iDreamPost
android-app
ios-app

జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర కోణం.. ఆయనంటే జలస్: ఆయేషా

  • Published Sep 21, 2024 | 2:52 PM Updated Updated Sep 21, 2024 | 2:52 PM

Jani Master Wife Sumalatha: టాలీవుడ్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ అరెస్ట్ సంచలనంగా మారుతుంది. అదే విధంగా ఈ కేసులో ట్విస్టులు కూడా నెలకొంటున్నాయి. కాగా, జానీ భార్య తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన అరెస్ట్ వెనుక కుట్ర కోణం ఉందని..

Jani Master Wife Sumalatha: టాలీవుడ్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ అరెస్ట్ సంచలనంగా మారుతుంది. అదే విధంగా ఈ కేసులో ట్విస్టులు కూడా నెలకొంటున్నాయి. కాగా, జానీ భార్య తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన అరెస్ట్ వెనుక కుట్ర కోణం ఉందని..

  • Published Sep 21, 2024 | 2:52 PMUpdated Sep 21, 2024 | 2:52 PM
జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర కోణం.. ఆయనంటే జలస్: ఆయేషా

టాలీవుడ్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ అరెస్ట్ సంచలనం కలిగిస్తుంది. లేడీ కొరియోగ్రాఫర్ చేసిన అత్యాచార ఆరోపణలపై జానీని అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్ నిమిత్తం చంచల్ గూడ జైలుకు తరలించారు. కానీ ఈ కేసులో తనను కావాలనే ఇరికించారని, ఎవరినీ వదిలిపెట్టనూ అంటూ జానీ మాస్టర్ కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. జానీ మాస్టర్ భార్య, ఆయేషా అలియాస్ సుమలత కూడా ఆయనపై పెద్ద కుట్ర జరుగుతుందని ఆరోపించింది. జానీని ఇరికించేందుకు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ వాపోయింది. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా ఇంటర్వ్యూలో కూడా ఆయేషా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఇంతకు ఆమె ఏమన్నారంటే..?

ఆ అమ్మాయి తన లైఫ్‌లోకి వస్తానంటే.. ఎలా ఒప్పుకుంటానంటూ ప్రశ్నిస్తుంది ఆయేషా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు వెల్లడించింది. ‘ఆ అమ్మాయిది హనీ ట్రాప్. ఆమెకు లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం. అందుకే ఇలా చేసింది. ఆమెను పాములా వాడుకుంటున్నారు. ఈ రోజు ఎవరైతే ఆ అమ్మాయికి సపోర్టు చేసి.. ఇవన్నీ చేయిస్తున్నారో..వాళ్ల ఫ్యామిలీస్ కూడా ఈ పొజిషన్ లో కూర్చుంటారు. నన్ను కొట్టారు అని వాళ్ల మీదే ఆ అమ్మాయి కేసు పెడుతుంది. చివరకు ఆమెను రోడ్డు మీద వదిలేస్తారు. నేను ఆమెను బాగా నమ్మాను. నన్ను బాబీ అని, జానీని భయ్యా అని పిలిచేది. అందుకే అనుమానం రాలేదు. కానీ ఈ రోజు చిన్న విషయం నచ్చకపోవడం వల్లే తనే నాపై అత్యాచారం  చేశాడు అంటూ కంప్లయింట్ చేయడం దారుణం. 16 ఏళ్ల నుండే అత్యాచారం చేశాడని చెప్పడం రాంగ్’ అని తెలిపింది ఆయేషా.

‘జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు వచ్చిన తర్వాత టార్గెట్ చేయడం చూస్తుంటే.. అంత గొప్ప అవార్డు వచ్చిందా అని గర్వంగా ఫీలవుతున్నాం. డ్యాన్స్ మాస్టర్ అధ్యక్ష పదవికి రావాలన్న అగెనెస్ట్ మూమెంట్ కూడా జరుగుతుంది. సినీ ఇండస్ట్రీలో సొంత తమ్ముడు, సొంత సిస్టర్ ఎదుగుతున్నా చూడలేరు. సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతుంటే తట్టుకోలేక ఇదంతా చేస్తున్నారు. ఆయనకు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేదు. ఆయన టాప్‌లో వెళుతున్నాడని తట్టుకోలేక ఈ కుట్ర చేశారు. జానీ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్ ఇండస్ట్రీలోనే లేడు. ఢీ షోలో జానీ అప్పుడప్పుడు వెళ్లినా చాలా క్రేజ్ ఉండేది. ఆయనంటే చాలా మందికి జలస్. జానీ మాస్టర్ స్టైల్‌గా ఉన్నా జలస్సే. ఆయన వే ఆఫ్ లివింగ్, పద్దతి కూడా ఇతరులు కుళ్లుకునే విధంగా ఉంటుంది. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇలా ఎదిగిపోయాడు అనుకుంటున్నారు. అందుకే ఈ కుట్ర చేశారు’ అంటూ చెప్పుకొచ్చింది సుమలత.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet günceldeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobetnakitbahisJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişholiganbetjojobetbetciojojobetcasibomJojobetmarsbahis giriş