iDreamPost
android-app
ios-app

అదే జరిగితే జానీని వదిలేసి వెళ్తా.. భార్య సంచలన కామెంట్స్!

  • Published Sep 19, 2024 | 7:27 PM Updated Updated Sep 19, 2024 | 7:27 PM

Jani Master Wife: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సంచలన కామెంట్స్ చేసింది. తన భర్తపై చేసిన ఆరోపణలకు ప్రూఫ్స్ తీసుకొస్తే జానీని వదిలేసి వెళ్తా అంటూ సవాల్ చేసింది.

Jani Master Wife: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సంచలన కామెంట్స్ చేసింది. తన భర్తపై చేసిన ఆరోపణలకు ప్రూఫ్స్ తీసుకొస్తే జానీని వదిలేసి వెళ్తా అంటూ సవాల్ చేసింది.

  • Published Sep 19, 2024 | 7:27 PMUpdated Sep 19, 2024 | 7:27 PM
అదే జరిగితే జానీని వదిలేసి వెళ్తా.. భార్య సంచలన కామెంట్స్!

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు అతనిపై అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జానీపై వచ్చిన లైంగిక వేధింపులు ఆరోపణలపై ఆయన భార్య సంచలన కామెంట్స్ చేసింది. తన భర్త జానీ అలాంటి వాడు కాదని.. కావాలనే కుట్ర చేస్తున్నారని తెలిపింది. ఓ మీడియా చానల్ తో మాట్లాడిన జానీ భార్య పలు సంచలన విషయాలను వెల్లడించింది.

జానీ భార్య మాట్లాడుతూ.. 16 ఏళ్లప్పుడు రేప్ జరిగిందనడానికి ప్రూఫ్ ఏంటి? అంతకు ముందు చాలా షోస్ చేసినప్పుడు ఆ అమ్మాయికి చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయి. మిగతా కొరియోగ్రాఫర్స్ తో ఎఫైర్ లేదని ఏంటి గ్యారంటీ అని ప్రశ్నించింది. మైనర్ గా ఉన్నప్పుడు రేప్ జరిగిందని చెప్తున్నది. ఆ అమ్మాయి ప్రూఫ్స్ తీసుకొస్తే జానీని వదిలేసి వెళ్తా అని సవాల్ చేసింది. ఆమె వర్క్ చేసిన ఇతర కొరియోగ్రాఫర్స్ భార్యలు కూడా ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారు. అన్యాయం జరిగిందన్న దానివి ఎందుకు బయటకు వచ్చి మాట్లాడవు అని జానీ భార్య ప్రశ్నించింది. ఏ సాక్ష్యాలు ఉన్నాయో చూపించమనండి. బయటికి రమ్మనండి ఎక్కడో ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు గదా అని వెల్లడించింది.

తనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆ అమ్మాయి మాస్టర్ కు దగ్గరగా ఉండడం, అతనితో చనువుగా ఉంటుందని అంతా చెప్పేవారని తెలిపింది. మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారం జరిగితే జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేయడం నా అదృష్టమని స్మైలీ ఫెస్ తో ఎలా చెప్తుంది. ఆమెకు అవకాశాలు రాకుండా జానీ ఎప్పుడూ అడ్దుకోలేదు. యూనియన్ కార్డ్ ఇప్పించిందే జానీ మాస్టర్. హీరో శర్వానంద్ మూవీలో కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చారు. ఆ అమ్మాయి వాళ్లు యూపీ నుంచి వచ్చారు. ఆ అమ్మాయికి తండ్రి లేడు. వాళ్ల అమ్మ ప్రెజర్ వల్ల ఇండస్ట్రీకి వచ్చింది. తల్లీకూతుళ్ల ప్రవర్తన ఆడవారికే కళంకం తెచ్చేలా ఉంటుంది. ఈ రోజు మహిళా సంఘాలు, ఇంకా ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక సైడ్ మాత్రమే వింటారా? నిజాలు తెలుసుకోకుండా అలా ఎలా డిసైడ్ చేస్తారంటూ ప్రశ్నించింది. లవ్ జిహాద్ అంటూ ఆరోపిస్తున్నారు. ఆయన అన్ని మతాలను గౌరవిస్తారు.

భారత్ కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తి జానీ మాస్టర్ అని చెప్పింది. జానీ ప్రెసిడెంట్ అయ్యాక ఆ అమ్మాయికి మాస్టర్ కార్డు ఇవ్వాలని చెప్పారు. కానీ, కొంతమంది అడ్డుకున్నారు. కానీ ఆమెకు యూనియన్ లో కార్డు ఇప్పించేందుకు మేమిద్దరం ఫైట్ చేశాం అని తెలిపింది. కావాలనే జానీ మాస్టర్ పై కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. 14 ఇయర్స్ నుంచి తనతో ఉంటున్నాను. తను తప్పుడు పనులు చేస్తుంటే నేను ఊరుకుంటానా అని చెప్పింది. ఎప్పుడో అత్యాచారం జరిగిందని చెప్తూ ఇప్పుడు కేసు పెట్టడమేంటీ? ఇంతకాలం ఎందుకు బయటికి రాలేదు. దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటీ? అని ప్రశ్నించింది. సెక్సువల్ హరాష్ మెంట్ చేశాడని ఆమె సాక్ష్యాలు చూపిస్తే నేనే మాస్టర్ ను వదిలేసి వెళ్లిపోత అని స్పష్టం చేసింది. మాస్టర్ ను ఎదగకుండా చేసేందుకే ఇలా కుట్రలు చేస్తున్నారని తెలిపింది. మొన్న రేవ్ పార్టీ అని.. ఇప్పుడు లైంగిక ఆరోపణలతో టార్గెట్ చేస్తున్నారు. జానీ ఏ తప్పు చేయలేదు అని ఆయన భార్య చెప్పుకొచ్చింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet