iDreamPost
android-app
ios-app

‘చిత్రం’ సినిమా హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడెంతలా మారిపోయిందంటే

  • Published Jan 07, 2024 | 5:53 PM Updated Updated Jan 07, 2024 | 5:53 PM

చిత్రం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన రీమా సేన్ .. ఆ తర్వాత మనసంతా నువ్వే అంటూ కుర్రాళ్ల గుండెల్లో కొలువైంది. పెళ్లి తర్వాత లైమ్ లైట్ కు పూర్తిగా దూరమైన ఈ అమ్మడి ఫొటో ఒకటి తాజాగా వైరల్ గా మారింది. ఆ వివరాలు..

చిత్రం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన రీమా సేన్ .. ఆ తర్వాత మనసంతా నువ్వే అంటూ కుర్రాళ్ల గుండెల్లో కొలువైంది. పెళ్లి తర్వాత లైమ్ లైట్ కు పూర్తిగా దూరమైన ఈ అమ్మడి ఫొటో ఒకటి తాజాగా వైరల్ గా మారింది. ఆ వివరాలు..

  • Published Jan 07, 2024 | 5:53 PMUpdated Jan 07, 2024 | 5:53 PM
‘చిత్రం’ సినిమా హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడెంతలా మారిపోయిందంటే

టాలీవుడ్ కి కొత్త నటీనటులను పరిచయం చేసే దర్శకుల్లో పూరి జగన్నాథ్, తేజ ముందు వరుసలో ఉంటారు. అలా తేజ దర్శకత్వంలో 2000 ఏడాదిలో వచ్చిన చిత్రం సినిమా ద్వారా.. టాలీవుడ్ కి పరిచయమయ్యింది రీమా సేన్. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో కూడా స్టార్ హీరోల సరసన అనేక చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది రీమా సేన్. నార్త్ లో కూడా హిందీతో పాటు బెంగాలీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది రీమా సేన్. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘మిన్నెలే’ చిత్రంతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె నటించిన మనసంతా నువ్వే సినిమా రీమా సేన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తూ.. హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రీమా సేన్.

ఒకప్పుడు చేతినిండా సినిమాలతో టాప్ హీరోయిన్ గా రాణించిన రీమా సేన్.. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో.. పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో సుమారు 12 ఏళ్ల క్రితం వివాహ బంధంలోకి ప్రవేశించింది రీమా సేన్. శివ కరణ్ సింగ్ అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని సినిమా పరిశ్రమకు పూర్తిగా దూరం అయ్యింది. వ్యక్తిగత జీవితంలో బిజీ అయ్యింది. పెళ్లి, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే పనిలో ముగినిపోయింది. ఇలా ఉండగా.. ఈ దంపతులకు 2013లో ఓ కుమారుడు జన్మించాడు. అతడికి రుద్రవీర్ అనే పేరు పెట్టారు.

chitram heroine reemasen

ఆ తర్వాత పూర్తిగా పర్సనల్ లైఫ్ మీదే ఫోకస్ పెట్టింది రీమా సేన్. దాంతో చాలా వరకు జనాలు ఈ అమ్మడి గురించి పట్టించుకోలేదు. కానీ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది రీమా సేన్. కారణం.. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫ్యామిలీ. భర్త, కొడుకుతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది రీమా సేన్. దీనిలో ఆమె కొడుకుని చూసిన వారు.. వామ్మో.. రీమా సేన్ కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలానే అప్పటికి ఇప్పటికి ఈ బ్యూటీ గ్లామర్ మరింత పెరిగింది కానీ తగ్గలేదు అని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన రీమా సేన్.. తాజాగా రీఎంట్రీకి రెడీ అవుతోంది అనే వార్తలు వస్తున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనే నటించాలని నిర్ణయించుకుందంట. వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో రీమాకు ఆల్ ది బెస్ట్ చేబుతున్నారు ఆమె అభిమానులు.

రీమా సేన్ 1981 అక్టోబర్ 29న కోల్ కత్తాలో జన్మించింది. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. నటన మీద ఇంట్రెస్ట్ తో మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. మూవీ అవకాశాలు రావడానికన్నా ముందు.. అనేక యాడ్స్ లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కెరీర్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయిన రీమా సేన్ ముంబైలో నివాసం ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Reema Sen (@senreema29)

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel