. కాగా కంగనా ఫిర్యాదు మేరకు పోలీసులు లేడీ జవాన్ కుల్విందర్ కౌర్ ని అరెస్ట్ చేశారు. ఆమెను సీఓ గదిలో నిర్బంధించి విచారణ చేస్తున్నారు.

అలానే విమానాశ్రయంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను తనిఖీ చేస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కంగనా రనౌత్ బీజేపీ తరపున మండి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ మీద 74,755 మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితాల్లో కంగనా రనౌత్ కి 5,37,022 ఓట్లు పడగా.. విక్రమాదిత్య సింగ్ కి 4,62,267 ఓట్లు పడ్డాయి. ఇక కంగనా రనౌత్ తెలుగులో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ సినిమాలో నటించారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనా.. అటు బాలీవుడ్ లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఇటు రాజకీయాల్లో కూడా ప్రశ్నలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంపీగా గెలిచి తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమయ్యారు.

Show comments