iDreamPost
android-app
ios-app

నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మీడియాపై ఫైర్ అయినా జానీ మాస్టర్ భార్య

  • Published Sep 19, 2024 | 3:37 PM Updated Updated Sep 19, 2024 | 3:37 PM

Choreographer Jani Master Wife: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ భార్య చేస్తున్న హంగామా మరిన్ని ప్రశ్నలకు దారితీస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Choreographer Jani Master Wife: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ భార్య చేస్తున్న హంగామా మరిన్ని ప్రశ్నలకు దారితీస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 19, 2024 | 3:37 PMUpdated Sep 19, 2024 | 3:37 PM
నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మీడియాపై ఫైర్ అయినా జానీ మాస్టర్ భార్య

గత రెండు రోజులుగా మీడియా సోషల్ మీడియాలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూ బర్నింగ్ టాపిక్. దానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వింటూనే వస్తున్నాం. జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్.. జానీ మాస్టర్ తో పాటు.. అతని భార్యపై కూడా కేసు పెట్టిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ భార్య ఆయేషా కూడా ఆమెపై దాడికి పాల్పడిందని.. మహిళా కొరియోగ్రాఫర్ పిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం గోవాలో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతనిని గోవా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇంతలోనే సీన్ లోకి జానీ మాస్టర్ భార్య ఎంటర్ అయింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అయేషాను.. మీడియా చుట్టుముట్టింది. వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు అయేషా మీడియాపై మండిపడింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ వివాదం మొదలైన తర్వాత మొదటి సారి జానీ మాస్టర్ భార్య కనిపించింది. అది కూడా సరిగ్గా జానీ మాస్టర్ అరెస్ట్ అయిన కొద్దీ గంటల్లోనే ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు రావడంతో.. ఈ కేసుకు సంబంధించి మీడియా ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేసింది. తన భర్త అక్కడే ఉన్నాడని ఫేక్ కాల్ రావడంతో.. ఆమె పోలీస్ స్టేషన్ కు వచ్చానంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన భర్తను చూపించాలంటూ.. హంగామా చేసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన కంప్లైంట్ లో మీ పేరు కూడా ఉంది కదా.. దానిపై మీ స్పందన ఏంటి అని మీడియా ప్రశ్నించగా.. వెంటనే ఆమె మీడియాపై ఫైర్ అయింది. నాకే కెమెరాలు పెడతారా.. మీ అందరిపైన కేసు పెడతానంటూ అందరిని బెదిరించింది. దీనితో ఇప్పుడు ఆమెపై కూడా అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుతో ఆమెకు కూడా సంబంధం ఉందా.. లేదా భర్తను కాపాడుకోవడం కోసం ప్లాన్ చేస్తుందా అని ఇలా రకరకాల సందేహాలు మొదలతున్నాయి.

ఇక ఇది కాకుండా జానీ మాస్టర్ భార్య విషయంలో వినిపిస్తున్న మరో వార్త ఏంటంటే. ఆమె ఓ కంప్లైంట్ ఇవ్వడం కోసమే స్టేషన్ కు వచ్చారంటూ పోలీసులు తెలిపారు. అంతే కాకుండా విచారణలో పోలీసులకు సహకరించి.. అతను ఎక్కడ ఉన్నాడో చెప్పింది కూడా ఆమె అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజం.. ఏది పుకారు అనే దానిపై ఇప్పటికైతే ఎలాంటి క్లారిటీ లేదు. మరి కాసేపట్లోనే జానీ మాస్టర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు చేరుకోనున్నాడు. విచారణ పూర్తయితే కానీ..అసలు నిజ నిజాలు ఏంటో తెలియదు. దీనిలో ఈ భార్య భర్తలు మాత్రమే ఉన్నారా.. లేదా వీరి వెనుక ఇంకెవరైనా ఉన్నారా.. అసలు నిజంగా ఇది ఎప్పటినుంచి కొనసాగుతుంది. ఇలాంటి ఎన్నో విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. మరి జానీ మాస్టర్ కు సంబంధించిన ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom