iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ కోసం చిరంజీవి త్యాగం! అసలు ఏం జరుగుతోందంటే?

  • Published Oct 08, 2024 | 5:13 PM Updated Updated Oct 08, 2024 | 5:13 PM

Chiranjeevi , Ram Charan : వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే క్యూ లో ఉన్నారు స్టార్ హీరోలు. నిన్న మొన్నటి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు సడెన్ గా సంక్రాంతి బరిలోకి చరణ్ ఎంటర్ అవుతున్నాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Chiranjeevi , Ram Charan : వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే క్యూ లో ఉన్నారు స్టార్ హీరోలు. నిన్న మొన్నటి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు సడెన్ గా సంక్రాంతి బరిలోకి చరణ్ ఎంటర్ అవుతున్నాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 08, 2024 | 5:13 PMUpdated Oct 08, 2024 | 5:13 PM
రామ్ చరణ్ కోసం చిరంజీవి త్యాగం! అసలు ఏం జరుగుతోందంటే?

తెలుగు స్టేట్స్ లో సంక్రాంతి చాలా పెద్ద ఫెస్టివల్. అలాగే ఇండస్ట్రీలో కూడా సంక్రాంతికి పెద్ద పీట వేస్తారు మేకర్స్. దాదాపు సంక్రాంతి పండగకు బడా హీరోల సినిమాలే థియేటర్స్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. పైగా హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి.. ఒక్కసారి మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. లాంగ్ రన్ మైంటైన్ చేస్తుంది. ఇలా పక్కా ప్లానింగ్ తో సంక్రాంతి బరిలో దిగుతూ ఉంటారు స్టార్స్. ఈ డేట్స్ కోసం భారీ డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతికి ముందుగానే కర్చీఫ్ వేశారు చిరు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాను.. జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాతో పాటు వెంకటేష్ , బాలకృష్ణ సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల కానున్నట్లు టాక్ వినిపించింది. కానీ ఆ మూవీస్ డేట్స్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ముందుగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న చిరు మూవీ కూడా.. కొడుకు కోసం  త్యాగం చేయాల్సి వస్తుందేమో అనే టాక్ వినిపిస్తుంది.

అసలు మ్యాటర్ ఏంటంటే.. శంకర్ -రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాల టాక్ వినిపిస్తుంది. పైగా రిలీజ్ డేట్స్ కూడా చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. అలాగే ఇప్పటివరకు ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే సరైన అప్డేట్ ఒక్కటి కూడా రాలేదు. దీనితో అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే మరో వైపు మూవీ ఎలా ఉండబోతుందా అనే దిగులు కూడా ఉంది. దీనితో అదిగో ఇదిగో అంటూ మొన్నీమధ్యనే దిల్ రాజు.. మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. డిసెంబర్ 20న లేదా క్రిస్మస్ కు మూవీ రిలీజ్ చేస్తాం అని మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం మూవీ టీం ఇచ్చిన మాట మీద నిలబడేలా కనిపించడం లేదు. అసలు విశ్వంభర గురించి మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా.. ఎందుకంటే అసలు కథ ఇక్కడే ఉంది. గేమ్ ఛేంజర్ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ .. ఇన్సైడ్ ఇండస్ట్రీ టాక్ వినిపిస్తుంది.

ఒకవేళ అదే కనుక జరిగితే చిరు సినిమా వెనక్కు తగ్గాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఫ్యాన్స్ కూడా ప్రతి సారి అడ్జస్ట్ అవుతూ వస్తున్నారు. అంతే కాకుండా శంకర్ తీసిన ఓ బడా మూవీ ఊహించని విధంగా ఫెయిల్ అవ్వడం, గేమ్ ఛేంజర్ అప్డేట్స్ విషయంలో శంకర్ సైలెంట్ గా ఉండడంతో.. అభిమానులలో రకరకాల ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఇక ఈసారి కూడా చెప్పిన సమయానికి రాకపోతే.. ఫ్యాన్స్ కు మూవీపై ఉండే ఇంట్రెస్ట్ కోల్పోయే అవకాశం ఉంది. సో సంక్రాంతికి చరణ్ వస్తే.. చిరు త్యాగం చేయాల్సిందే. ఇప్పటివరకు అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే మేకర్స్ దీనిపై ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. మరి సంక్రాంతి బరిలో తండ్రి దిగుతాడా లేదా కొడుకు ఎంట్రీ ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇద్దరిలో ఎవరిదీ వచ్చినా కానీ మెగా అభిమానులకు మాత్రం పండగే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetcasibomCasibom girişcasibomJojobet GirişcasibomcasibomjojobetcasibomcasibomMariobetMadridbetmarsbahismarsbahis girişganobetpokerklasjojobetCasibomJojobetGrandPashaBet destekDeneme bonusu veren siteler 2026jojobet girişCasibom GirişGrandPashaBet ŞikayetJojobet GirişJojobet Giriş