iDreamPost
android-app
ios-app

స్టార్ హీరోయిన్‌పై కేసు నమోదు.. చిత్రవధ చేసిందంటూ

  • Published Sep 21, 2024 | 6:08 PM Updated Updated Sep 21, 2024 | 6:08 PM

స్టార్ హీరోయిన్ వివాదంలో చిక్కుకోవడంతో పాటు ఆమెపై కేసు కూడా నమోదు అయ్యింది. ఆమె తనను చిత్ర వధ చేసిదంటూ సుభాష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇంతకు ఆమె ఏం చేసిందంటే..?

స్టార్ హీరోయిన్ వివాదంలో చిక్కుకోవడంతో పాటు ఆమెపై కేసు కూడా నమోదు అయ్యింది. ఆమె తనను చిత్ర వధ చేసిదంటూ సుభాష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇంతకు ఆమె ఏం చేసిందంటే..?

  • Published Sep 21, 2024 | 6:08 PMUpdated Sep 21, 2024 | 6:08 PM
స్టార్ హీరోయిన్‌పై కేసు నమోదు.. చిత్రవధ చేసిందంటూ

ఈ మధ్య కాలంలో సామాన్యుల ఇళ్లల్లోనే కాదు స్టార్ సెలబ్రిటీ నివాసాల్లో కూడా దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంట్లో పనిచేసే వ్యక్తులే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది రజనీకాంత్ కూతురు, ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య ఇంట్లో దొంగతనం జరగ్గా.. చివరకు పనిమనిషి, కారు డ్రైవర్ చోరీ చేశారని తేలింది. అలాగే ఇటీవల కల్కితో కంబ్యాక్ ఇచ్చిన ఒకప్పటి స్టార్ బ్యూటీ శోభన ఇంట్లో కూడా దోపిడీ జరిగింది. ఆ వెంటనే రాధిక సోదరి నిరోషా ఇంట్లో కూడా దొంతనం చోటుచేసుకుంది. మరాఠి భామ శ్వేతా షిండే ఇల్లు గుల్ల చేశారు. ఈ ఏడాది ప్రముఖ నటి అతుల్య రవి ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. ఇదిలా ఉంటే.. గత ఏడాది ప్రముఖ కోలీవుడ్ నటి పార్వతి నాయర్ సైతం.. ఇటువంటి ఆరోపణలు చేసింది. అయితే ఈ వివాదం వల్ల ఆమె సమస్యల్లో చిక్కుకుంది. అసలు ఏమైందంటే..?

కోలీవుడ్, మాలీవుడ్ ప్రముఖ నటి పార్వతి నాయర్ ఇంట్లో తన ఇంట్లో దొంగతనం జరిగిందని, తన వద్ద వర్క్ చేసే సుభాష్ చంద్రబోస్ చోరీకి పాల్పడ్డాడంటూ వరుసగా  పోలీసులకు ఫిర్యాదులు చేసింది. అక్టోబర్ 20న నుంగంబాక్కంలోని తన ఇంట్లో రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్ టాప్ దొంగతనం చేశాడని పేర్కొంది. పుదుకోట్టై జిల్లాకు చెందిన సుభాష్ చంద్రబోస్ కారణమని పేర్కొంది. దీంతో సుభాష్ చంద్రబోస్ సైతం తేనాం పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనను నటి పార్వతి నాయర్ కొట్టి మానసిక క్షోభకు గురి చేసిందని, తనపై దొంగతనం కేసు పెట్టిందని, చిత్రవధకు గురి చేసిందని కంప్లయింట్‌లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ ఘటనలో మరో మలుపు చోటుచేసుకుంది.

కాగా, పార్వతి నాయర్‌తో పాటు మరికొందరిపై సుభాష్ తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో.. ఇప్పుడు సైదా పేట కోర్టులో కేసు వేశాడు. ఆమెతో పాటు మరికొందరు తనపై దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ కోరాడు. తన చిత్రవధకు గురి చేశారని, తేనాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని పేర్కొన్నాడు. ఈ కేసు పరిశీలించిన స్థానిక కోర్టు.. చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించింది. దీంతో పార్వతి నాయర్, నిర్మాత కొడప్పాడి రాజేష్ తదితరులపై తేనాం పేట పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పార్వతి నాయర్ తెలుగు మినహాయించి.. సౌత్ ఇండస్ట్రీ మొత్తం చుట్టేసింది. అయితే డబ్బింగ్ చిత్రాలతో ఆమె తెలుగు వారికి సుపరిచితమే. ఎంత వాడు గానీ, ఉత్తమ విలన్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆలంబన ఆనే చిత్రం చేస్తుంది అమ్మడు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetador girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom