Chiranjeevi: వరద బాధితులకు మెగా విరాళం.. AP, తెలంగాణకు చిరంజీవి భారీ సాయం

Chiranjeevi Donation To AP, TG: భారీ వర్షాలు, వరదలతో అతాలకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలను ఆదుకోవండ కోసం మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించారు. ఆ వివరాలు..

Chiranjeevi Donation To AP, TG: భారీ వర్షాలు, వరదలతో అతాలకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలను ఆదుకోవండ కోసం మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించారు. ఆ వివరాలు..

మూడ్రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు పోటేత్తాయి. ఇక నిన్నటి నుంచి వరదలు కాస్త తగ్గు ముఖం పట్టినప్పటికి.. పరిస్థితి మాత్రం ఇంకా చక్కబడలేదు. ఇక భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలు ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇళ్లన్నీ నీట మునగడంతో కట్టుబట్టలతో సహాయక శిబిరాలకు చేరుకున్న జనాలు. తిండి, నీరు కోసం అలమటిస్తున్నారు. వారిని ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. అంతేకాక.. వరద బాధితులను ఆదుకోవడం కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.

ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీ ముందుకొచ్చింది. చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు వరద బాధితుల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి సినీ స్టార్స్ తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధులకు భారీ ఎత్తున విరాళం ప్రకటించారు. ఇప్పుడు ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల సీఎంల సహాయక నిధికి చెరో రూ. 50 లక్షల చొప్పున కోటి రూపాయల భారీ విరాళం ప్రకటించారు చిరంజీవి. ఇక తెలుగు రాష్ట్రల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన నష్టం తనను కలిచి వేసిందన్నారు. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉందని చిరు పిలపునిచ్చారు.

ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల్లో వరదల వల్ల బాధపడుతున్న ప్రజలను ఆదుకోవడం కోసం తన వంతుగా కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను అని తెలిపారు చిరు. అలాగే ఈ వరదల వల్ల పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం అన్నారు. ప్రతి ఒక్కరు వరద బాధితులను ఆదుకోవాలని..  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో అధికారులు, సహాయక సిబ్బంది పరిస్థితిని మెరుగుపరిచేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితులు త్వరగా తొలిగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయన చేసిన సాయం పట్ల జనాలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show comments