మెగా vs అల్లు ఫ్యాన్ వార్ పై చిరు సీరియస్ ?

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వివాదం నడుస్తుంది. . టాలీవుడ్ లో అల్లూ వేరు.. మెగా వేరు అన్న చర్చ బాగా వైరల్ అవుతుంది. మెగా అభిమానులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య వార్ జరుగుతుంది. ఈ విషయం అందరికి తెలిసిందే.ఇది కాస్త చిరు వరకు వెళ్ళిందో ఏమో.. ఈ ఫ్యాన్ వార్ పై చిరంజీవి ఫుల్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వివాదం నడుస్తుంది. . టాలీవుడ్ లో అల్లూ వేరు.. మెగా వేరు అన్న చర్చ బాగా వైరల్ అవుతుంది. మెగా అభిమానులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య వార్ జరుగుతుంది. ఈ విషయం అందరికి తెలిసిందే.ఇది కాస్త చిరు వరకు వెళ్ళిందో ఏమో.. ఈ ఫ్యాన్ వార్ పై చిరంజీవి ఫుల్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వివాదం నడుస్తుంది. . టాలీవుడ్ లో అల్లూ వేరు.. మెగా వేరు అన్న చర్చ బాగా వైరల్ అవుతుంది. మెగా అభిమానులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య వార్ జరుగుతుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ అనేవి తరచూ జరుగుతూనే ఉంటాయి. అందులో ఆశ్చర్యపోవాల్సిన విషయమేమి లేదు. కానీ ఇక్కడ ఒకే కుటుంబానికి సంబంధించిన వారి గురించి ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోవడంతో ఈ ఫ్యాన్ వార్ అసలు ఆగడం లేదు. ఒకరిని మించి మరొకరు సెటైర్లు , ట్వీట్ లు వేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అభిమానం ఉండొచ్చు కానీ ఇలా మరొక హీరోను కించపరిచినట్లు కామెంట్ చేయడం సరి కాదని మ్యూచువల్ ఫ్యాన్స్ సలహాలు మరోవైపు. ఎవరెన్ని చెప్పినా కానీ అల్లు vs మెగా అభిమానుల మధ్య వార్ మాత్రం కొనసాగుతూనే ఉంది. పైగా దీనిని ఓ ట్రెండ్ లా భావిస్తున్నారు మరికొందరు.

అయితే ఫ్యాన్స్ ఎలా కొట్టుకున్నా.. ఫైనల్ గా హీరోలు మాత్రం బాగానే ఉంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. రీసెంట్ గా బన్నీ ఇది ప్రూవ్ చేసాడు కూడా. మెగా అభిమానులు బన్నీని ఎన్ని మాటలు అంటున్నా సరే.. అవేం పట్టించుకోకుండా ఒక షో లో చిరంజీవి అంటే ఎంత అభిమానమో చెప్పేశాడు. ఒక మనిషిగా చిరు ఫ్యాన్ అయ్యాకే మెగాస్టార్ కు అభిమానిగా మారానని.. తన చిన్ననాటి విషయాలతో సహా అన్ని గుర్తుపెట్టుకుని మావయ్య పై ఉండే అభిమానాన్నంతా చెప్పుకొచ్చాడు. కానీ దీనిని మాత్రం మెగా అభిమానులు పట్టించుకోలేదు. పైగా ఇంకాస్త ఎక్కువ ట్రోలింగ్ మొదలైంది. ఇక అటు అల్లు ఆర్మీ కూడా ఎక్కడ తగ్గడం లేదు. పుష్ప ఈవెంట్స్ లో పెద్ద పెద్ద బ్యానర్స్ కట్టి .. పబ్లిక్ గా మెగా ఫ్యాన్స్ కు ఛాలెంజ్ విసురుతున్నారు. ఇది కాస్త చిరు వరకు వెళ్ళిందో ఏమో.. ఈ ఫ్యాన్ వార్ పై చిరంజీవి ఫుల్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే చిరంజీవి కుటుంబ బంధాలకు , బాంధవ్యాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో తెలియనిది కాదు. అటు అల్లు అరవింద్ అయినా సరే.. ఫ్యామిలీ రిలేషన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. చాలా సంధర్భాలలో ఈ విషయాలు బయటపడ్డాయి.

అలాంటిది ఇప్పుడు వారి ఇరు కుటుంబాలకు సంబంధించిన విషయంపై.. ఇంత రచ్చ జరుగుతుంటే ఎంతవరకని చూస్తూ ఉంటారు. అందుకే పుష్ప 2 రిలీజ్ కు ముందే చిరు అందరికి ఈ విషయంపై క్లారిటి ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇక్కడితో ఈ ఫ్యాన్ వార్ కు చెక్ పెట్టడానికి చూస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ రేంజ్ లో వివాదం జరుగుతుంటే.. రిలీజ్ తర్వాత ఇంకెంత విధ్వసం సృష్టిస్తారో అందరు ఊహించవచ్చు. అందుకే రిలీజ్ కు ముందే ఓ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి దీనిపై ఓ క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే సౌత్ లో పుష్ప 2 ఈవెంట్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి ఈ ఈవెంట్స్ కు చిరంజీవి గెస్ట్ గా వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బన్నీ మనసులో చిరు మీద ఎలాంటి అభిమానం ఉందొ బయటపడింది. సో చిరు పుష్ప 2 ఈవెంట్ కు వచ్చే ఛాన్సెస్ బాగానే ఉన్నాయి. వీలైతే అక్కడే ఫ్యాన్స్ కు ఓ క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. చిరంజీవి సీరియస్ అయితే మ్యాటర్ ఎలా ఉంటుందో తెలియనిది కాదు. ఇక ఆ తర్వాతైనా ఫ్యాన్స్ వార్స్ ఆగుతాయో లేదో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments