చిరంజీవి మాస్టర్ మూవీలో నటించిన ఈ విలన్ గుర్తున్నడా..? ఇప్పుడెలా మారిపోయడంటే

చిరంజీవి మాస్టర్ మూవీలో నటించిన ఈ విలన్ గుర్తున్నడా..? ఇప్పుడెలా మారిపోయడంటే

మోగాస్టార్ చిరంజీవి సినిమాలో విలన్ గా నటించిన ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా.. ఇంతకీ ఈయన ఎవరు? ప్రస్తుతం ఎలా ఉన్నారు? ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసుకుందాం.

మోగాస్టార్ చిరంజీవి సినిమాలో విలన్ గా నటించిన ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా.. ఇంతకీ ఈయన ఎవరు? ప్రస్తుతం ఎలా ఉన్నారు? ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసుకుందాం.

సాధరణంగా హీరోయిన్ లేని సినిమా ఉంటుందేమో కానీ, విలన్ లేని సినిమా అంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే.. సినిమాలో హీరోయిజం పండాలంటే.. కచ్చితంగా విలన్ క్యారెక్టర్ ఉండి తీరాల్సిందే. అందుకే ముందుగా ఏ సినిమాలోనైనా విలన్ పాత్రను దర్శకులు హైలైట్ చేస్తారు. ఆ తర్వాత ఆ పాత్రకు ఎండ్ చెప్పే పనిలో హీరోను హైలెట్ చేస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు ఈ విలనీజం పండించే వారిని చూస్తే.. నిజంగా బయట కూడా వాళ్లు అలానే ఉంటారేమో అని ప్రేక్షకులు భయపడుతుంటారు. ఎందుకంటే..సినిమాల్లో ఇలా నటించే యాక్టర్స్ చాలా గంభీరంగా, క్రురత్వంగా ప్రేక్షకుల ముందకు పరిచయమవుతారు కనుక. మరీ, అలా సినిమాల్లో భయంకరమైన విలనీజం పండించిన అలనాటి యాక్టర్స్ లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఓ నటుడు కూడా ఒకరు. ఆయన మరెవరో కాదు.. యాక్టర్ ‘పునీత్ ఇస్సార్‘.

ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ, మోగస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ మూవీ మాఫియా ‘డాన్ డిఆర్’ అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ సినిమాలో విలన్ గా పునీత్ ఇస్సార్ ప్రేక్షకులను భయపెట్టారు. అయితే పునిత్ బాలీవుడ్ అలనాటి దర్శకుడు ‘సుదేష్ ఇస్సార్’ కూమారుడు కావడం గమన్హారం.ఈయన ముంబైలోని నవంబర్ 6 1959లో జన్మించారు. అయితే చిన్నప్పుడు నుంచి నటన మీద ఆసక్తి ఉన్నపునీత్ హీందిలోనే పలు సినిమాల్లో అలరించాడు. అయితే ఈయన ఒక నటుడు మాత్రమే కాకుండా.. రచయితగా, దర్శకుడు, నిర్మాత ఇలా అన్ని రంగాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పునీత్ ఇస్సార్ మొదటిగా 1983 చిత్రం ‘కూలీ’లో విలన్‌గా ప్రారంభించారు.

కాగా, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న పునిత్ ఆ తర్వాత టెలివిజన్ ధారావాహిక ‘మహాభారత్’ (1988-1990) లో దుర్యోధన పాత్రలో అలరించి మంచి గుర్తింపు తెచ్చుకన్నారు. ఇక దుర్యోధన పాత్రతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పునీత్ కు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ పేరిగింది. ఈ క్రమంలోనే హిందీలో వరుస ఆఫర్స్ అందుకొని బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో అలరించారు. అయితే ఇప్పటి వరకు పునీత్ హిందీలో 150కు పైగా సినిమాల్లో నటించారు. అలాగే 100 ప్రాంతీయ చిత్రాలకు పని చేశారు. అంతేకాకుండా..పునీత్ పాపులర్ రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్నారు. అయితే హిందీలో అన్ని సినిమాల్లో అలరించిన పునీత్ కు తెలుగులో మొదటిగా మాస్టర్ మూవీలో అవకాశం వచ్చింది.

ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీని తర్వాత తెలుగులో పునిత్ వరుసగా ఠాగూర్, అల్లరి పిడుగు, నరసింహుడు, చంద్రహోస్, గౌతమ బుద్ధుడు వంటి సినిమాల్లో నటించారు. అయితే చివరిగా పునీత్ ఇస్సార్ 2019లో రామ్ పోతినేని, పూరి జగ్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీలో కాశీ విశ్వనాథ్ అనే పాత్రలో అలరించాడు. మరీ ఆ తర్వాత పునీత్ తెలుగులో ఏ సినిమాలో కూడా నటించలేదు. అలా హిందీ, తెలుగు భాషాల్లోనే కాకుండా పునీత్ బెంగాలీ, పంజాబీ, మరాఠి భాషల్లో కూడా పలు సినిమాల్లో అలరించారు. కానీ, పునీత్ ఇస్సార్ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమాలు మాత్రం కూలీ, మహాభారతం, సరిహద్దు, గర్వ్ తో పాటు 20022లో తెరకెక్కిన కాశ్మీర ఫైల్స్ అనే చెప్పవచ్చు.

ఇక విషయం పక్కన పెడితే.. నటుడు దల్జీత్ పూరి కుమార్తె, నటుడు సత్యజీత పూరి సోదరి దీపాలిని వివాహం చేసుకున్నాడు. కాగా, ప్రస్తుతానికి వీరిద్దరికి నివృత్తి ఇస్సార్, సిద్ధాంత్ ఇస్సార్ అనే ఇద్దరు పిల్లులు ఉన్నారు. పునీత్ కు అయితే ప్రస్తుతం 60 సంవత్సరాల వయసులో ఉన్న పునీత్ ఇస్సార్ ఇప్పటికి అదే ఫిట్ నెస్ మెంటైన్ చేయడమే కాకుండా.. అందుకు సంబంధించి పలు ముఖ్యమైన అంశఆలను కూడా సోషల్ మీడియాలో సలహాలు ఇస్తుంటారు. మరీ, మాస్టర్ మూవీ విలన్ పునీత్ ఇస్సార్ బ్యాక్ గ్రౌండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments